బాలురు | - | Sakshi
Sakshi News home page

బాలురు

Mar 26 2025 9:18 AM | Updated on Mar 26 2025 9:18 AM

బాలుర

బాలురు

బుధవారం శ్రీ 26 శ్రీ మార్చి శ్రీ 2025
18,384

అత్తాపూర్‌ హసన్‌నగర్‌కు చెందిన ఓ ఏసీ టెక్నీషియన్‌కు సులేమాన్‌నగర్‌కు చెందిన మహిళతో వివాహమైంది. చాంద్రాయణగుట్టలోని బాబానగర్‌లో కాపురం పెట్టారు. వీరికి ఇప్పటికే ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు. ఆమె మళ్లీ గర్భం దాల్చింది. అప్పటి నుంచి వేధింపులు ఎక్కువయ్యాయి. మూడో సంతానంలోనూ మళ్లీ ఆడబిడ్డ పుడుతుందనే అనుమానంతో భర్త నెల రోజుల క్రితం తల్లీబిడ్డలను నడిరోడ్డున వదిలేసి వెళ్లాడు.

సాక్షి, రంగారెడ్డిజిల్లా: పురుషులకు దీటుగా మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నప్పటికీ.. ఆడబిడ్డలపై మాత్రం ఇప్పటికీ వివక్ష కొనసాగుతూనే ఉంది. పుట్టుక నుంచి చదువు, తినే తిండి, వేసుకునే బట్టలు ఇలా అన్నిట్లోనూ వివక్ష ఎదుర్కొంటూనే ఉంది. సమాజంపై అంతో ఇంతో అవగాహన ఉన్నవాళ్లు సైతం అదే ధోరణిలో వ్యవహరిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. పుత్రుడు పుడితే తమను పున్నామ నరకం నుంచి తప్పిస్తాడనే భావన ఇప్పటికీ మెజార్టీ తల్లిదండ్రుల్లో ఉంది. అంతేకాదు తమ తర్వాత వంశం అంతరించిపోకుండా అలాగే కొనసాగుతుందనే నమ్మకం. ఆడపిల్లకు చదువు చెప్పించడం, పెళ్లి చేయడం చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కావడంతో ఇప్పటికీ భారంగా భావిస్తున్నారు. కడుపులో పెరుగుతున్నది ఆడబిడ్డ అని తెలిస్తే చాలు.. కన్ను తెరవకముందే కాటికి పంపేస్తున్నారు. లింగనిర్ధారణ పరీక్షలు చేయడం నేరమని తెలిసీ కొన్ని డయాగ్నోస్టిక్‌ సెంటర్లు కాసులకు కక్కుర్తిపడి యథేచ్ఛగా పరీక్షలు చేస్తున్నాయి. మొదటి, రెండో కాన్పు తర్వాత ఎక్కడ మళ్లీ ఆడబిడ్డే పుడుతుందో అనే భయంతో నిండు గర్భిణులను వదిలేస్తున్న భర్తలూ లేకపోలేదు. అత్తామామలు, ఆడబిడ్డలు, భర్త తరపు ఇతర బంధువుల సూటిపోటి మాటలను తట్టుకోలేక మహిళలు కూడా అబార్షన్లకు తలవంచుతున్నారు.

బాలబాలికల నిష్పత్తిలో భారీ వ్యత్యాసం

2023–24లో జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో 39,861 ప్రసవాలు జరిగితే, వీటిలో 20,903 మంది బాలురు, 18,958 మంది బాలికలు జన్మించారు. 2024–25లో 35,377 ప్రసవాలు జరిగితే 18,384 మంది బాలురు, 16,993 మంది బాలికలు జన్మించారు. 2023–24లో ప్రతి వెయ్యి మంది బాలురకు 907 మంది బాలికలు జన్మించగా, 2024–25లో 924 మంది జన్మించడం గమనార్హం. ఫలితంగా జిల్లాలో బాలబాలికల నిష్పత్తిలో భారీ వ్యత్యాసం నమోదువుతోంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో జన్మిస్తున్న శిశువులతో పోలిస్తే..ప్రైవేటు ఆస్పత్రుల్లో జన్మిస్తున్న ఆడ శిశువుల సంఖ్య చాలా తక్కువగా ఉంటుండడం గమనార్హం.

న్యూస్‌రీల్‌

ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు, బాలబాలికల నిష్పత్తి

సంవత్సరం బాలురు బాలికలు నిష్పత్తి

2023–24 12,424 11,458 922

2024–25 10,381 9,956 959

ప్రైవేటు ఆస్పత్రుల్లో ప్రసవాలు, బాలబాలికల నిష్పత్తి

సంవత్సరం బాలురు బాలికలు నిష్పత్తి

2023–24 8,479 7,500 885

2024–25 8,003 7,037 879

మొత్తం ప్రసవాలు, బాలబాలికల నిష్పత్తి

సంవత్సరం బాలురు బాలికలు నిష్పత్తి

2023–24 20,903 18,958 907

2024–25 8,384 16,993 924

బాలురు1
1/1

బాలురు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement