ప్రభుత్వ భూమి సర్వే
కేశంపేట: మండల పరిధిలోని బైర్కాన్‌పల్లి గ్రామం సర్వే నంబర్ 53లో డంపింగ్ యార్డు పక్కన ఉన్న ప్రభుత్వ భూమిని రెవెన్యూ అధికారులు సర్వే చేశారు. డంపింగ్ యార్డు పక్కన ఉన్న ప్రభుత్వ భూమిని పట్టాభూమిలో కలుపుకొనేందుకు యజమాని హద్దురాళ్లు పాతాడు. ‘ఆక్రమణల పర్వం’ శీర్షికన శుక్రవారం ప్రచురితమైన కథనానికి స్పందించిన ఉన్నతాధికారులు సదరు భూమిలో సర్వే చేయాలని ఆదేశించారు. ఈ మేరకు ఆర్‌ఐ నివేదిత, మండల సర్వేయర్ వెంకటేశ్ యాదవ్ ప్రభుత్వ భూమిని సర్వే చేసి కబ్జాలో ఉన్న 2.27 ఎరకాల భూమిని కాపాడారు. ప్రభుత్వ భూములు కబ్జా చేస్తే కఠిన చర్యలు తప్పవని తహసీల్దార్ అజాంఅలీ హెచ్చరించారు. గుర్తించిన ప్రభుత్వ భూమికి హద్దులు ఏర్పాటు చేశామని, నివేదికను ఉన్నతాధికారులకు పంపించినట్టు చెప్పారు.
పులందరి వాగుకు హద్దులు
ఇబ్రహీంపట్నం రూరల్: ఆదిబట్ల మున్సిపల్ పరిధిలోని ఎంపీ పటేల్‌గూడలో ఉన్న పులందరి వాగుకు శుక్రవారం హద్దురాళ్లు పాతారు. ‘పూడ్చేస్తాం.. ఆక్రమిస్తాం’ శీర్షికన గత నెల 18న ‘సాక్షి’లో కథనం ప్రచురితమైన సంగతి తెలిసిందే. దీనిపై వెంటనే స్పందించిన రెవెన్యూ అధికారులు సర్వే చేపట్టారు. ఈ క్రమంలో తాజాగా హద్దురాళ్లు పాతి, వాగులో పోసిన మట్టిని తొలగించారు.
కొలతల ప్రకారం యూనిఫాం కుట్టాలి
కందుకూరు: విద్యార్థుల యూనిఫాం కొలతల ప్రకారం, నాణ్యతతో కుట్టాలని డీఆర్‌డీఓ శ్రీలత ఆదేశించారు. మండల పరిధిలోని పులిమామిడిలో శుక్రవారం సెర్ప్ అధికారులు, ఐకేపీ సిబ్బందితో పాటు స్వయం సహాయక గ్రూపుల మహిళలతో ఆమె సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గత ఏడాది కుట్టిన యూనిఫాం విషయమై ఫిర్యా దులు వచ్చాయని, ఈ ధపా ముందుగానే ప్రతి విద్యార్థి కొలతలు తీసుకుని పాఠశాలలు తిరిగి పునఃప్రారంభమయ్యేలోపు అందించేలా చూడాలన్నారు. అనంతరం గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో ఆమె హెచ్‌ఎం రవీందర్‌రెడ్డి, ఉపాధ్యాయులతో యూనిఫాం విషయమై చర్చించారు. అంతకుముందు గ్రామ పంచాయతీ నర్సరీని సందర్శించి మొక్కల పెంపకాన్ని పరిశీలించారు. ఆమె వెంట ఎంపీడీఓ సరిత, ఏపీఎం కవిత, పీఏఓ రవీందర్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శి రాజు, టీఏ బాల్‌రెడ్డి, ఐకేపీ సీసీలు, ఏఫ్‌ఏలు ఉన్నారు.
ఉద్యాన పంటలపై
దృష్టి సారించాలి
మహేశ్వరం: తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వచ్చే ఉద్యాన పంటలను రైతులు సాగు చేసుకోవాలని జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ అధికారి సురేష్ సూచించారు. మండల పరిధిలోని మన్సాన్‌పల్లిలో రైతులు సాగు చేసిన పూలు, ఆయిల్ పామ్ పంటలను శుక్ర వారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు ఆయిల్‌పామ్ పంటల సాగుపై దృష్టి సారించాలన్నారు. ప్రభుత్వం ఆయిల్ పామ్ సాగు చేసేవారికి సబ్సిడీ అందించి ప్రోత్సహిస్తోందని తెలిపారు. ఈ సాగులో చీడపీడల బెడద ఉండదని, కూలీల ఖర్చు తక్కువగా ఉంటుందన్నారు. హైదరాబాద్‌కు అతి చేరువలో ఉన్న మహేశ్వరం, కందుకూరు మండలాల్లో కూరగాయలు, పండ్లు, పూలు, తోటల పెంపకం చేపట్టి అధిక లాభాలు ఆర్జించాలన్నారు. అంతకు ముందు రైతులకు ఉద్యాన పంటల సాగులో తీసుకోవాల్సిన మెలకువలను వివరించారు. కార్యక్రమంలో మండల ఉద్యాన అధికారి సౌమ్య పాల్గొన్నారు
Comments
Please login to add a commentAdd a comment