
కుక్కను తప్పించబోయి.. మృత్యుఒడికి
బైక్ అదుపుతప్పి పడిపోవడంతో వ్యక్తి మృతి
చిన్నశంకరంపేట(మెదక్): రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన చిన్నశంకరంపేట మండలం గవ్వలపల్లి శివారులో చోటు చేసుకుంది. పేట ఎస్‌ఐ నారాయణగౌడ్ కథనం మేరకు.. మండలంలోని మడూర్ గ్రామానికి చెందిన సందిగల్ల ఎల్లం(48) వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఆదివారం మడూర్ నుంచి మెదక్ బయలుదేరిన ఎల్లం గవ్వలపల్లి దాటిన తర్వాత మెదక్ రోడ్డుపై కుక్క అడ్డుగా రావడంతో తప్పించేందుకు ప్రయత్నించాడు. బైక్ అదుపుతప్పి పడిపో వడంతో గాయాలు అయ్యాయి. వెంటనే అంబులెన్స్‌లో మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. మృతుడి భార్య జ్యోతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.