పాపన్నపేట(మెదక్): ప్రభుత్వ పాఠశాలు పరిపూర్ణ వికాస కేంద్రాలుగా విరాజిల్లుతున్నాయని జిల్లా విద్యాశాఖాధికారి రాధాకిషన్ రావు అన్నారు. మంగళవారం సాయంత్రం పొడిచన్‌పల్లి ప్రాథమిక పాఠశాలలో జరిగిన వార్షికోత్సవానికి అదనపు ఎస్పీ మహేందర్, డీఎస్పీ ప్రసన్న కుమార్‌తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒత్తిడి లేకుండా, ఆట పాటలతో నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వ ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారని అన్నారు. అదనపు ఎస్పీ మాట్లాడుతూ.. ఈ రోజు ఉన్నత పదవుల్లో ఉన్నవారంతా ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన వారేనని గుర్తు చేశారు. విద్యార్థులకు చిన్నప్పటి నుంచే దేశభక్తి, విలువలతో కూడిన విద్యను అందించాలని సూచించారు. డీఎస్పీ మాట్లాడుతూ.. వార్షికోత్సవ వేడుకలు చూస్తుంటే, తమ చిన్ననాటి రోజులు గుర్తుకొస్తున్నాయని అన్నారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. కా ర్యక్రమంలో ఎంఈఓలు ప్రతాప్ రెడ్డి, నీలకంఠం, ఎస్సై శ్రీనివాస్‌గౌడ్, సుదర్శణమూర్తి, నవీన్, రాజి రెడ్డి, ప్రధానోపాధ్యాయులు, టీచర్లు పాల్గొన్నారు.
డీఈవో రాధాకిషన్ రావు
పొడిచన్‌పల్లి ప్రభుత్వ పాఠశాలలో
వార్షికోత్సవం
బడులు పరిపూర్ణ వికాస కేంద్రాలు


