పక్షం రోజుల్లో కూలీ నిర్ణయం
● 24 గంటల నిరాహార దీక్ష విరమణ ● చేనేతజౌళి అధికారుల హామీపై హర్షం
సిరిసిల్లటౌన్: ప్రభుత్వ ఆర్డర్ల చీరల కూలీని పక్షం రోజుల్లో నిర్ణయిస్తామని చేనేత జౌళిశాఖ అధికారులు వెల్లడించారు. సిరిసిల్లలోని పవర్‌లూమ్ పరిశ్రమలోని కార్మికులకు పది శాతం యారన్ సబ్సిడీ విడుదల, కూలీ పెంపుపై మంగళవారం కార్మికనేతలతో అధికారులు చర్చలు జరిపారు. చేనేతజౌళీశాఖ జేడీ ఎన్.వీ.రావు హామీతో తాత్కాలికంగా సమ్మె విరమిస్తున్నట్లు కార్మికనాయకులు ప్రకటించారు. హామీలు నెరవేర్చకపోతే పదిహేను రోజుల్లో మళ్లీ సమ్మెబాట పడతామని హెచ్చరించారు. కార్మిక నాయకులు మూశం రమేశ్, అన్నల్‌దాస్ గణేశ్, కోడం రమణ, సిరిమల్ల సత్యం, కుమ్మరికుంట కిషన్, ఉడుత రవి, మచ్చ వేణు, నక్క దేవదాస్, గుండు రమేశ్, బాస శ్రీధర్, వెలిగేటి శ్రీనివాస్, వెజిగం సురేష్, బచ్చు సదానందం, అల్వాల భాస్కర్ పాల్గొన్నారు.


