ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

Apr 12 2025 8:52 AM | Updated on Apr 12 2025 8:52 AM

ధాన్యం కొనుగోలు  కేంద్రం ప్రారంభం

ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

రామచంద్రాపురం(పటాన్‌చెరు): రైతుల సమస్యలను పరిష్కారానికి తన వంతు చేస్తున్నా నని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌ రెడ్డి అన్నారు. శుక్రవారం తెల్లాపూర్‌ మున్సిపల్‌ పరిధిలోని వెలిమెల రైతు వేదిక కేంద్రంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రైతుకు మద్దతు ధర ఇచ్చేందుకు రైతు కొనుగోలు కేంద్రాలు ఎంతో ఉపయోగపడుతున్నాయని వివరించారు. కొనుగోలు కేంద్రం వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలను కల్పించామన్నారు. రైతులు దళారులను ఆశ్రయిస్తే నష్టపోతారని తెలిపారు. రైతులందరు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించాలని కోరారు. ప్రభుత్వం సన్న రకం వడ్ల పైన క్వింటాలకు రూ.2320తో పాటు అదనంగా రూ.500 బోనస్‌గా చెల్లిస్తుందని తెలిపారు. దీనిని రైతులందరు సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో తెల్లాపూర్‌ సొసైటీ చైర్మన్‌ బుచ్చిరెడ్డి, మాజీ సర్పంచ్‌ సోమిరెడ్డి, నాయకులు దేవేందర్‌ యాదవ్‌, విజయ్‌ కుమార్‌, ఇంద్రారెడ్డి, నాగరాజు, సాగర్‌లు పాల్గొన్నారు.

అండర్‌పాస్‌ బ్రిడ్జి

నిర్మించండి

కేంద్రమంత్రి గడ్కరీకి బీఎంఎస్‌ వినతి

జహీరాబాద్‌: జహీరాబాద్‌ పట్టణంలోని అల్గోల్‌ క్రాస్‌రోడ్డు వద్ద 65వ జాతీయ రహదారిపై అండర్‌పాస్‌ బ్రిడ్జి నిర్మించాల్సిందిగా కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీకి వినతి పత్రం అందజేశారు. జహీరాబాద్‌ పట్టణానికి చెందిన బీఎంఎస్‌ జాతీయ ఉపాధ్యక్షుడు కె.లక్ష్మారెడ్డి కేంద్రమంత్రి నితిన్‌గడ్కరీని నాగపూర్‌లో కలిసి వినతిపత్రం అందజేశారు. అండర్‌పాస్‌ నిర్మించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని సూచించారు. అండర్‌పాస్‌ నిర్మించే వరకు హై మాస్‌ లైట్లను ఏర్పాటు చేయించాలని కోరారు. సిద్దేశ్వర్‌ మందిరం వద్ద అండర్‌పాస్‌ నిర్మించినా ప్రజలు జాతీయ రహదారిపైకి వెళ్లేందుకు సర్వీస్‌రోడ్డు నిర్మించలేదని, దీంతో ఇబ్బందులు పడుతున్నట్లు వివరించారు. సర్వీస్‌రోడ్డును సైతం నిర్మించేలా చూడాలని కోరారు. ఇందుకు కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించినట్లు, సాధ్యమైనంత త్వరలో పనులు చేపడతామని చెప్పినట్లు లక్ష్మారెడ్డి తెలిపారు.

రైతులను ఆదుకోవాలి

నారాయణఖేడ్‌: ఖేడ్‌ ప్రాంతంలో వడగళ్లతో కూడిన అకాల వర్షం వల్ల నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి కోరారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ప్రాంతంలో గురువారం ఈదురు గాలు లు, వడగళ్లతో భారీ వర్షం కురవడంతో వందల ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లిందన్నారు. ప్రస్తుతం వరి పంట కోత దశలో ఉందని, ఈ క్రమంలో ఒక్క సారిగా వడగళ్లతో కూ డిన భారీ వర్షం కురియడంతో పంటకు భారీ నష్టం వాటిల్లిందని చెప్పారు. ప్రధానంగా కల్హేర్‌ మండలం బీబీపేట్‌, ఖానాపూర్‌, క్రిష్ణాపూర్‌, మార్డి తదితర గ్రామాల్లో వందలాది ఎక రాల్లో వరి పంట నేలకు ఒరిగిందన్నారు. ప్రభు త్వం పంట పొలాలను సర్వే చేయించి నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.50 వేల చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు.

మల్టీపర్పస్‌ విధానాన్ని

రద్దు చేయాలి

సదాశివపేట రూరల్‌(సంగారెడ్డి): గ్రామపంచాయతీల్లో అమలు చేస్తున్న మల్టీ పర్పస్‌ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని గ్రామ పంచాయతీ యూనియన్‌ జిల్లా కార్యదర్శి దశరథ్‌ డిమాండ్‌ చేశారు. శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ...గ్రామపంచాయతీ సిబ్బంది నాలుగు నెలల బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలన్నారు. వేతనాలకు ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్‌ కేటాయించాలని,గ్రీన్‌ఛానల్‌ ద్వారా వేతనాలు చెల్లించాలన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనం రూ. 26 వేల ఇవ్వాలన్నారు. లేనిపక్షంలో ఈనెల 19 తర్వాత ఎప్పుడైనా రాష్ట్రవ్యాప్తంగా సమ్మె నిర్వహిస్తామని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement