
సదాశివపేట (సంగారెడ్డి): వేగంగా వచ్చిన కారు ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌లోకి దూసుకెళ్లింది. టేక్మాల్ మండలం ఎల్లపేటకు చెందిన శ్రీకాంత్‌తో సహా నలుగురు వికారాబాద్‌లోని అనంతగిరి గుట్ట నుంచి తిరిగి వస్తున్నారు.
మార్గమధ్యలో మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో పట్టణంలో ఉన్న నరసింహ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లోకి కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో నాలుగు బైకులు దెబ్బతిన్నాయి. హోటల్‌కూ నష్టం వాటిల్లింది. ప్రమాదం జరిగిన వెంటనే కారులో ఉన్న నలుగురిలో ముగ్గురు పారిపోయారు. ఒకరిని పోలీసులు అదుపులో తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment