విన్యాసాలు అదుర్స్
మొయినాబాద్: స్థానిక ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీ (ఐఐటీఏ)లో శుక్రవారం శిక్షణ పూర్తి చేసుకున్న 72 జాగిలాల 24వ బ్యాచ్ పాసింగ్ ఔట్ పరేడ్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన జాగిలాల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. జాగిలం హాండిలర్ (యజమాని) చెప్పినట్లుగా నమస్కారం చేయడం.. జాతీయ జెండాకు గౌరవ వందనం సమర్పించడం.. యజమాని పడుకోమని చెబితే పడుకోవడం.. దొర్లమని చెబితే దొర్లడం.. మంటల్లో నుంచి దూకడం.. యజమాని వస్తువు పడిపోతే వెతికి పట్టుకురావడం.. న్యూస్ పేపర్, ఇతర వస్తువులు తెచ్చివ్వడం.. కదిలే వాహనాలపై యజమాని చెప్పిటన్లు గౌరవ వందనం చేయడం.. మందు పాత్రలను గుర్తించడం.. శత్రువులపై దాడి చేసి పట్టుకోవడం వంటి ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమానికి ఇంటెలిజెన్స్ డీజీపీ బి.శివధర్‌రెడ్డి ముఖ్య అథితిగా హాజరయ్యారు.
విన్యాసాలు అదుర్స్
విన్యాసాలు అదుర్స్
Comments
Please login to add a commentAdd a comment