దుబ్బాక: వినియోగదారులకు నిరంతరం విద్యుత్ సరఫరా అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు టీజీఎస్‌పీడీసీఎల్ డైరెక్టర్ కమర్షియల్, జిల్లా నోడల్ ఆఫీసర్ సాయిబాబ అన్నారు. సోమవారం దుబ్బాక మండలం అప్పనపల్లి, సిద్దిపేట మండలంలోని చిన్నగుండవెల్లి విద్యుత్ సబ్‌స్టేషన్‌లను సందర్శించారు. ఈ సందర్భంగా లోడ్ మానటరింగ్ తో పాటు రైతులకు నాణ్యమైన కరెంట్ ఇవ్వడంపై విద్యుత్ అధికారులు, సిబ్బందికి పలు సూచనలిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవిలో ఎక్కడా లోవోల్టేజీ సమస్య రానివ్వబోమన్నారు. కరెంట్ సమస్య లేకుండా ముందస్తుగానే చర్యలు చేపడుతున్నామన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఈ చంద్రమోహన్, డీఈఈ టెక్నికల్ శ్రీనాథ్, డివిజనల్ ఇంజనీర్ రామచంద్రయ్య, ఏడీఈ కృష్ణమోహన్, దుబ్బాక సబ్‌డివిజన్ ఏడీఈ గంగాధర్, దుబ్బాక రూరల్ ఏఈ జయకృష్ణ ఉన్నారు.
నిరంతరం విద్యుత్ సరఫరా
జిల్లా నోడల్ ఆఫీసర్ సాయిబాబ
Comments
Please login to add a commentAdd a comment