
ప్రతిభ చాటిన ఖేడ్ వాసులు
నారాయణఖేడ్: గ్రూప్ – 2 ఉద్యోగాల నియామక ప్రక్రియలో నారాయణఖేడ్ జంట గ్రామం మంగల్‌పేట్‌కు చెందిన రాజ్‌కుమార్ రాష్ట్ర స్థాయిలో ఓపెన్ కేటగిరిలో 168వ ర్యాంకు సాధించి ఏఎస్‌వో ఉద్యోగం దక్కించుకున్నాడు. జోనల్ విభాగంలో 28వ ర్యాంకు సాధించాడు. వ్యవసాయ కుటుంబంలో జన్మించి ప్రాథమిక స్థాయి నుంచి నవోదయలో విద్యాభ్యాసం చేశాడు. సిర్గాపూర్ మండలం ఉజలంపాడ్‌కు చెందిన బి.మనోహర్‌రావు సబ్ రిజిస్ట్రార్ ఉద్యోగం దక్కించుకున్నాడు. జోనల్ స్థాయిలో మొదటి ర్యాంకు, రాష్ట్ర స్థాయిలో మూడో ర్యాంకు పొందాడు. హైదరాబాద్‌లోని వీవీ కళాశాలలో 2012లో ఎకనామిక్స్ విభాగంలో పీజీ పూర్తి చేసి గోల్డ్ మెడల్ సాధించాడు.
రాజ్‌కుమార్
బి.మనోహర్‌రావు

ప్రతిభ చాటిన ఖేడ్ వాసులు