రాష్ట్రస్థాయి పోటీలకు పూలే విద్యార్థినులు
వర్గల్(గజ్వేల్): వికసిత్ భారత్ నేషనల్ యూత్ పార్లమెంట్ రాష్ట్రస్థాయి పోటీలకు వర్గల్ జ్యోతిబా పూలే గురుకుల మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినులు ఎంపికయ్యారు. ఇటీవల సిద్దిపేటలో ‘ఒక దేశం–ఒక ఎన్నిక’ అంశంపై నిర్వహించిన ఉపన్యాస పోటీల్లో గురుకుల కళాశాలకు చెందిన ఫైనలియర్ విద్యార్థినులు పుప్పాల శ్రీజ, గంగుల నవ్య చక్కని ప్రతిభ కనబర్చినట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ భాస్కర్‌రావు పేర్కొన్నారు. వీరికి హైదరాబాద్ అసెంబ్లీ సమావేశంలో పాల్గొని మాట్లాడే అరుదైన అవకాశం లభించనుందని తెలిపారు. విద్యార్థినులను ప్రిన్సిపాల్‌తోపాటు ప్రోగ్రామ్ ఆఫీసర్స్ డాక్టర్ రాధారాణి, భాగ్యలక్ష్మి, అధ్యాపకులు అభినందించారు.
మహిళలతో
అసభ్యకర ప్రవర్తన
– ఇద్దరు రిమాండ్
మెదక్ మున్సిపాలిటీ: మద్యం మత్తులో మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తించిన ఇద్దరిని పట్టణ పోలీసులు అరెస్టు చేసిన రిమాండ్‌కు తరలించారు. పట్టణ సీఐ నాగరాజు బుధవారం తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ పట్టణానికి చెందిన ఇద్దరు మహిళలు మంగళవారం రాత్రి పాత బస్టాండ్ వద్ద నుంచి స్కూటీపై వెళ్తున్నారు. మద్యం మత్తులో బైక్‌పై వెళ్తున్న మెదక్ పట్టణానికి చెందిన ప్రదీప్‌కుమార్, గిరికల మహేశ్ కుమార్ మహిళల పక్క నుంచి వెళ్తూ అసభ్యకరంగా ప్రవర్తించారు. పక్కన ఉన్న వారు వారించే ప్రయత్నం చేసినా వినలేదు. బాధిత మహిళలు నేరుగా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధితుల్లో ఒకరు ప్రభుత్వ ఉద్యోగి ఉన్నారు. ఈ మేరకు ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు.
ఇద్దరిపై పోక్సో కేసు
కొమురవెల్లి(సిద్దిపేట): రెండు వేర్వేరు కేసుల్లో ఇద్దరిపై పోక్సో కేసు నమోదు చేసిన ఘటన కొమురవెల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బుధవారం చేర్యాల సీఐ శ్రీను కథనం మేరకు.. మండలంలోని వేచరేణి గ్రామానికి చెందిన దినేష్, చేర్యాల పట్టణానికి చెందిన రాములు ఇద్దరు మైనర్ల పట్ల దురుసుగా ప్రవర్తించారు. బాధితుల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారిపై పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్ తరలించినట్లు తెలిపారు.
యువకుడు గల్లంతు
మనోహరాబాద్(తూప్రాన్): చెరువులో యువకుడు గల్లంతమైన ఘటన మనోహరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ సుభాష్‌గౌడ్ కథనం మేరకు.. మండలంలోని రంగాయపల్లి గ్రామానికి చెందిన మన్నె అజయ్‌కుమార్ (26) చేపలు పట్టడానికి గ్రామ చెరువులోకి వెళ్లాడు. ప్రమాదవశాత్తు గల్లంతయ్యాడు. గ్రామస్తులతో గాలింపు చర్యలు చేపట్టిన ఆచూకీ లభ్యం కాలేదు. గురువారం మరోసారి గాలింపు చర్యలు చేపట్టనున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
రాష్ట్రస్థాయి పోటీలకు పూలే విద్యార్థినులు
రాష్ట్రస్థాయి పోటీలకు పూలే విద్యార్థినులు


