
ఏదీ నాటి దర్జా?
షాబాద్: ఒకప్పుడు వెలుగువెలిగిన దర్జీల బతుకు నేడు దయనీయంగా మారింది. రెడీమేడ్ రాకతో వారి బతుకుచక్రం ఒడిదొడుకులకు గురైంది. షోరూముల్లో ఆకట్టుకునేలా వివిధ వస్త్రాలు అందుబాటులో ఉండడంతో టైలర్లకు ఆదరణ కరువైంది. దీంతో పనులు లేక.. కటుంబాలు గడవక వారు ఇబ్బందులు పడుతున్నారు. రెండు దశాబ్దాల క్రితం టైలర్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ప్రస్తుతం హైదరాబాద్‌లాంటి నగరాలతో పాటు చిన్నచిన్న పటణాలకు సైతం రెడీమేడ్ రంగం విస్తరించడంతో మామూలుగా దుకాణాలు నడుపుకొనే వారి పరిస్థితి అధ్వానంగా మారింది. కొంతమంది వృత్తికి స్వస్తి చెప్పి ప్రత్నామ్నాయ మార్గాలు వెతుక్కోగా మరికొందరు అడపాదడపా వచ్చే ఒకటిరెండు గిరాకీలతో నెట్టుకొస్తున్నారు.
ఆదరణ తగ్గింది
గతంలో ప్రతి ఒక్కరూ దుస్తులు కుట్టించుకుని వేసుకునేవారు. ప్రస్తుతం షొరూంలోకి వెళ్లి కోనుగోలు చేస్తున్నారు. మార్కెట్‌లోకి రెడీమెడ్ దుస్తులు రావడంతో టైలర్‌కు ఆదరణ తగ్గింది.
– బర్క శ్రీశైలం, టైలర్, షాబాద్
పెళ్లిళ్ల సీజనే ఆసరా
సంవత్సరంలో రెండు నెలలు మాత్రమే పని దొరుకుతోంది. మిగతా రోజుల్లో ఇబ్బంది పడుతున్నాం. గతంలో సొంతంగా టైలర్ షాపు నడుపుకునేవాడిని. ప్రస్తుతం వేరే షాపులో కూలి పని చేస్తున్నాను. పెళ్లిళ్ల సీజన్ ఉన్నప్పుడే గిరాకీ ఉంటోంది.
– రామస్వామి, టైలర్, షాబాద్
పని తగ్గిపోయింది
గతంలో దర్జీ పని చేసేవా ళ్లకు మంచి ఆదరణ ఉండేది. ప్రస్తుతం కొత్త కొత్త షోరూంలు రావడంతో మాకు పని లేకుండా పో యింది. కాలానుగుణంగా వస్తున్న వివిధ డిజైన్లు నేర్చుకుంటూ దు స్తు లు కుడుతున్నాం.
– సాజిత్, టైలర్, షాబాద్
దర్జీలకు ఆదరణ కరువు
రెడీమేడ్ వస్త్రాలతో చతికిల
భారంగా బతుకు చక్రం
నేడు టైలర్స్ డే
Comments
Please login to add a commentAdd a comment