ఘనంగా శ్రీపాండురంగ ఆలయ వార్షికోత్సవం | - | Sakshi
Sakshi News home page

ఘనంగా శ్రీపాండురంగ ఆలయ వార్షికోత్సవం

Mar 28 2025 6:20 AM | Updated on Mar 28 2025 6:17 AM

రాయికోడ్‌(అందోల్‌): రాయికోడ్‌లోని శ్రీరుక్మిణీ పాండురంగ ఆలయ 14వ వార్షికోత్సవం గురువారం ఘనంగా నిర్వహించారు. ముందుగా అర్చకులు శ్రీరుక్మిణీదేవి పాండురంగేశ్వరులకు అభిషేకం,ప్రత్యేక పూజలు చేశారు. ప్రతేకంగా అలంకరించిన వాహనంపై ఉత్సవ విగ్రహాలను ఉంచి డప్పుచప్పుళ్ల మధ్య పిల్లలు,పెద్దలు,యువకులు భజన చేస్తూ, నృత్యాలు చేస్తూ గ్రామ పురవీధుల గుండా శోభయాత్ర నిర్వహించగా మహిళలు నిండు కలశాలతో విచ్చేశారు. ఆలయం లోశ్రీరుక్మిణి పాండురంగడికి మహాహారతి ఇచ్చి భక్తులకు తీర్థప్రసాదాలను వితరణ చేశారు.

ఎన్‌హెచ్‌ఆర్‌సీ జిల్లా చైర్మన్‌గా వినాయక్‌ పవార్‌

జహీరాబాద్‌ టౌన్‌: జాతీయ మానవ హక్కుల కమిటీ(ఎన్‌హెచ్‌ఆర్‌సీ)జిల్లా చైర్మన్‌గా జహీరాబాద్‌కు చెందిన వినాయక్‌ పవార్‌ నియమితులయ్యారు. ఈ మేరకు ఆ సంఘం జాతీయ అధ్యక్షుడు మహ్మద్‌ యాసీన్‌ ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వినాయక్‌ పవార్‌ మాట్లాడుతూ... ప్రజల సమస్యల పరిష్కారం కోసం తన వంతు కృషిచేస్తానని చెప్పారు.

ఐలా నూతన కార్యవర్గం ఎన్నిక

పటాన్‌చెరు: పటాన్‌చెరు పారిశ్రామికవాడలో ఐలా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అయితే చైర్మన్‌ పదవికి సుధీర్‌రెడ్డిపై పోటీ చేసిన చంద్రశేఖర్‌రెడ్డి అనర్హతకు గురి కావడంతో సుధీర్‌ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నియ్యారు. వైస్‌ చైర్మన్‌ పదవికి పోటీ ఉండటంతో గురువారం టీఎస్‌ఐఐసీ కార్యాలయంలో ఎన్నికల నిర్వహించారు. దీనిలో 134 ఓట్లు పోలవగా ప్రభాకర్‌పై, శ్రీను 112 ఓట్ల తేడాతో గెలుపొందారు. అలాగే జనరల్‌ సెక్రటరీగా కుటుంబరావు, కోశాధికారిగా సురేందర్‌రెడ్డి, జాయింట్‌ సెక్రటరీగా మురళి, సభ్యులు శ్రీశైలం, బసవరావు, శంకర్‌, శ్రీనివాసరావు, నారాయణరెడ్డి, గంగోత్రి శ్రీనివాస్‌, శ్రీదేవిలను ఎన్నుకున్నారు.

ఎస్పీ దంపతుల ప్రత్యేక పూజలు

సంగారెడ్డి టౌన్‌: సంగారెడ్డి పట్టణ శివారులోని శ్రీ వైకుంఠపురంలో ఎస్పీ పరితోష్‌ పంకజ్‌ దంపతులు గురువారం శ్రీవెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ దంపతులను దేవాల య ప్రధాన అర్చకులు వరదాచార్యులు సన్మానించారు. దేవాలయ విశిష్టత గురించి ఎస్పీకి వివరించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో ఇఫ్తార్‌

సంగారెడ్డి జోన్‌: సంగారెడ్డి పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో పోలీసు శాఖ ఆధ్వర్యంలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు గురువారం రాత్రి ఇఫ్తార్‌ను ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ పరితోష్‌ పంకజ్‌, అదనపు ఎస్పీ సంజీవరావు హాజరై ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఉప వాస దీక్షను విరమించారు. ఈ సందర్భంగా చిన్నారులకు, అధికారులకు ఎస్పీ పరితోష్‌ ఖర్జూర పండును తినిపించారు.

సంగారెడ్డి ‘బార్‌’

అధ్యక్షుడిగా విష్ణువర్ధన్‌రెడ్డి

వరుసగా మూడోసారి ఎన్నిక

సంగారెడ్డి టౌన్‌: సంగారెడ్డి బార్‌ అసోసియేషన్‌లో జరిగిన ఎన్నికల్లో 9వసారి అధ్యక్షుడిగా విష్ణువర్ధన్‌రెడ్డి విజయ ఢంకా మోగించారు. ఉపాధ్యక్షుడిగా భూపాల్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా వి.మహేశ్‌, సంయుక్త కార్యదర్శిగా ఎన్‌.మల్లేశం, కోశాధికారిగా శ్రీకాంత్‌, క్రీడల కార్యదర్శిగా టి.శ్రీనివాస్‌, గ్రంథాలయ కార్యదర్శిగా నిజాముద్దీన్‌ రషీద్‌, మహిళా ప్రతినిధిగా మంజులారెడ్డి, కార్యవర్గ సభ్యులుగా బుచ్చయ్య, సుభాష్‌ చందర్‌, నరసింహ, మాణిక్‌రెడ్డి, రాములు, ఎం.దత్తాత్రి, భాస్కర్‌ విజయం సాధించారు.

ఘనంగా శ్రీపాండురంగ ఆలయ వార్షికోత్సవం 1
1/3

ఘనంగా శ్రీపాండురంగ ఆలయ వార్షికోత్సవం

ఘనంగా శ్రీపాండురంగ ఆలయ వార్షికోత్సవం 2
2/3

ఘనంగా శ్రీపాండురంగ ఆలయ వార్షికోత్సవం

ఘనంగా శ్రీపాండురంగ ఆలయ వార్షికోత్సవం 3
3/3

ఘనంగా శ్రీపాండురంగ ఆలయ వార్షికోత్సవం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement