మహిళలు ఆర్థికంగా ఎదగాలి
ఇల్లంతకుంట(మానకొండూర్): ప్రభుత్వ ప్రోత్సాహంతో మహిళలు ఆర్థికంగా ఎదగాలని మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కోరారు. మండల కేంద్రంలో ఐకేపీ సంఘాలకు అప్పగించిన వరిధాన్యం, పొద్దుతిరుగుడు కొనుగోలు కేంద్రాలను బుధవారం కలెక్టర్ సందీప్‌కుమార్ ఝాతో కలిసి ప్రారంభించారు. మండలంలోని సిరికొండలో లబ్ధిదారు సత్యనారాయణ ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేశారు. గ్రామంలో 42 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు లబ్ధిదారులు ముగ్గులు పోసుకున్నారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఎమ్మెల్యే, కలెక్టర్‌లు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఓపీ రిజిష్టర్‌ను పరిశీలించారు. రక్తపరీక్షలు ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. పల్లె దవాఖానాలో పీహెచ్‌సీ నిర్వహణ సౌలభ్యంగా లేకపోవడంతో అదనంగా పక్కనున్న మహిళా సంఘాల ఏవో భవనం అప్పగించేలా చర్యలు తీసుకోవాలని డీఆర్డీవో శేషాద్రిని ఆదేశించారు. మండలకేంద్రంలోని ఎస్సీకాలనీలో రూ.50 లక్షలతో చేపట్టనున్న సీసీరోడ్డు పనులను ప్రారంభించారు. మండల పరిషత్ 67 మందికి సీఎమ్మార్‌ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం మండల కేంద్రంలోని సన్నబియ్యం లబ్ధిదారు గణేశ్ ఇంట్లో ఎమ్మెల్యే, కలెక్టర్, జిల్లా అధికారులు భోజనం చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లకోసం ఈనెల 14లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మార్కెట్ కమిటీ చైర్మన్ ఐరెడ్డి చైతన్య, డీఆర్డీవో శేషాద్రి, తహసీల్దార్ ఎంఏ ఫరూక్, ఎంపీడీవో శశికళ, ఎంపీవో శ్రీనివాస్, ఐకేపీ ఏపీఎం వాణిశ్రీ, హౌసింగ్ ఏఈ హకీం, ఏఎంసీ వైస్‌చైర్మన్ ఎలగందుల ప్రసాద్, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు భాస్కర్‌రెడ్డి, వి.వెంకటరమణారెడ్డి, గుడిసె ఐలయ్య పాల్గొన్నారు.
మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ
సన్నబియ్యం లబ్ధిదారు ఇంట్లో భోజనం
మహిళలు ఆర్థికంగా ఎదగాలి


