
బారులుతీరిన వాహనాలు
హుస్నాబాద్‌రూరల్: యాసంగి కోతలు మొదలు కావడం.. కొనుగోలు కేంద్రాల్లో రైతులు ధాన్యాన్ని విక్రయించడంతో మిల్లులకు ధాన్యం వాహనాలు బారులు తీరుతున్నాయి. పందిల్ల మిల్లు వద్ద ఆదివారం ఆధిక సంఖ్యలో ధాన్యం ట్రాక్టర్లు దర్శనమిచ్చాయి. దిగుమతి చేయడానికి వివిధ గ్రామాల నుంచి వచ్చి చేరిన ట్రాక్టర్ల యజమానులు క్యూలో నిరీక్షించారు. ఒక ట్రాక్టర్ ధాన్యం దిగుమతి చేయడానికి సుమారు మూడు గంటల సమయం పట్టడంతో ట్రాక్టర్ యాజమానులు మిల్లుల వద్దనే పడిగాపులు కాచారు. హమాలీల సంఖ్యను పెంచి దిగుమతి వేగంగా చేయాలని వారు కోరుతున్నారు.
ట్రాక్టర్ యజమానుల పడిగాపులు