
కేంద్ర మంత్రిని కలిసిన మత్స్యకారులు
హుస్నాబాద్: కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ని మంగళవారం మత్స్య పారిశ్రామిక సహకార సంఘం నాయకులు కలిశారు. పట్టణంలో కొత్తగా నిర్మిస్తున్న ముదిరాజ్ ఫంక్షన్ హాలుకు బోరు మోటారు మంజూరు చేయాలని కోరారు. ఈ విషయంపై వెంటనే స్పందించిన బండి సంజయ్ మంజూరు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడు పొన్నం మల్లయ్య, కార్యదర్శి రాగుల శ్రీనివాస్, డైరెక్టర్లు తదితరులు ఉన్నారు.
జాతీయ స్థాయి పోటీలకు జిల్లా క్రీడాకారులు
మిరుదొడ్డి(దుబ్బాక): జాతీయ స్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీలకు జిల్లా నుంచి ముగ్గురు క్రీడాకారులు ఎంపికయ్యారు. ఈ మేరకు ఉమ్మడి మెదక్ జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ భైరయ్య తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ ఈ నెల 12 నుంచి, 14 వరకు జరిగిన రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ బాల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్‌లో మెదక్ జిల్లా బాలికల జట్టు ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. ఈ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన శ్రావణి, శరణ్య, అలాగే బాలుర జట్టు నుంచి కృష్ణ సాయి ఎంపికయ్యాడని తెలిపారు. ఎంపికై న క్రీడాకారులు తమిళనాడులో ఈ నెల 25 నుంచి 30 వరకు జరిగే టోర్నిలో రాష్ట్ర జట్టు తరపున ప్రాతినిధ్యం వహిస్తారని తెలిపారు.
రోడ్డెక్కిన హైర్ బస్సులు
డ్రైవర్లతో చర్చలు సఫలం
సిద్దిపేటకమాన్: వేతనాలు పెంచాలని నిరసన తెలిపిన హైర్ బస్సుల డ్రైవర్లతో జరిపిన చర్చలు సఫలమయ్యాయి. సిద్దిపేట ఆర్టీసీ డిపో హైర్ బస్సుల డ్రైవర్లు సోమ, మంగళవారాల్లో విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. డీఎం రఘు ఆధ్వర్యంలో అద్దె బస్సు యజమానులతో జరిపిన చర్చలు సఫలం కావడంతో మంగళవారం సాయంత్రం అద్దె బస్సులు రోడ్డెక్కాయి. డ్రైవర్లకు ప్రస్తుతం చెల్లిస్తున్న వేతనంతో పాటు అదనంగా మరో రూ.2వేలు చెల్లించేందుకు నిర్ణయించారు. అలాగే ఏడాదికి ఒక డ్రైవర్‌కు రెండు జతల యూనిఫాం ఇవ్వనున్నట్లు తెలిపారు.
శ్రావణి
శరణ్య
కృష్ణ సాయి

కేంద్ర మంత్రిని కలిసిన మత్స్యకారులు

కేంద్ర మంత్రిని కలిసిన మత్స్యకారులు

కేంద్ర మంత్రిని కలిసిన మత్స్యకారులు