
బీఎస్‌ఎన్‌ఎల్ సేవలు సద్వినియోగం చేసుకోండి
ఏజీఎం లక్ష్మణ్ బానోత్
సిద్దిపేటకమాన్: బీఎస్‌ఎన్‌ఎల్ సేవలను వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (ఏజీఎం) లక్ష్మణ్ బానోత్ తెలిపారు. సిద్దిపేటలో శుక్రవారం వినియోగదారుల మేళా కార్యక్రమం నిర్వహించారు. మేళాలో పలువురు బీఎస్‌ఎన్‌ఎల్ వినియోగదారులు పలు సమస్యలపై సంప్రదించగా సిబ్బంది పరిష్కరించి సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఏజీఎం లక్ష్మణ్ మాట్లాడుతూ.. వినియోగదారుల సౌకర్యార్థం అత్యాధునిక టెక్నాలజీతో సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఏస్డీఈలు మోహన్‌రెడ్డి, రవీందర్, రాజేంద్రప్రసాద్, రాజ్‌కుమార్, శ్రీకాంత్, సిబ్బంది పాల్గొన్నారు.
కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించండి
సివిల్ సప్లై సీఆర్‌ఓ ఫణిందర్
కొండపాక(గజ్వేల్): ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలోనే అమ్ముకోవాలని సివిల్ సప్లై సీఆర్‌ఓ (ఐఏఎస్) ఫణిందర్ అన్నారు. దుద్దెడలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో జరుగుతున్న ధ్యాన్యం కొనుగోళ్లను శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. నీరు, నీడ నిచ్చే సౌకర్యాలను ఏర్పాటు చేయలేదని రైతులు తెలిపారు. ఈ సందర్భంగా ఫణిందర్ మాట్లాడుతూ కొనుగోళ్ల కేంద్రాల్లోనే మద్దతు ధర లభిస్తుందన్నారు. ప్రతీ గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని భరోసా ఇచ్చారు. అకాల వర్షాలు కురుస్తున్న వేళ కేంద్రాలకు ధాన్యాన్ని తెచ్చేటప్పుడు టార్పాలిన్ కవర్లను తెచ్చుకోవాలన్నారు. కార్యక్రమంలో కొనుగోలు కేంద్రం నిర్వాహకులు, పంచాయతీ కార్యదర్శి, నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
ఉరుములు.. పిడుగులు
● పలు ప్రాంతాల్లో గాలివాన
● భయాందోళనకు గురైన ప్రజలు
దుబ్బాక/దుబ్బాకరూరల్: మండల పరిధిలోని బల్వంతాపూర్, తొగుట మండలం గుడికందుల గ్రామాల్లో శుక్రవారం సాయంత్రం ఉరుములు మెరుపులతో పిడుగులు పడడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. బల్వంతాపూర్‌లో ఇంటి ఆవరణలోని కొబ్బరిచెట్టు, గుడికందులలో ఇళ్లసమీపంలోని తాటిచెట్టుపై పిడుగులు పడి మంటలు ఎగసిపడ్డాయి.
వరదరాజుపల్లిలో పాడిగేదెలు మృతి
తొగుట(దుబ్బాక): పిడుగుపాటుకు పాడిగేదెలు మృతిచెందాయి. ఈ ఘటన వరదరాజుపల్లిలో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రేపాక పరశురాములు తన వ్యవసాయ పొలం వద్ద పాడిగేదెలను కట్టేసిన చెట్టుపై పిడుగుపడింది. దీంతో గేదెలు మృతిచెందాయి.
నిలిచిన రాకపోకలు..
మిరుదొడ్డి(దుబ్బాక): మండల పరిధిలో ఈదురుగాలులతో వర్షం కురిసింది. దీంతో రోడ్లపై చెట్లు విరిగి పడటంతో వాహనదారుల రాకపోకలు నిలిచి పోయాయి. గంట పాటు కరెంటు సరఫరా నిలిచిపోయింది.

బీఎస్‌ఎన్‌ఎల్ సేవలు సద్వినియోగం చేసుకోండి

బీఎస్‌ఎన్‌ఎల్ సేవలు సద్వినియోగం చేసుకోండి

బీఎస్‌ఎన్‌ఎల్ సేవలు సద్వినియోగం చేసుకోండి