సాగునీరు విడుదల చేయండి
రోడ్డుపై బైఠాయించిన రైతులు
సిద్దిపేటరూరల్: అంకంపేట చెరువులోకి నీటిని విడుదల చేసి, పంటలను రక్షించాలని అంకంపేట గ్రామస్తులు సోమవారం లక్ష్మీదేవిపల్లి రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మల్లన్నసాగర్ కాలువ ద్వారా సాగునీటిని విడుదల చేసి నెల రోజులు గడుస్తున్నా అంకంపేటకు నీళ్ళు వదలడం లేదన్నారు. అంకంపేట చెరువు కింద 350 ఎకరాల ఆయకట్టు ఉందన్నారు. భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయని, పంటలు నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. వెంటనే నీటిని వదిలి రైతులకు న్యాయం చేయాలన్నారు. అనంతరం ధర్నా వద్దకు చేరుకున్న రూరల్ సీఐ శ్రీను, ఎస్‌ఐ అపూర్వరెడ్డి సమస్య పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో రైతులు, గ్రామప్రజలు పాల్గొన్నారు.
అంకంపేట రైతుల నిరసన
Comments
Please login to add a commentAdd a comment