
అపూర్వ సమ్మేళనం
మద్దూరు(హుస్నాబాద్): మండలంలోని లద్నూర్ పాఠశాలలో 2004–05లో పదోతరగతి పూర్తిచేసిన విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. 20 యేళ్ల తర్వాత ఆదివారం పాఠశాలలో కలుసుకొని తమ చిన్ననాటి జ్ఞాపకాలను పంచుకొన్నారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన నాటి గురువులను ఘనంగా సన్మానించారు. అనంతరం ఆటపాటలతో సందడి చేశారు.
దుబ్బాక: దౌల్తాబాద్ మండలం దొమ్మాట పాఠశాలలో 24యేళ్ల క్రితం చదువుకున్న(2001–02)టెన్త్ విద్యార్థులు సందడి చేశారు. ఆ నాటి స్మృతులను గుర్తుచేసుకొని సంతోషంగా గడిపారు. ఈ సందర్భంగా తమకు చదువు చెప్పిన గురువులు కృష్ణమచారి, గణపతి, రామకృష్ణ, రాజగోపాలచారి, రాంప్రభాకర్, ప్రవీణ్‌బాబు, గౌరీ మోహన్, జూహెద్ అలీని ఘనంగా సన్మానించారు.

అపూర్వ సమ్మేళనం
Comments
Please login to add a commentAdd a comment