
రిజర్వేషన్లు ఖరారు
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: స్థానిక సంస్థల రిజర్వేషన్లపై నెలకొన్న ఉత్కంఠ ఎట్టకేలకు వీడింది. జెడ్పీటీసీ (జిల్లా పరిషత్ టెరిటోరియల్ కానిస్టేన్సీ), ఎంపీపీ (మండల పరిషత్ అధ్యక్షుల) స్థానాల రిజర్వేషన్లను శనివారం ఖరారయ్యాయి. సుమారు వారం రోజుల పాటు కసరత్తు చేసిన అధికారులు ఈ మేరకు ఆయా స్థానాలకు రిజర్వేషన్లను ఖరారు చేసి ప్రభుత్వానికి పంపారు. జిల్లాలో మొత్తం 25 మండలాల్లో మొత్తం 11 చొప్పున జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలు బీసీలకు రిజర్వు అయ్యాయి. ఇందులో బీసీ మహిళలకు ఐదు మండలాలు రిజర్వు కాగా, ఆరు స్థానాలు బీసీ జనరల్ అయ్యాయి. ఎస్సీ సామాజికవర్గానికి ఆరు చొప్పున జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలు కేటాయించారు. ఇందులో మూడు చొప్పున ఎస్సీ మహిళకు రిజర్వు చేశారు. ఎస్టీలకు రెండు జెడ్పీటీసీ స్థానాలు, రెండు ఎంపీపీ స్థానాలు రిజర్వు అయ్యాయి. ఇందులో ఒక్కొక్కటి చొప్పున మహిళలకు రిజర్వు చేశారు.
వారం రోజులుగా కసరత్తు..
ఈ రిజర్వేషన్లను ఖరారు చేసేందుకు వారం రోజులుగా కసరత్తు చేశారు. 2011 జనాభా ప్రాతిపదికన ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను లెక్కించారు. ఇందులో మహిళా రిజర్వేషన్లను డ్రా పద్ధతిలో కేటాయించారు. మరోవైపు బీసీ రిజర్వేషన్లను సంబంధించి ప్రభుత్వం ప్రకటించినట్లుగా 42% స్థానాలకు బీసీలకు కేటాయించారు. ఆయా మండలాల్లో బీసీల జనాభా ఆధారంగా రిజర్వేషన్లను ఖరారు చేశారు. అయితే కులగణన గణాంకాల ఆధారంగా ఈ బీసీ రిజర్వేషన్లను ఖరారు చేశారు. 2019లో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆయా స్థానాల రిజర్వేషన్లను సైతం పరిగణలోకి తీసుకుని, రొటేషన్ పద్ధతిలో ఈ రిజర్వేషన్లను ఖరారు చేసినట్లు తెలిసింది.
జెడ్పీటీసీ ఎంపీపీల రిజర్వేషన్లు ఇలా..
జెడ్పీటీసీ స్థానం ప్రస్తుత రిజర్వేషన్ ఎంపీపీ
నిజాంపేట ఎస్టీ మహిళ ఎస్టీ మహిళ
మొగుడంపల్లి ఎస్టీ జనరల్ ఎస్టీ జనరల్
చౌటకూర్ ఎస్సీ మహిళ ఎస్సీ మహిళ
సదాశివపేట ఎస్సీ జనరల్ బీసీ జనరల్
కొండాపూర్ ఎస్సీ మహిళ ఎస్సీ మహిళ
మునిపల్లి ఎస్సీ జనరల్ బీసీ మహిళ
సంగారెడ్డి ఎస్సీ మహిళ బీసీ మహిళ
మనూరు ఎస్సీ జనరల్ ఎస్సీ మహిళ
ఆందోల్ బీసీ మహిళ బీసీ మహిళ
వట్‌పల్లి బీసీ జనరల్ బీసీ మహిళ
కల్హేర్ బీసీ మహిళ బీసీ జనరల్
పటాన్‌చెరు బీసీ జనరల్ బీసీ జనరల్
న్యాల్‌కల్ బీసీ జనరల్ బీసీ జనరల్
గుమ్మడిదల బీసీ మహిళ బీసీ మహిళ
ఝరాసంఘం బీసీ జనరల్ బీసీ మహిళ
కంది బీసీ మహిళ బీసీ జనరల్
కంగ్టి బీసీ జనరల్ బీసీ జనరల్
పుల్కల్ బీసీ జనరల్ జనరల్
జహీరాబాద్ బీసీ మహిళ ఎస్సీ జనరల్
రాయికోడ్ జనరల్ మహిళ బీసీ మహిళ
హత్నూర జనరల్ జనరల్ మహిళ
సిర్గాపూర్ జనరల్ మహిళ జనరల్
కోహీర్ జనరల్ మహిళ జనరల్ మహిళ
ఖేడ్ జనరల్ జనరల్
నాగల్‌గిద్ద జనరల్ జనరల్ మహిళ
బీసీలకు 11 చొప్పున ఎంపీపీలు, జెడ్పీటీసీ స్థానాలు రిజర్వు
ఇందులో బీసీ మహిళలకు
ఐదు కేటాయింపు
ఎస్సీలకు ఆరు చొప్పున
ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాలు..
రెండేసి చొప్పున ఎస్టీలకు కేటాయింపు..
మూడు జనరల్ స్థానాలు మరో మూడు
జనరల్ మహిళలకు రిజర్వేషన్లు