మతం పేరుతో మారణ హోమం
హుస్నాబాద్: మతం పేరుతో మారణ హోమం సాగిస్తూ హిందూ సెంటిమెంట్‌తో మళ్లీ అధికారంలోకి రావాలని నరేంద్ర మోదీ పూనుకుంటున్నారని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్ రెడ్డి ఆరోపించారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం భారత రాజ్యాంగానికి విఘాతం కలిగిస్తుందని సీపీఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ముఖ్య అతిథిగా చాడ వెంకట్ రెడ్డి హాజరయ్యారు. అంతక ముందు మహాత్మా జ్యోతిబా పూలే జయంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. చాడ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. జ్యోతిబా పూలే, సావిత్రీ బాయి పూలేలు ఉద్యమ సంస్కరణలకు పునాది వేశారన్నారు. ఒక మతం పై మరో మతం పెత్తనం చేయకూడదని అంబేడ్కర్ రాజ్యాంగంలో పొందుపర్చారన్నారు. కులాలు, మతాలకు అతీతంగా ఉండేలా మానవత్వం పూనుకున్న వ్యవస్థను నిర్మించాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం కుల గణన చేపడితే, కేంద్రం ఎందుకు చేయదని ప్రశ్నించారు. దేశ వ్యాప్తంగా కుల, జనగణన చేపడితేనే వాస్తవాలు బయటపడుతాయన్నారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి మంద పవన్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు గడిపె మల్లేశ్, నాయకులు జాగిరి సత్యనారాయణ, వనేష్, జనార్దన్, భాస్కర్, కుమార్, శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు.
హిందూ సెంటిమెంట్‌తో మళ్లీ
అధికారంలోకి రావాలని చూస్తున్న మోదీ
సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు
చాడ వెంకట్ రెడ్డి


