గజ్వేల్‌రూరల్: ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, లేనిపక్షంలో గద్దె దిగాలని మెదక్ ఎంపీ రఘునందన్‌రావు అన్నారు. పట్టణంలోని భగవాన్ శ్రీసత్యసాయి మందిరంలో గజ్వేల్ డివిజన్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన శ్రీ విశ్వావసు నామ సంవత్సర పంచాంగ ఆవిష్కరణ కార్యక్రమంలో బీజేపీ మానవ హక్కుల విభాగం రాష్ట్ర కన్వీనర్ కప్పర ప్రసాదరావు, జిల్లా అధ్యక్షుడు బైరీ శంకర్‌లతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్థిక పరిస్థితి బాగాలేదని అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడటంపై ప్రజలు ఆలోచించాలన్నారు. కార్యక్రమం బ్రాహ్మణ సేవా సంఘం ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు.
ఎంపీ రఘునందన్‌రావు


