‘భరోసా’.. వచ్చింది
షాద్‌నగర్: ఉపాధి హామీ పఽథకంలో పని చేస్తున్న కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఉపాధి కూలీలకు ఆర్థిక భరోసా కల్పిస్తూ ప్రభుత్వం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఏడాదికి రెండు విడతల్లో నిధులు జమ చేయనుంది. మొదటి విడతలో భాగంగా శివరాత్రి రోజున కూలీల కుటుంబాలకు రూ.6వేల చొప్పున వారి బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేసింది. జిల్లాలోని 21 మండలాల పరిధిలో 560 గ్రామ పంచాయతీల్లో ఎంపిక చేసిన లబ్ధిదారులకు ప్రభుత్వం రూ.6కోట్ల 38 లక్షల 40 వేలు మంజూరు చేసింది. నిధులను నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. దీంతో జిల్లా వ్యాప్తంగా 10,640 మంది ఉపాధి హామీ కూలీల కుటుంబాలకు లబ్ధి చేకూరింది.
వీరికే ఆత్మీయ భరోసా..
● భూమి లేని రైతులు, వ్యవసాయ కార్మికులకే పథకం వర్తిస్తుంది.
● 2023–24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఉపాధి హామీ పథకంలో కనీసం 20 రోజుల పని పూర్తి చేసిన ఉపాధి హామీ కూలీలు అర్హులు.
● శాశ్వత నివాసం ఉన్న వారు, ధరణి పోర్టల్‌లో ఒక్క గుంట కూడా భూమి లేని నిరుపేదలను ఈ పథకం కింద ఎంపిక చేశారు.
● ప్రభుత్వం నుంచి వచ్చిన జాబితా ప్రకారం గ్రామ సభలు నిర్వహించారు. అర్హుల జాబితాను ప్రకటించి అభ్యంతరాలు స్వీకరించి, లబ్ధి దారులను గుర్తించారు.
రైతుల ఖాతాల్లో జమ
ఇందిరమ్మ భరోసా పథకం కింద ఉపాధి హామీ పథ కంలో పని చేస్తున్న భూమి లేని పేదలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా నిధులు జమయ్యాయి.
– అరుణ, ఏపీఓ, ఫరూఖ్‌నగర్
సంక్షేమమే ధ్యేయం
ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంది. రైతుల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తోంది. భూమి లేని పేదలకు అండగా నిలిచింది. ఇందిరమ్మ భరోసా పథకం కింద ఆర్థిక సాయం అందజేసింది.
– వీర్లపల్లి శంకర్, ఎమ్మెల్యే, షాద్‌నగర్
మండలం లబ్ధిదారులు
అబ్దుల్లాపూర్‌మెట్ 720
ఆమనగల్లు 368
చేవెళ్ల 207
చౌదరిగూడ 267
ఫరూఖ్‌నగర్ 538
ఇబ్రహీంపట్నం 749
కడ్తాల్ 390
కందుకూరు 1,566
కేశంపేట 330
కొందుర్గు 142
కొత్తూరు 32
మాడ్గుల 828
మహేశ్వరం 269
మంచాల 948
మొయినాబాద్ 65
నందిగామ 106
షాబాద్ 432
శంషాబాద్ 89
శంకర్‌పల్లి 454
తలకొండపల్లి 689
యాచారం 1,451
ఉపాధి హామీ కూలీలకు నిధులు విడుదల
ఒక్కో కుటుంబానికి రూ.6వేల చొప్పున..
జిల్లాకు రూ.6.38 కోట్లు మంజూరు
లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా జమ
10,640 కుటుంబాలకు లబ్ధి
Comments
Please login to add a commentAdd a comment