దేశాభివృద్ధిలో స్టార్టప్‌లు కీలకం | - | Sakshi
Sakshi News home page

దేశాభివృద్ధిలో స్టార్టప్‌లు కీలకం

Published Sat, Mar 1 2025 7:47 AM | Last Updated on Sat, Mar 1 2025 7:46 AM

దేశాభ

దేశాభివృద్ధిలో స్టార్టప్‌లు కీలకం

అంకురాలకు పెద్దపీట

అంకుర సంస్థలకు ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తోంది. ఐటీ పెట్టుబడులకు సైబరాబాద్‌ కేంద్రంగా మారింది. యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయి. 16 ఫార్మా కంపెనీలకు ఫార్మా క్లస్టర్లలో భూములు కేటాయించాం. సెప్టెంబర్‌లో స్కిల్‌ యూనివర్సిటీ కోర్సులు ప్రారంభం కానున్నాయి.

– జయేశ్‌రంజన్‌, ముఖ్యకార్యదర్శి, ఐటీ, పరిశ్రమలశాఖ

ఆరోగ్యం కూడా ముఖ్యమే

భవిష్యత్తులో కృత్రిమ మేథ (ఏఐ)తో పోటీపడాల్సి రావొచ్చు. భయపడి వెనుకడుగు వేయొద్దు. దేశాభివృద్ధి అంటే ఆర్థికాభివృద్ధి సాధించడం మాత్రమే కాదు. ఆరోగ్యం, మానసిక ప్రశాంత కూడా ముఖ్యం. జీవితాన్ని బ్యాలెన్స్‌ చేసుకోవాలి. రెండింటికీ సమప్రాధాన్యత ఇచ్చినప్పుడే ఆశించిన లక్ష్యాన్ని అధిగమించగలం.

– శ్రీనిరాజు చింతలపాటి,

చైర్మన్‌, ఐల్యాబ్స్‌

ఓర్పు, నేర్పు కావాలి

యూనికాన్‌ పొజిషన్‌కు చేరుకోవడం అంత సులభం కాదు. ఓర్పు, నేర్పుతోనే సాధ్యం. సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. మానసిక కుంగుబాటుకు లోనుకాకుండా చూసుకోవాలి. బలమైన అభ్యాసాల ద్వారా మాత్రమే ఎంచుకున్న గమ్యాన్ని చేరుకుంటాం.

– ఫణింద్రసామ, ఫౌండర్‌, రెడ్‌బస్‌

కార్యక్రమంలో పాల్గొన్న వక్తలు

సాక్షి, రంగారెడ్డి జిల్లా: దేశాభివృద్ధిలో స్టార్టప్‌ (అంకుర)లదే కీలక పాత్ర అని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. యూనికాన్‌ సంస్థల ద్వారా పెట్టుబడి పెట్టిన వాళ్లు స్వయం సమృద్ధి సాధించడంతో పాటు యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారని ప్రకటించారు. ముఖ్యంగా ఫార్మా, హెల్త్‌కేర్‌, ఐటీ రంగాల్లో స్టార్టప్‌లదే కీలకమని అన్నారు. నందిగామ మండలం కన్హాశాంతివనంలో శుక్రవారం నిర్వహించిన ‘స్టార్టప్‌ ఫోరం– 2025’లో వివిధ రాష్ట్రాలకు చెందిన సుమారు 50 మంది అంకుర కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. వచ్చే పదేళ్లలో ఐదు ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సృష్టించమే లక్ష్యంగా దేశం ముందుకు సాగుతోందని, ఇందులో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. సంస్థ స్థాపన ఒక్కటే లక్ష్యం కాదన్నారు. పెట్టుబడి, సాంకేతిక పరిజ్ఞానం, తక్కువ ఖర్చుకే మౌలిక సదుపాయాలు సమకూర్చుకుని సంస్థను ఆర్థికంగా నిలబెట్టడం పెద్ద సవాలుగా మారిందదన్నారు. ఈ సమయంలో కంపెనీ వ్యవస్థాపకులు అనేక ఒత్తిళ్లకు లోనవుతుంటారని, ధ్యానం, యోగా ద్వారా వీటిని అధిగమించొచ్చని సూచించారు. ఇందుకు కన్హాశాంతి వనం గొప్ప వేదిక అని కొనియాడారు. పలు సంస్థల ప్రతినిధులు ఆర్తిగుప్తా, మల్లికారెడ్డి, శ్రీకాంత్‌ అయ్యర్‌, శివకుమార్‌గణేషన్‌, సతీష్‌ ఆండ్ర, వాణికోల తదితరులు తమ అనుభవాలను యువ స్టార్టప్‌లతో పంచుకున్నారు.

ధ్యానంతో మానసిక ప్రశాంతత

ప్రస్తుత పోటీ ప్రపంచంలో రాణించాలంటే టాలెంట్‌ ఒక్కటే సరిపోదు. అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అన్నింటినీ తట్టుకుని ముందుకు సాగాలంటే ముందు మానసికంగా ధృడంగా తయారు కావాల్సి ఉంటుంది. ధ్యానంతో మానసిక ప్రశాంతత లభిస్తుంది.

– ప్రజ్ఞామిశ్ర, పబ్లిక్‌ పాలసీ అండ్‌ పార్టనర్‌షిప్‌

సవాళ్లను తట్టుకుని నిలబడాలి

స్ఫూర్తిదాయకమైన వ్యాపారవేత్తల తరాన్ని మనం తయారు చేయాలి. భారత్‌ కేవలం స్టార్టప్‌ వ్యవస్థాపకులను ఉత్పత్తి చేసే దేశమే కాదు సవాళ్లను సమర్థవంతంగా తట్టుకుని నిలబడే నాయకత్వం, సామాజిక స్పృహ ఉన్న వాళ్లను తయారు చేసే వ్యవస్థగా గుర్తింపు తేవాలి. ధ్యానం అంతర్గత సామర్థ్యాన్ని పెంపొందిస్తుంది.

– దాజీ, శ్రీరామచంద్ర మిషన్‌ అధ్యక్షుడు

వచ్చే పదేళ్లలో ఐదు ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థే లక్ష్యం

ఆలోచన, పెట్టుబడే కాదు మానసిక దృఢత్వమూ ముఖ్యమే..

స్వయంసమృద్ధితో పాటు యువతకు ఉపాధి అవకాశాలు

పలువురు వక్తల అభిప్రాయం

కన్హా శాంతివనంలో స్టార్టప్‌ ఫోరం– 2025

No comments yet. Be the first to comment!
Add a comment
దేశాభివృద్ధిలో స్టార్టప్‌లు కీలకం 1
1/5

దేశాభివృద్ధిలో స్టార్టప్‌లు కీలకం

దేశాభివృద్ధిలో స్టార్టప్‌లు కీలకం 2
2/5

దేశాభివృద్ధిలో స్టార్టప్‌లు కీలకం

దేశాభివృద్ధిలో స్టార్టప్‌లు కీలకం 3
3/5

దేశాభివృద్ధిలో స్టార్టప్‌లు కీలకం

దేశాభివృద్ధిలో స్టార్టప్‌లు కీలకం 4
4/5

దేశాభివృద్ధిలో స్టార్టప్‌లు కీలకం

దేశాభివృద్ధిలో స్టార్టప్‌లు కీలకం 5
5/5

దేశాభివృద్ధిలో స్టార్టప్‌లు కీలకం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement