● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
వేములవాడరూరల్: మహిళలను కోటీశ్వరులను చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో 50 శాతం మహిళా సంఘాల ద్వారానే కొనుగోలు చేసేందుకు ఆదేశాలు ఇచ్చిందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. వేములవాడలోని బాలానగర్, రూరల్ మండలం చెక్కపల్లి, మల్లారం ధాన్యం కొనుగోలు కేంద్రాలను పీఏసీఎస్ ఆధ్వర్యంలో బుధవారం ప్రారంభించారు. విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లాలో 248 సెంటర్లను ఏర్పాటు చేశామని, ఇప్పటి వరకు 35 సెంటర్లను ప్రారంభించినట్లు తెలిపారు. అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు వసంతలక్ష్మి, మార్కెట్ డీఎం రజిత, డీసీవో రామకృష్ణ, పీఏసీఎస్ చైర్మన్ ఏనుగు తిరుపతిరెడ్డి, వేములవాడ, రుద్రంగి మార్కెట్ కమిటీ చైర్మన్‌లు రొండి రాజు, చెల్కల తిరుపతి, వైస్‌చైర్మన్ కనికరపు రాకేశ్, రూరల్ కాంగ్రెస్ అధ్యక్షుడు వకుళాభరణం శ్రీనివాస్, ఏఎంసీ పాలకవర్గ సభ్యులు దైత కుమార్, రాజయ్య పాల్గొన్నారు.
చివరి గింజ వరకు కొంటాం
కోనరావుపేట(వేములవాడ): రైతులు పండించిన చివరి గింజ వరకు కొంటామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. కోనరావుపేట, నిజామాబాద్‌లో సింగిల్‌విండో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. సన్న వడ్లు పండించే రైతులను ప్రోత్సహించాలని ఉద్దేశంతో క్వింటాల్‌కు అదనంగా రూ.500 ఇస్తున్నట్లు తెలిపారు. తహసీల్దార్ వరలక్ష్మి, ఏవో సందీప్, సింగిల్‌విండో చైర్మన్ బండ నర్సయ్య, కాంగ్రెస్ అధ్యక్షుడు షేక్ ఫిరోజ్ పాషా, ఏఎంసీ చైర్మన్ ఎల్లయ్య, వైస్‌చైర్మన్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
ధాన్యం కొనుగోళ్లలో మహిళా సంఘాలు


