క్షయ నివారణ టీకాలు వేసుకోండి
ఇబ్రహీంపట్నం: భవిష్యత్తులో క్షయవ్యాధి ప్రబలకుండా టీకాలు వేయించుకోవాలని జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ పాపారావు అన్నారు. ఇబ్రహీంపట్నం ప్రభుత్వ సివిల్ అస్పత్రిలో బీసీజీ టీకాల ఉపయోగంపై గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీబీ నిర్మూలనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతున్నాయని తెలిపారు. 60 సంవత్సరాలు పైబడిన వృద్ధులు, అతిగా మద్యం సేవించేవారు, పొగాకు నమిలేవారు, పోషకాహార లోపం ఉన్నవారు, షుగర్ వ్యాధిగ్రస్తులు, ఇంతకు ముందు టీబీ వ్యాధి సోకినవాళ్లు బీసీజీ టీకాలు తీసుకోవాలని సూచించారు. ఇందుకోసం సంబంధిత పీహెచ్‌సీ వైద్యులను సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ సుధామాధవి, పీఎండీటీ సూపర్‌వైజర్ శ్రీనివాస్, డీపీఎం విల్సన్, డివిజన్ వైద్యులు, సూపర్‌వైజర్లు పాల్గొన్నారు.
డాక్టర్ పాపారావు
Comments
Please login to add a commentAdd a comment