
శక్తి స్వరూపిణి.. త్రిపుర సుందరి
మంగళవారం శ్రీ 23 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025
వైభవంగా శరన్నవరాత్రులు ప్రారంభం ● బాలాత్రిపుర సుందరిదేవీగా అమ్మవారు దర్శనం
దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు జిల్లా వ్యాప్తంగా సోమవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఆయా మండపాలలో అమ్మవార్లు కొలువుదీరారు. ఉత్సవాల తొలిరోజు అమ్మవారు భక్తులకు బాలా త్రిపుర సుందరిగా దర్శనం ఇచ్చారు. ఉదయం నుంచి మండలపాల వద్ద భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే జగన్మాత నామంతో శంభుని కొండ మార్మోగింది. అభిషేకాలు, పారాయణాలతో వర్గల్ విద్యాసరస్వతి క్షేత్రం శోభిల్లింది. సరస్వతి అమ్మవారు బాలాత్రిపుర సుందరిదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. నాచగిరి శ్రీక్షేత్రం పీఠాధిపతి శ్రీమధుసూదనానంద సరస్వతి పర్యవేక్షణ, ఆలయ వ్యవస్థాపక చైర్మన్ యాయవరం
చంద్రశేఖర శర్మ సిద్ధాంతి నేతృత్వంలో ఉత్సవాలకు అంకురార్పణ జరిగింది.
– ప్రశాంత్‌నగర్(సిద్దిపేట)/వర్గల్(గజ్వేల్)

శక్తి స్వరూపిణి.. త్రిపుర సుందరి