తాగునీటి సమస్య తలెత్తకుండా చూడండి
టెలీకాన్ఫరెన్స్‌లో
డీపీఓ సాయిబాబా
సంగారెడ్డి జోన్: వేసవిలో జిల్లాలో ఎక్కడా తాగునీటి సమస్య తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ) టి.సాయిబాబా సూచించారు. జిల్లాలోని డి.ఎల్.పీ.ఓ లు, ఎంపీఓలు పంచాయతీ కార్యదర్శులతో శుక్రవారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా డీపీఓ మాట్లాడుతూ...వేసవి కాలంలో కొన్ని ప్రాంతాల్లో తాగు నీటి ఎద్దడి ఏర్పడే అవకాశం ఉందని ముందుగానే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సూచించారు. నీటి సరఫరా కోసం ట్యాంకర్లు అందుబాటులో ఉంచాలని చెప్పారు.


