గుడుంబా స్వాధీనం | - | Sakshi
Sakshi News home page

గుడుంబా స్వాధీనం

Sep 29 2025 10:30 AM | Updated on Sep 29 2025 10:30 AM

గుడుం

గుడుంబా స్వాధీనం

గుడుంబా స్వాధీనం రోడ్డు ప్రమాదంలో మహిళకు గాయాలు మహాచండీ హోమం కాలనీ సమస్యలు పరిష్కరిస్తా అల్లుకున్న నిర్లక్ష్యం

మద్దూరు(హుస్నాబాద్‌): ఎకై ్సజ్‌, టాస్క్‌ఫోర్స్‌ అధికారులు దాడులు చేసి గుడుంబాను స్వాధీనం చేసుకున్నారు. చేర్యాల ఎకై ్సజ్‌ సీఐ నర్సింహులు వివరాల ప్రకారం... మండలంలోని శివాలితండా, హనుమతండా, మల్లన్నగుట్ట తండా, రెడ్యానాయక్‌ తండాల్లోని గుడుంబా స్థావరాలపై ఆదివారం దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో శివాలితండాకు చెందిన లకావత్‌ లక్ష్మి వద్ద 19 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేశారు. ఈ దాడుల్లో మెదక్‌ డివిజన్‌ సీఐ వీణ, ఎస్‌ఐ సరిత, సువర్ణ తదితరులు ఉన్నారు.

నిజాంపేట(మెదక్‌): రోడ్డు ప్రమాదంలో మహిళకు గాయాలయ్యాయి. వివరాలు.. మండల కేంద్రానికి చెందిన కోమ్మట పద్మ, లక్ష్మణ్‌ దంపతులు ఆదివారం తమ పొలంలో వ్యవసాయ పనుల నిమిత్తం బైక్‌పై వెళ్తున్నారు. ఈ క్రమంలో బైక్‌ అదుపు తప్పి కింద పడటంతో పద్మ తలకు గాయాలయ్యాయి. దీంతో వెంటనే ఆమెను అంబులెన్స్‌లో హైదరాబాద్‌లోని నిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు.

నారాయణఖేడ్‌: మనూరు మండలం బోరంచ నల్లపోచమ్మ ఆలయంలో ఆదివారం బిచ్కుంద సంస్థాన్‌ స్వామిజీ సద్గురు సోమలింగ శివాచార్య ఆధ్వర్యంలో మహాచండీ హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దంపతులు పాల్గొని పూజలు చేశారు. పూర్ణాహుతి, ప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహించారు. ఆయా ప్రాంతాలకు చెందిన భక్తులు భారీ సంఖ్యలో హోమంలో పాల్గొన్నారు.

సదాశివపేట(సంగారెడ్డి): డబుల్‌ బెడ్రూం కాలనీలో నెలకొన్న ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని బీఆర్‌ఎస్‌ నియోజకవర్గ నాయకుడు శివరాజ్‌పాటిల్‌ పేర్కొన్నారు. ఆదివారం పట్టణ పరిధిలోని డబుల్‌బెడ్రూం కాలనీలో బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కాలనీవాసులను సమస్యలను అడిగి తెలుసుకున్నారు. శ్రీకృష్ణమందిరం నుంచి కాలనీ వరకు గల బీటీ రోడ్డుపై పెద్దపెద్ద గుంతలు, కాలనీలో చెత్త సేకరించకపోవడం, వీధి దీపాలు ఏర్పాటు వంటి సమస్యలను కాలనీ వాసులు విన్నవించారు. అనంతరం శివరాజ్‌పాటిల్‌ మాట్లాడుతూ.. అధికారుల దృష్టికి తీసుకెళ్తానని, వారు స్పందించకపోతే సొంత నిధులతో పరిష్కరిస్తానని తెలిపారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ గోపాల్‌, మాజీ కౌన్సిలర్లు విద్యాసాగర్‌రెడ్డి, ఇంద్రమోహన్‌గౌడ్‌, వీరేశం, అంజయ్య, ప్రకాశ్‌, సత్యనారాయణ, కాలనీ వాసులు పాల్గొన్నారు.

కంది(సంగారెడ్డి): పిచ్చి మొక్కలు తీగలు విద్యుత్‌ స్తంభాలను అల్లుకుని ప్రమాదకరంగా మారుతున్నాయి. మండల కేంద్రమైన కంది శివారులో గల డబుల్‌ బెడ్రూమ్‌ల వద్ద హైవోల్టేజ్‌ స్తంభానికి తీగలు అల్లుకోవడంతో షార్ట్‌ సర్క్యూట్‌ జరిగే అవకాశం ఉంది. ఇప్పటికైనా విద్యుత్‌ అధికారులు స్పందించి స్తంభాలకు అల్లుకున్న తీగలను తొలగించి ప్రమాదాలను నివారించాలని ప్రజలు కోరుతున్నారు.

గుడుంబా స్వాధీనం  
1
1/3

గుడుంబా స్వాధీనం

గుడుంబా స్వాధీనం  
2
2/3

గుడుంబా స్వాధీనం

గుడుంబా స్వాధీనం  
3
3/3

గుడుంబా స్వాధీనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement