
వ్యక్తి మృతదేహం లభ్యం
పటాన్‌చెరు టౌన్ : చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడిన వ్యక్తి మృతదేహం సోమవారం లభ్యమైంది. ఈ ఘటన అమీన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ దుర్గయ్య వివరాల ప్రకారం... హఫీజ్‌పేట్ ఆదిత్య నగర్ కాలనీకి చెందిన బసహరత్ ఉల్లాఖాన్ శనివారం నుండి కనిపించకుండా పోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఆదివారం అమీన్‌పూర్ చెరువు గట్టుపై చెప్పులు, సెల్‌ఫోన్ ఉండటంతో గాలింపు చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. సోమవారం ఉదయం అతడి మృతదేహం లభించింది. పోస్టుమార్టం నిమిత్తం పటాన్‌చెరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.