చేవెళ్ల: జిల్లా అదనపు సెషన్స్ కోర్టును చేవెళ్ల మండల కేంద్రంలో శుక్రవారం హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సుజేయ్‌పాల్, సామ్‌కోసి, జిల్లా ప్రధాన న్యాయముర్తి ఎస్. శశిధర్‌రెడ్డి వర్చవల్ విధానంలో ప్రారంభించారు. జిల్లా అదనపు సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ప్రదీప్‌నాయక్ నేరుగా శిలాఫలకాలను ప్రారంభించారు. కార్యక్రమంలో చేవెళ్ల సీనియర్ సివిల్‌కోర్టు జడ్జి దశరథ రామయ్య, సీనియర్ న్యాయవాదులు పి.రాంరెడ్డి, రేసు మహేందర్‌రెడ్డి, అనంత్‌సేన్‌రెడ్డి, చేవెళ్ల బార్ అసోషియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, కార్యదర్శి సత్యానందం, ప్రభుత్వ ప్లీడర్ బి.యాదిరెడ్డి, పలువురు న్యాయవాదులు, సిబ్బంది పాల్గొన్నారు.
వర్చవల్‌గా ప్రారంభించిన హైకోర్టు న్యాయమూర్తులు
Comments
Please login to add a commentAdd a comment