రంజాన్‌కు సౌకర్యాలు కల్పించాలి
ఇబ్రహీంపట్నం రూరల్: రంజాన్‌ను ప్రశాంతంగా జరుపుకోవాలని అడిషనల్ కలెక్టర్ ప్రతిమాసింగ్ సూచించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం వివిధ శాఖల అధికారులు, మత పెద్దలు, మైనార్టీ సంక్షేమ శాఖ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అన్ని ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో పని చేయాలని చెప్పారు. విద్యుత్, తాగునీరు, పారిశుద్ధ్యం, భద్రతపై ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. ఇఫ్తార్, సహర్ సమయాల్లో నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చూసుకోవాలని, మసీదులు, ఈద్గాల చుట్టూ పరిశుభ్రతపై శ్రద్ధ పెట్టాలని, రోడ్లపై సరైన లైటింగ్ ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. శాంతిభద్రతలను నిశితంగా పరిశీలించాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకొకుండా చూడాలని మహేశ్వరం జోన్ డీసీపీ సునీతారెడ్డికి సూచించారు. కార్యక్రమంలో జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ అధికారి నవీన్‌కుమార్‌రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
అడిషనల్ కలెక్టర్ ప్రతిమా సింగ్
Comments
Please login to add a commentAdd a comment