పేదల పక్షాన పోరాటం
తుర్కయంజాల్: పేద ప్రజల పక్షాన పోరాడే ఏకై క పార్టీ సీపీఐ అని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబ శివ రావు అన్నారు. తుర్కయంజాల్ మున్సిపల్ పరిధి బ్రాహ్మణపల్లిలో శుక్రవారం నిర్వహించిన పార్టీ శతాబ్ది ఉత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశంలో చొక్కాలు మార్చినట్లు పార్టీలు మార్చే వారు కమ్యూనిస్టు పార్టీని విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. పొత్తులు శాశ్వతం కాదని స్పష్టం చేశారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని నాయకులు, కార్యకర్తలకు సూచించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట్ రెడ్డి, నాయకులు రవీంద్రచారి, కొంతం మాధవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబ శివరావు
Comments
Please login to add a commentAdd a comment