
పట్టుబట్టి.. కొలువులు కొట్టి
డిప్యూటీ కలెక్టర్‌గా తేజస్విని
గ్రూప్స్ ఫలితాల్లో సత్తా చాటిన ఉమ్మడి జిల్లా వాసులు
కొండపాక(గజ్వేల్): మండలంలోని సిర్సనగండ్ల గ్రామంలో పేద కుటుంబంలో జన్మించిన అన్నదమ్ముల్లో ఒకరికి ప్రభుత్వ ఉన్నత ఉద్యోగం రాగా.. మరొకరికి ప్రభుత్వ మెడికల్ కళాశాలలో (నీట్)లో కన్వీనర్ కోటాలో ఫ్రీ సీటు సాధించాడు. గ్రామానికి చెందిన ముత్యాల మల్లేశం– యాదవ్వలకు ఇద్దరు కుమారులు. తల్లి బీడీ కార్మికురాలు, తండ్రి వ్యవసాయ కూలీగా పని చేస్తున్నాడు. ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన గ్రూప్ –1 ఉద్యోగాల్లో పెద్ద కుమారుడు రాజశేఖర్ జిల్లా విద్యాధికారి (డీఈఓ) ఉద్యోగం పొందాడు.
దుబ్బాకటౌన్: దుబ్బాక పట్టణానికి చెందిన యాడారం నవీన్ గౌడ్ గ్రూప్–2 ఫలితాల్లో స్టేట్ 166 వ ర్యాంక్ సాధించి సత్తా చాటాడు. ఆదివారం ప్రభుత్వం ప్రకటించిన ఫలితాల్లో అసిస్టెంట్ లేబర్ అధికారిగా ఎంపికయ్యాడు. తండ్రి రాములు నవీన్ చిన్న తనంలోనే అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో తల్లి లక్ష్మి బీడీలు చుడుతూ.. కిరాయి ఇంటిలో అద్దెకు ఉంటూ.. కొడుకును కష్టపడి చదివించింది. తల్లి, భార్య ప్రో త్సాహంతో చదివి గ్రూప్–2 లో సత్తా చాటి ఉద్యోగానికి ఎంపికయ్యాడు. దీంతో పలువురు అతడిని అభినందించారు.
చేగుంట(తూప్రాన్): మండలంలోని బీ కొండాపూర్ గ్రామానికి చెందిన విజయసేనారెడ్డి గ్రూప్ –2లో ర్యాంకు సాధించాడు. మక్కరాజీపేట ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న ఆయన రాష్ట్ర స్థాయిలో 259వ ర్యాంకు సాధించాడు. సచివాలయంలోని ఫైనాన్స్ విభాగంలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్‌గా ఉద్యోగం సంపాదించారు. ఆయన ఉద్యోగం సాధించడం పట్ల ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.
పాపన్నపేట(మెదక్): గ్రూపు –1 సర్వీసు లక్ష్యంగా ప్రయత్నం కొనసాగిస్తానని పాపన్నపేటకు చెందిన కుకునూరు అర్జున్ రెడ్డి తెలిపా రు. ఇంజినీరింగ్ చేసిన అతడు 2014లో గ్రూప్–4 పరీక్ష రాసి జిల్లా స్థాయిలో 12వ ర్యాంకు సాధించాడు. ప్రస్తుతం ఆర్‌ఐ క్యాడర్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. ఇటీవల వెల్లడించిన గ్రూప్ –3లో స్టేట్ మొదటి ర్యాంకు, గ్రూప్ –2లో 18వ ర్యాంకు సాధించాడు. ప్రస్తుతం డిప్యూటీ తహసీల్దార్ పోస్టుకు ఎంపికయ్యాడు. తాను గ్రూప్ – 1 సర్వీస్‌కు ఎంపికై ప్రజలకు మంచి పాలన అందించాలన్నదే తన లక్ష్యమని చెప్పాడు.
పాపన్నపేట మండలంలోని అబ్లాపూర్‌కు చెందిన బాయికాడి సుస్మిత సివిల్ సర్వీస్ సాధించడమే తన లక్ష్యమని తెలిపారు. ఎమ్మెస్సీ బీఈడీ చేసి 2012లో డీసీసీబీ అసిస్టెంట్ మేనేజర్‌గా ఎంపికయ్యారు. 2012లో వివాహం జరిగింది. భర్త శ్రీనివాస్ టీచర్. వారికి ఇద్దరు పిల్లలు. అయినప్పటికీ కుటుంబీకుల ప్రోత్సాహంతో పోటీ పరీక్షలు రాస్తున్నారు. గ్రూప్ –2లో రాష్ట్రస్థాయిలో 41వ ర్యాంకు, మహిళల్లో సెకండ్ ర్యాంక్ సాధించి, డిప్యూటీ తహసీల్దార్ పోస్టుకు ఎంపికయ్యారు. ప్రస్తుతం ఇంటి వద్దే సివిల్స్‌కు ప్రిపేర్ అవుతున్నారు.
మునిపల్లి(అందోల్): మండలంలోని కంకోల్ గ్రామానికి చెందిన మడపతి సంగమేశ్, ప్రసూన దంపతుల ఒక్కగానొక్క కూతురు తేజస్విని. 2021లో సంగారెడ్డికి చెందిన సోమనాథ్‌కు ఇచ్చి వివాహం చేశారు. ఇటీవల విడుదల చేసిన గ్రూప్ –1 ఫైనల్ సెలక్షన్‌లో భాగంగా బీసీ –ఏ మహిళా విభాగంలో 1వ ర్యాంక్ సాధించి జనగామ డిప్యూటీ కలెక్టర్‌గా ఆమె ఎంపికయ్యారు. కాగా గ్రామానికి చెందిన బస్వరాజ్, సంగమేశ్వర్, బంధువులు ఆమెను సన్మానించారు.

పట్టుబట్టి.. కొలువులు కొట్టి

పట్టుబట్టి.. కొలువులు కొట్టి

పట్టుబట్టి.. కొలువులు కొట్టి

పట్టుబట్టి.. కొలువులు కొట్టి

పట్టుబట్టి.. కొలువులు కొట్టి