
రోడ్డుకు మరమ్మతులు చేయాలని నిరసన
రామచంద్రాపురం(పటాన్‌చెరు): ఓఆర్‌ఆర్ 30 ఎక్స్‌టెన్షన్ రేడియల్ రోడ్డు ధ్వంసమై గుంతలమయంగా మారింది. సంబంధిత అధికారులు రోడ్డుకు ఎందుకు మరమ్మతులు చేపట్టడం లేదని ఆదివారం తెల్లాపూర్ గేటెడ్ కమ్యూనిటీ కాలనీవాసులు ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. అనంతరం తెల్లాపూర్ నైబర్‌హుడ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వివిధ గేటెడ్ కమ్యూనిటీ కాలనీవాసులు శ్రమదానం చేసి గుంతలను పూడ్చివేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అనేక ఏళ్లుగా ఈ రోడ్డు అసంపూర్తిగా ఉండడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని వాపోయారు. రోడ్డుపై పెద్ద ఎత్తున మట్టి చేరి, గుంతలు ఏర్పడినా అధికారులు పట్టించుకోవడంలేదని ఆరోపించారు. దీంతో స్వయంగా తామే శ్రమదానం చేసి రోడ్డుకు మరమ్మతు పనులు చేశామని చెప్పారు. ఈ మార్గంలో ఉన్న ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ వల్ల ఇబ్బందులు పడుతున్నామన్నారు. ఈ రోడ్డుపై నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయని ప్రభుత్వం ఎందుకు అభివృద్ధి చేయడం లేదని ప్రశ్నించారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి రోడ్డును అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రానున్న రోజుల్లో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment