
● కొత్త కాలనీల్లో సమస్య
అవసరం ఉన్న చోట కొత్త బోర్లు
మున్సిపాలిటీలో మొత్తం 116 బోర్లు ఉన్నాయి. వాటిలో 84 పని చేస్తుండగా.. 32 పని చేయడం లేదు. నీటి వనరులు ఉన్న బోర్లను గుర్తించి వారం రోజుల్లో మరమ్మతులు చేయిస్తాం. అవసరం ఉన్న చోట కొత్త బోర్లు వేసేందుకు ప్రణాళికలు రూపొందించాం. టెక్నికల్ అనుమతుల కోసం వేచి చూస్తున్నాం.
– యోగేశ్, మున్సిపల్ కమిషనర్
శంకర్‌పల్లి: మున్సిపాలిటీలో సుమారు 7వేల వరకు నివాసాలు ఉన్నాయి. 4,592 నివాసాలకు గాను మిషన్ భగీరథ కనెక్షన్లు ఉన్నాయి. మిగతా నివాసాలకు బోర్లు, ట్యాంకర్లతో నీటి సరఫరా చేస్తున్నారు. కాలక్రమేణా పట్టణం విస్తరిస్తోంది. కొత్త కాలనీలు వెలుస్తున్నాయి. భారీగా నిర్మాణాలు జరగుతున్నాయి. కొత్తగా ఏర్పడుతున్న కాలనీల్లో తాగునీటి సమస్య తప్పడం లేదు. అధికారులు పైప్‌లైన్ లేని చోట్ల రెండు ట్యాంకర్ల ద్వారా, పైప్‌లైన్లు ఉన్న చోట సమీపంలోని బోర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. ఇప్పటి వరకు సాయి కాలనీ, శ్రీరాంనగర్, సాయిబాబా టెంపుల్, పోలీస్ క్వార్టర్స్ ఏరియాలో పైపులైన్ మరమ్మతులు, లీకేజీ పనులు పూర్తయ్యాయి. రిత్విక్ వెంచర్, మైనార్టీ కాలనీల్లో ఇతరత్రా పనుల కారణంగా పైప్‌లైన్ పనులు నెమ్మదిగా సాగుతున్నాయి. పట్టణంలోని రెడ్డి కాలనీ, బోప్పన్న వెంచర్, ఆదర్శ్‌నగర్, క్రిస్టల్ వెంచర్–1లో కొత్తగా లైన్లు వేయాల్సి ఉంది.