భూ సమస్యలను త్వరగా పరిష్కరించాలి
సంగారెడ్డి టౌన్ : మండలంలో వివిధ సమస్యలపై వచ్చేవారికి త్వరగా పరిష్కరించాలని సంగారెడ్డి ఆర్డీవో రవీందర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. సంగారెడ్డి మండల తహసీల్దార్ కార్యాలయాన్ని గురువారం ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...మండలంలోని వివిధ గ్రామాల నుంచి సమస్యలపై వచ్చే వారికి క్షుణ్ణంగా సమస్యలకు పరిష్కారం చెప్పాలన్నారు. మట్టి అక్రమ రవాణాపై ప్రతీ విభాగం తనిఖీలు చేయాలని సూచించారు. కుల,ఆదాయ, నివాస ధ్రువపత్రాలను త్వరగా మంజూరు చేయాలని చెప్పారు. ఆర్డీవో వెంట మండల అధికారులు,సిబ్బంది తదితరులున్నారు.
సంగారెడ్డి ఆర్డీవో రవీందర్‌రెడ్డి


