
నిధుల్లేవ్.. పనుల్లేవ్?
వచ్చిన ఆదాయం జీతాలకే సరి ఇబ్బందులు పడుతున్న ప్రజలు పట్టించుకోని అధికారులు
మున్సిపాలిటీ జనాభా ఇళ్లు సిబ్బంది వార్షిక ఆదాయం, ఖర్చులు,
నిధులు వేతనాలు
మెదక్ 71,000 12,700 235 రూ.6.3 కోట్లు రూ.8.39 కోట్లు
రామాయంపేట 18,000 5,500 45 రూ.3 కోట్లు రూ.2.80 కోట్లు
నర్సాపూర్ 25,000 9,404 85 రూ.4.21 కోట్లు రూ.4.53 కోట్లు
తూప్రాన్ 23,000 6,624 76 రూ.2.5 కోట్లు రూ.2.40 కోట్లు
మున్సిపాలిటీలు ప్రత్యేక నిధులపై ఆధారపడి మునుగడ సాగిస్తున్నాయి. అయి తే స్థానికంగా వస్తున్న ఆదాయం ఉద్యోగులు, సిబ్బంది జీతభత్యాలకే సరిపోవడం లేదు. ఏ చిన్న అభివృద్ధి పనులు చేపట్టాలన్న పురపాలికల్లో నిధులుండని పరిస్థితి నెలకొంది. అధికారులు పూర్తిస్థాయిలో ఆదాయం పెంపుపై ప్రత్యేక దృష్టి సారించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే నిధులపై ఆధారపడాల్సి వస్తుంది. అవి వస్తేనే వార్డుల వారీగా పంపిణీ చేసి సీసీ రోడ్లు, డ్రైనేజీలు, సెంట్రల్ లైటింగ్, విద్యుత్ దీపాలు, డివైడర్లు, జంక్షన్‌లకు కేటాయింపులు చేస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే రానున్న 20 ఏళ్లలో కూడా అభివృద్ధికి నోచుకోవడం కష్టమనే భావన నెలకొంది.
మున్సిపాలిటీలకు నిధుల లేమి?
జిల్లాలోని మెదక్, రామాయంపేట, నర్సాపూర్, తూప్రాన్ మున్సిపాలిటీల్లో వస్తున్న ఆదాయం.. చేస్తున్న ఖర్చులకు కూడా సరిపోవడం లేదని స్పష్టం అవుతుంది. కాగా కొన్ని మున్సిపాలిటీల్లో అప్పట్లో పాలక పెద్దలు నిబంధనలకు విరుద్ధంగా వారికి అనుకూలంగా ఉన్న వారిని అవుట్‌సోర్సింగ్ విధానంలో ఉద్యోగులుగా చేర్చారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, శానిటేషన్ కార్మికుల నియామకంపై ఇష్టానుసారంగా వ్యవహరించారని కౌన్సిల్ సమావేశాల్లో చర్చలు జరిగినట్టు తెలిసింది. వారిచేతనే అన్ని పనులను చక్కబెట్టుకుంటుండగా, అసలు ఉద్యోగులు నామమాత్రంగా మిగిలిపోతున్నారని వినికిడి. జనాభా ప్రాతిపదికన పారిశుద్ధ్య కార్మికులు, తాత్కాలిక సిబ్బంది ఉండాలి. కానీ మున్సిపాలిటీల్లో అందుకు విరుద్ధంగా నియమించడంతో ఖజానాకు గండిపడుతుంది.
మున్సిపల్ శాఖ నిబంధనల ప్రకారం 10 వేల మంది జనాభాకు 28 మంది పారిశుద్ధ్య కార్మికులు ఉండాలి. వచ్చే ఆదాయం జీతాలకే సరిపోవటం లేదని, కాలనీలో అభివృద్ధి పనులు ఎలా చేస్తామని అధికారులు, ప్రజాప్రతినిధులు వాపోతున్నారు.
మున్సిపాలిటీల్లోకుంటుపడిన అభివృద్ధి
వనరుల ద్వారా మున్సిపాలిటీలకు రావాల్సిన ఆదాయంపై మున్సిపల్ అధికారులు దృష్టి సారించడం లేదు. ఉదాసీన వైఖరితో ప్రత్యేక గ్రాంటు నిధులు వస్తే తప్ప ముందుకు సాగని దుస్థితి మెదక్ జిల్లాలోని మున్సిపాలిటీల్లో నెలకొన్నది. కేవలం ప్రత్యేక నిధులు వస్తేనే అభివృద్ధి పనులు.. లేకుంటే అంతే అన్నట్లుగా మారింది. మున్సిపాలిటీల పరిస్థితిపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.
తూప్రాన్: