మద్యం మత్తులో భార్యను తోసేసిన భర్త
శంషాబాద్ రూరల్: మద్యం మత్తులో భార్యను తోసేయడంతో బస్సు ఢీకొని తీవ్ర గాయాలయ్యాయి. వివరాలివీ.. దేవరకద్ర మండలం కౌకుంట్లకు చెందిన బద్దన్న, పద్మ దంపతులు మున్సిపాలిటీ పరిధిలోని రాళ్లగూడలో నివాసముంటున్నారు. స్వగ్రామానికి వెళ్లేందుకు శంషాబాద్ బస్టాండ్‌కు వచ్చారు. షాద్‌నగర్ వైపు వెళ్లే మార్గంలో బస్సు కోసం వేచి ఉన్నారు. ఈ క్రమంలో ఇద్దరూ గొడవపడ్డారు. మద్యం మత్తులో ఉన్న బద్దన్న భార్యను తోసేశాడు. ఇదే సమయంలో అఫ్జల్‌గంజ్ నుంచి శంకరాపురం వెళ్తున్న బస్సు పద్మను ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు 108కు సమాచారం ఇవ్వడంతో అంబులెన్స్‌లో ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. బద్దన్నను చితకబాదారు. కేసు దర్యాప్తులో ఉంది.


