దు:ఖం దిగమింగి.. పరీక్ష రాసి
నిజాంపేట(మెదక్): తండ్రి మరణించిన బాధను దిగమింగుకొని విద్యార్థిని పరీక్షకు హాజరైంది. ఈ ఘటన మండలంలోని నస్కల్ గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన సత్యం (48) బుధవారం ఉదయం గుండెపోటుతో మృతి చెందాడు. మృతుడికి ముగ్గురు కూతుర్లు ఉండగా.. రెండో కూతురు కావ్యశ్రీ కామారెడ్డి జిల్లా జంగంపల్లిలోని కేజీబీవీ పాఠశాలలో పదో తరగతి చదువుతుంది. తండ్రి గుండెపోటుతో మృతి చెందాడని ఉదయమే సమాచారం రావడంతో తోటి విద్యార్థులు ఓదార్చారు. పరీక్ష రాసేలా ధైర్యం చెప్పారు. కావ్యశ్రీ గణితశాస్త్రం పరీక్ష రాసి నస్కల్ గ్రామంలోని తండ్రి అంత్యక్రియలకు హాజరైంది.


