
ముక్కు మూసుకోవాల్సిందే..
అధికారులు పట్టించుకోకపోవడంతో మిరుదొడ్డిలో పారిశుధ్యం అధ్వానంగా తయారైంది. మురుగు కాలువల్లో ఎక్కడికక్కడ చెత్తాచెదారం, ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోయాయి. రోజుల తరబడి వాటిని తొలగించక పోవడంతో దుర్గంధం వెదజల్లుతున్నాయి. దీంతో గ్రామస్తులు మండిపడుతున్నారు. మురుగు కాలువల వల్ల దోమలు విజృంభించి రాత్రిపూట కంటికి కునుకు లేకుండా పోతుందని అసహనం వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి మురుగు కాలువలను శుభ్రం చేయించా లని కోరుతున్నారు. – మిరుదొడ్డి(దుబ్బాక)

ముక్కు మూసుకోవాల్సిందే..
Comments
Please login to add a commentAdd a comment