డిమాండ్ల సాధనకు సమష్టి కృషి
షాద్‌నగర్: డిమాండ్ల సాధనకు బీసీలందరూ ఐక్యంగా ముందుకు సాగాలని బీసీ సేన జాతీయ అధ్యక్షుడు బర్క కృష్ణ సూచించారు. గురువారం పట్టణంలోని ఓ హోటల్‌లో బీసీ సేన జిల్లా అధ్యక్షుడు పసుపుల ప్రశాంత్ ముదిరాజ్ ఆధ్వర్యంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విచ్చేసిన బర్క కృష్ణ మాట్లాడుతూ.. సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో బీసీలు మరింతగా రాణించాల్సిన అవసరం ఉందన్నారు. బీసీల ఐక్యత, సామాజిక న్యాయ సాధనకు తమ సంస్థ అహర్నిశలు కృషి చేస్తోందని తెలిపారు. హక్కుల పరిరక్షణకు అందరూ కలిసి కట్టుగా ముందుకు సాగుతూ డిమాండ్లను నెరవేర్చుకోవాలన్నారు. ముఖ్యంగా బీసీ యువత ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాల్లో రాణించేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అనంతరం బీసీ సేన నియోజకవర్గ అధ్యక్షుడిగా చంద్రశేఖరప్పను ఎన్నుకున్నారు. సమావేశంలో నాయకులు బాబయ్య, సత్యం, లక్ష్మణ్, రాజు, చందులాల్, శంకరయ్య, జగదీష్ గౌడ్, మల్లేశ్‌గౌడ్, శివకుమార్, రవి, రాఘవేందర్, రమేశ్, వరప్రసాద్, చందు, సత్యం, హరీశ్‌కుమార్, నరేశ్, సాయి, రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.
బీసీ సేన జాతీయ అధ్యక్షుడు బర్క కృష్ణ
Comments
Please login to add a commentAdd a comment