ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచాలి
షాద్‌నగర్: ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచాలని డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ విజయలక్ష్మి సూచించారు. పట్టణంలోని ప్రభుత్వ కమ్యూనిటీ ఆస్పత్రిలో గురువారం డివిజన్‌లోని వైద్యాధికారులు, హెల్త్ సూపర్‌వైజర్లు, ఏఎన్‌ఎంలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని గ్రామాల్లో ఆరోగ్య సిబ్బంది గర్భిణులను గుర్తించాలని అన్నారు. ఎప్పటికప్పుడు వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవాలతో కలిగే లాభాలను వివరించాలన్నారు. గ్రామాల్లో 30 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులు అందజేయాలన్నారు. వైద్యులు అన్నివేళలా ప్రజలకు అందుబాటులో ఉండాలని, విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో హెల్త్ ఎడ్యుకేటర్ శ్రీనివాసలు, వైధ్యాధికారులు అమృత జోసెఫ్, హరికిషన్, స్రవంతి, రాఘవేందర్, నికిత, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.
డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ విజయలక్ష్మి
Comments
Please login to add a commentAdd a comment