మాదకద్రవ్యాలతో అనర్థాలు
పహాడీషరీఫ్: నేరాల పట్ల అవగాహన పొంది వాటికి దూరంగా ఉండాలని మహేశ్వరం ఏసీపీ లక్ష్మీకాంతరెడ్డి సూచించారు. బాలాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని బిస్మిల్లా కాలనీలో బుధవారం రాత్రి ఇన్‌స్పెక్టర్ సుధాకర్‌తో ఆయన కలిసి విజిబుల్ పోలీసింగ్‌లో భాగంగా స్థానికులకు నేరాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు ఆదేశానుసారం నిత్యం ఏదో ఒక బస్తీలో విజిబుల్ పోలీసింగ్ చేపట్టి ప్రజలను అప్రమత్తం చేస్తున్నామన్నారు. ముఖ్యంగా యువత డ్రగ్స్, గంజాయి లాంటి వాటికి బానిసలై జీవితాలను నాశనం చేసుకుంటున్నారన్నారు. వాటితో కలిగే నష్టాలను ఈ సందర్భంగా వివరించారు. సైబర్ క్రైమ్స్ పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. సోషల్ మీడియాలో వచ్చే ఆకర్షణీయమైన లింక్‌లను ఓపెన్ చేయరాదని సూచించారు. రహదారి నియమాలు పాటించి రోడ్డు ప్రమాదాలకు దూరంగా ఉండాలన్నారు. సెల్‌ఫోన్లు విరివిగా వాడుతూ దుష్ప్రభావాలకు లోనుకారాదన్నారు. సోషల్ మీడియాలో వచ్చే వదంతులు నమ్మి శాంతి భద్రతల భంగం కలిగించేలా వ్యవహరించకూడదని సూచించారు. కార్యక్రమంలో ఎస్సైలు యూసుఫ్ జానీ, శ్రీనివాసులు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఏసీపీ లక్ష్మీకాంతరెడ్డి
Comments
Please login to add a commentAdd a comment