నేడు హర్యానా గవర్నర్ రాక
కొమురవెల్లి(సిద్దిపేట): మల్లికార్జున స్వామి దర్శనానికి మంగళవారం హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ రానున్నారు. గవర్నర్‌తోపాటు మెదక్ ఎంపీ రఘునందన్‌రావు ఉదయం ఆలయానికి చేరుకుంటారని పార్టీ మండల అధ్యక్షుడు బూర్గోజు నాగరాజు సోమవారం తెలిపారు. ఈసందర్బంగా అభిమానులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలిరావాలని పిలుపు నిచ్చారు.
కేంద్ర మంత్రిని కలిసిన
బీజేపీ నాయకులు
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): బీజేపీ రాష్ట్ర అధ్యక్షు డు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని పార్టీ జిల్లా నాయకులు కలిశారు. సోమవారం నగరంలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసినట్లు జిల్లా అధ్యక్షుడు శంకర్ తెలిపారు. తనతో పాటు జిల్లా ఉపాధ్యక్షుడు కొత్తపల్లి వేణుగోపాల్, మాజీ కౌన్సిలర్ వెంకట్, సీనియర్ నాయకులు ఉన్నారన్నారు.
8న జాతీయ లోక్‌అదాలత్
జిల్లా న్యాయమూర్తి స్వాతిరెడ్డి
సిద్దిపేటకమాన్: జాతీయ లోక్‌అదాలత్ ఈనెల 8న నిర్వహించనున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ, న్యాయమూర్తి స్వాతిరెడ్డి తెలిపారు. సిద్దిపేట కోర్టు భవనంలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. రాజీపడదగిన కేసుల్లో కక్షిదారులు లోక్ అదాలత్‌లో పరిష్కరించుకోవాలని సూచించారు. గత లోక్‌అదాలత్‌లో 5వేల కేసుల వరకు పరిష్కరించినట్లు తెలిపారు. ఈ లోక్‌అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
బుగ్గరాజేశ్వరుడి ఆలయ
ఆదాయం రూ.5.21లక్షలు
సిద్దిపేటరూరల్: మహాశివరాత్రి సందర్భంగా స్వయంభూ బుగ్గరాజేశ్వరస్వామి ఆలయ ఆదాయం రూ.5.21లక్షలు వచ్చినట్లు చైర్మన్ కరుణాకర్ తెలిపారు. భక్తులు సమర్పించిన కానులకలను సోమవారం లెక్కించారు. హుండీ ద్వారా రూ.2,43,748, టిక్కెట్ల రూపంలో రూ.2,77,732 ఆదాయం సమకూరినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు సీతారామశర్మ తదితరులు పాల్గొన్నారు.
‘ఉపాధి’ కూలీలకు
వసతులు కల్పించండి
చిన్నకోడూరు(సిద్దిపేట): ఉపాధి హామీ కూలీలకు పని జరిగే చోట వసతులు కల్పించాలని దళిత బహుజన ఫ్రంట్ (డీబీఎఫ్) జిల్లా ఉపాధ్యక్షుడు శంకర్ అన్నారు. సోమవారం మండల పరిధిలోని అనంతసాగర్‌లో జరుగుతున్న ఉపాధి హామీ పనులను పరిశీలించారు. కూలీలు ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఎండలు మండుతున్న నేపథ్యంలో కూలీలకు పని ప్రదేశంలో నీడ వసతి, తాగు నీటి సౌకర్యం, ప్రాథమిక చికిత్స వంటివి ఏర్పాటు చేయాలన్నారు. ఉపాధి హామీ కూలీలకు పెండింగ్‌లో ఉన్న కూలి డబ్బులు వెంటనే చెల్లించాలన్నారు. ఆయన వెంట డీబీఎఫ్ నాయకులు ఉన్నారు.
కిష్టయ్యకి ఉగాది పురస్కారం
సిద్దిపేటఅర్బన్: పిల్లిట్ల కిష్టయ్యకి జాతీయ స్థాయి ఉగాది విశ్వశాంతి పురస్కారం దక్కింది. చిందు యక్షగాన కళా రంగంలో అందిస్తున్న విశిష్ట సేవలను గుర్తించి అవార్డు ఇచ్చారు. సిద్దిపేట అర్బన్ మండలం మందపల్లికి చెందిన పిల్లిట్ల కిష్టయ్య నగరంలో జరిగిన కార్యక్రమంలో పురస్కారం దుడపాక శ్రీధర్ చేతుల మీదుగా అందుకున్నారు. అవార్డు అందుకోవడం ఆనందంగా ఉందని కిష్టయ్య అన్నారు.
నేడు హర్యానా గవర్నర్ రాక
నేడు హర్యానా గవర్నర్ రాక
నేడు హర్యానా గవర్నర్ రాక
Comments
Please login to add a commentAdd a comment