అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు
కోనరావుపేట: మండలకేంద్రంలోని పీఎం శ్రీ పాఠశాల వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. చిన్నారులు చేసిన నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
కనులపండువగా రథోత్సవం
● ఏకాంత సేవతో ముగిసిన బ్రహ్మోత్సవాలు
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండలంలోని నారాయణపూర్‌లోని వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి దత్తత సీతారామచంద్రస్వామి ఆలయంలో నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రథోత్సవం కనులపండువగా సాగింది. మహిళలు మంగళహారతులతో వచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. రాత్రి 7 గంటలకు ఏకాంత సేవతో బ్రహ్మోత్సవాలు ముగిసినట్లు ఆలయ అర్చకుడు వేణుగోపాలచారి ప్రకటించారు. టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు ఎలుసాని ప్రవీణ్‌కుమార్, మాజీ సర్పంచ్‌లు నిమ్మ లక్ష్మి, దొమ్మాటి నర్సయ్య, మాజీ ఉపసర్పంచ్ మహేందర్, మాజీ ఎంపీటీసీ అపెరా సుల్తాన, అర్చకులు నవీన్‌చారి, ఆలయ కమిటీ చైర్మన్ మోతె లక్ష్మారెడ్డి, నాయకులు ఎలుసాని మోహన్‌కుమార్, నిమ్మ మల్లారెడ్డి, లింగాల అంజాగౌడ్, లద్దునూరి హన్మండ్లు, సుధాకర్‌రెడ్డి పాల్గొన్నారు.
అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు


