
లక్ష్మణ్ ఆశయాలు కొనసాగిస్తాం
పటాన్‌చెరు/పటాన్‌చెరు టౌన్/సంగారెడ్డి జోన్: తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను కొనసాగిస్తామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి పేర్కొన్నారు. పటాన్‌చెరులోని శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ కాంస్య విగ్రహం వద్ద శనివారం నిర్వహించిన బాపూజీ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా పాల్గొని ఘన నివాళులర్పించారు. అంతకుముందు పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని ఆల్విన్ కాలనీ, సీతారామపురం కాలనీ, శాంతి నగర్ కాలనీ, గౌతమ్ నగర్ కాలనీ,కృషి డిఫెన్స్ కాలనీలలో రూ.3 కోట్ల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్లు, బీటీ రోడ్డు, నీటి కాలువల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం కాం్యపు కార్యాలయంలో అంగన్‌వాడీ శాఖ ఆధ్వర్యంలో 170 అంగన్‌వాడీ టీచర్లకు, ఆయాలకు చీరలను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సమాజంలోని అన్ని వర్గాలకు సమాన రాజకీయ అవకాశాలు కావాలని కోరుకున్న వ్యక్తి బాపూజీ అన్నారు. బాలింతలకు, గర్భిణీలకు పౌష్టికాహారం ప్రాధాన్యతను తెలియజేస్తూ వారి ఆరోగ్య పరిరక్షణలో అంగన్‌వాడీలు అందజేస్తున్న సేవలు ప్రశంసనీయమన్నారు. కార్యక్రమంలో పటాన్‌చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ అశోక్, రామచంద్రపురం మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, ఐసీడీఎస్ సీడీపీఓ జయరాం నాయక్ పాల్గొన్నారు.
సంగారెడ్డిలో...
సంగారెడ్డిలోని ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అదనపు కలెక్టర్ మాధురి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంజయ్య, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి జగదీష్, వివిధ సంఘాల నాయకులు బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి