ప్రధాన వార్తలు

టార్గెట్ పెద్దిరెడ్డి.. నారావారి వికటాట్టహాసాలు
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ‘పెద్దాయన’గా పేరు ప్రతిష్టలు.. ప్రజా సేవే పరమావధిగా సేవలందించే కుటుంబసభ్యులు.. పేదలతో మమేకమై చేసే రాజకీయాలు.. జిల్లావ్యాప్తంగా భారీ సంఖ్యలో అనుయాయులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంతం. దశాబ్దాలుగా ఆయన సంపాదించుకుంది జనాభిమానం. ఇదే చంద్రబాబుకు మింగుడుపడని అంశం. అందుకే స్టూడెంట్ పాలిటిక్స్ నుంచి తనకు కొరకరాని కొయ్యగా తయారైన పెద్దిరెడ్డిని లక్ష్యం చేసుకుని కుట్రలకు తెరతీశారు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కక్షగట్టి వేధింపులకు దిగుతున్నారు. తప్పుడు కేసులు పెట్టి ఇబ్బంది పెట్టేందుకు తెగబడుతున్నారు. అందులో భాగంగానే నిరాధార ఆరోపణలతో ఎంపీ మిథున్‌రెడ్డిని అరెస్ట్ చేయించారు.ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి కుటుంబమే సీఎం చంద్రబాబు నాయుడుకు అడ్డు. తనకంటే పెద్దిరెడ్డి కుటుంబానికే ఆదరణ పెరుగుతోందని, అందుకే ఆ ఫ్యామిలీ లక్ష్యంగా చంద్రబాబు కుట్రలకు పాల్పడుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన మొదలు నేటి వరకు పెద్దిరెడ్డి కుటుంబంపై చేపట్టిన వేధింపులే నిదర్శనం అనే ప్రచారం జరుగుతోంది. జిల్లాలో అందరూ పెద్దిరెడ్డిని ‘పెద్దాయన’ అని పిలుస్తుండడం చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారని వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు మండిపడుతున్నారు. కూటమి ప్రభుత్వంలో పెద్దిరెడ్డి కుటుంబంపై ఏడాదిగా సాగుతున్న అక్రమ కేసులు, దాడులు, దౌర్జన్యాలే ఇందుకు సాక్ష్యంగా చూపుతున్నారు.● కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చీ రాగానే మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్లు దగ్ధం అయ్యాయి. ఈ ఘటన వెనుక మాజీ మంత్రి, ఎమ్మె ల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి హస్తం ఉందంటూ అప్పట్లో హడావుడి చేశారు. ఏదో జరిగిపోయిందని సీఎం చంద్రబాబు హుటాహుటిన హెలికాప్టర్ ఏర్పాటు చేసి డీజీపీ, రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీని మదనపల్లెకు పంపించారు. తర్వాత ఆ ఘటనపై కేసులు నమోదు చేశారు. పెద్దిరెడ్డి అనుచరులు కొందరిని అరెస్టు చేశారు. అయితే అవేవీ ఇప్పటి వరకు రుజువు కాకపోవడంతో చివరకు ప్రభుత్వం వెనుకడుగు వేసింది.● రాజంపేట పార్లమెంట్ పరిధిలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి అనుచరులు అనేక మందిని నానా రకాలుగా ఇబ్బందులకు గురిచేశారు. ఆస్తులు ధ్వంసం చేశారు. వ్యవసాయ పంటలను నాశనం చేశారు. ఇటుక బట్టీల్లోకి చొరబడి వాటిని విక్రయించి సొమ్ముచేసుకున్నారు. సోమల మండలం కమ్మపల్లెలో వైఎస్సార్సీపీ సానుభూతి పరులందరినీ నెలలపాటు చిత్రహింసలకు గురిచేశారు. కొంత మంది ఊరొదిలి వెళ్లేలా దౌర్జన్యాలకు తెగబడ్డారు. అనేక మందిపై దాడులు చేసి ఆస్పత్రుల పాలు చేశారు. ప్రధానంగా పుంగనూరులో భయానక వాతావరణం సృష్టించారు. తప్పుడు కేసులు బనాయించి అరెస్ట్‌లు చేసి రిమాండ్ తరలించి పెద్దిరెడ్డి వర్గాన్ని భయాందోళనకు గురిచేసేందుకు యత్నించారు.● రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి గత ఏడాది జూలై 18న పుంగనూరు పర్యటనలో భాగంగా చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డెప్ప ఇంటికి చేరుకున్నారు. విషయం తెలుసుకుని టీడీపీ గూండాలు మాజీ ఎంపీ రెడ్డెప్ప నివాసంపై రాళ్ల దాడి చేశారు. వైఎస్సార్సీపీ శ్రేణులను కర్రలు, రాడ్లతో దారుణంగా తరిమికొట్టారు. మాజీ ఎంపీ రెడ్డెప్ప ఇంటిని ధ్వంసం చేశారు. వాహనాలకు నిప్పు పెట్టారు. మరికొన్ని వాహనాలను ఎందుకూ పనికిరాకుండా నాశనం చేశారు. దాడి చేసింది టీడీపీ గూండాలైతే.. ఎంపీ మిథున్‌రెడ్డి, మాజీ ఎంపీ రెడ్డెప్ప, పలువురు వైఎస్సార్సీపీ నేతలు మొత్తం 115 మందిపై కేసులు నమోదు చేశారు. ఈ కేసుల్లో ఎంపీ మిథున్‌రెడ్డితో పాటు పలువురికి కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో కూటమి నేతలు కంగుతిన్నారు.● పులిచెర్ల మండలం మంగళంపేట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చెందిన మామిడి తోటలలో అటవీశాఖకు చెందిన భూములు ఉన్నాయంటూ పచ్చమీడియాను అడ్డుపెట్టి ప్రభుత్వం నానా యాగీ చేసింది. డ్రోన్ కెమెరాలు, అధికారులను రంగంలోకి దింపి హంగామా సృష్టించింది.● తిరుపతిలోపెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నివాసం ఉన్న ప్రాంతం బుగ్గమఠానికి చెందిన భూముల్లోనే అని ఆరోపించి కూటమి ప్రభుత్వం కోర్టులో కేసులు దాఖలు చేసింది. అదే విధంగా కార్పొరేషన్ నిధులతో దారి ఏర్పాటు చేసుకున్నారని, అది కూడా ఆక్రమణేనంటూ ఎల్లో మీడియా ద్వారా విష ప్రచారం చేసింది.జలయజ్ఞంపై బాబు విషంకృష్ణమ్మ జలాలను పుంగనూరుకు తీసుకొచ్చి నిల్వ చేయడానికి స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి సంకల్పించారు. నాటి పాదయాత్రలో వైఎస్.జగన్మోహన్రెడ్డికి సమస్యను వివరించారు. అధికారంలోకి రాగానే ప్రాజెక్టులతో పడమటి ప్రాంతాలకు నీరు ఇచ్చే మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా తంబళ్లపల్లె, పుంగనూరు నియోజకవర్గాల్లోని ముదివేడు, నేతిగుట్లపల్లె, ఆవులపల్లెలో రూ.1200 కోట్ల వ్యయంతో ప్రాజెక్టుల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అయితే ఈ మూడు ప్రాజెక్టులతో వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి గుర్తింపు లభిస్తుందని, ఎన్నికల సమయంలో దీనిని అడ్డుకోవాలని చంద్రబాబునాయుడు ప్రాజెక్టులపై విషం చిమ్మారు. చోటా నేతలచే గ్రీన్ ట్రిబ్యూనల్‌లో తప్పుడు కేసులు వేసి పనులు అడ్డుకున్నారు. దీని కారణంగా పడమటి నియోజకవర్గాలకు జీవజలం లేక విలవిల్లాడే పరిస్థితి నెలకొంది.ఇప్పుడు తప్పుడు కేసులో..తాజాగా లిక్కర్ కేసులో రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డిపై తప్పుడు కేసులు నమోదు చేసి కూటమి ప్రభుత్వం అరెస్టు చేయించింది. ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండా చేసిన ఈ అక్రమ అరెస్ట్‌ను వైఎస్సార్సీపీ శ్రేణులతో పాటు సామాన్యులు సైతం తీవ్రంగా ఖండిస్తున్నారు.బాబు అరాచకాలు ప్రజలు చూస్తున్నారుకూటమి ప్రభుత్వం ఏడాదిగా చేస్తున్న అరాచకాలను ప్రజలు చూస్తున్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. మిథున్‌రెడ్డి కడిగిన ముత్యంలా బయటకు వస్తారు. ఇది కుట్రపూరితంగా పెట్టిన అక్రమ కేసు. ఎన్ని కుట్రలు చేసినా, కేసులు పెట్టినా న్యాయపరంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం.– భరత్, ఎమ్మెల్సీ, కుప్పంకుట్రలకు పెద్దిరెడ్డి కుటుంబం వెరవదుపెద్దిరెడ్డి కుటుంబ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ తీయాలని సీఎం చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం యోచిస్తోంది. ఆ దిదశగా ఓ బూటకపు మద్యం కుంబకోణాన్ని వెలుగులోకి తెచ్చింది. అందులోకి ఎలాంటి సంబంధం లేని రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డిపై అక్రమ కేసులు బనాయించి విచారణ పేరుతో సిట్ కార్యాలయానికి పిలిపించి అరెస్టు చేసింది. ప్రజాభిమానం కలిగిన మిథున్‌రెడ్డి విలువలతో కూడిన రాజకీయం చేస్తూ యువతకు ఆదర్శంగా నిలిచారు. అలాంటి నాయకుడిపై మద్యం కేసు నమోదు చేయడం దుర్మార్గం.-నూకతోటి రాజేష్, సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్తఎలాంటి ఆధారాలు లేకుండా..లిక్కర్ కేసులో గతంలోనే సిట్ ముందు ఎంపీ మిథున్‌రెడ్డి వాస్తవాలను చెప్పారు. కానీ ఆయన పీ ఎల్ఆర్ కంపెనీకి ఎవరో పెట్టుబడిగా పెట్టిన రూ.5 కోట్లపై ఎలాంటి ఆధారాలు లేకుండా కేసు పెట్టి ఆయన్ను అరెస్ట్ చేయడం చాలా బాధాకరం. చంద్రబాబు ఎందుకు వీరిని టార్గెట్ చేశారో జిల్లా ప్రజలందరికీ తెలుసు. న్యాయమే గెలుస్తుంది.– వెంకటేగౌడ, పలమనేరు మాజీ ఎమ్మెల్యేప్రశ్నిస్తుండడంతోనే అక్రమ కేసులుఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంతో ప్రశ్నిస్తున్నామనే ఎంపీ మిథున్‌రెడ్డిని అక్రమంగా అరెస్టు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కక్ష పూరితంగా అక్రమ కేసులు నమోదు చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతోంది. లేని మద్యం కేసును సృష్టించి అన్యాయంగా అరెస్టులు చేయడం దారుణం. దీనికి పచ్చమూక మూల్యం చెల్లించుకోక తప్పదు.– కృపాలక్ష్మి, గంగాధరనెల్లూరు నియోజకవర్గ సమన్వయకర్త కక్షగట్టి అరెస్ట్ చేశారుమాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి సన్నిహితంగా ఉంటున్నారనే నెపంతో ఎంపీ మిథున్‌రెడ్డిని అరెస్టు చేశారు. కూటమి పాలన లో కక్షసాధింపులు తారస్థాయికి చేరాయి. ఉద్యోగులను బెదిరించి, బ్లాక్ మె యిల్ చేసి స్టేట్మెంట్లు తీసుకున్నారు. కక్ష సాధింపులో భాగంగానే అరెస్టుల పరంపర జరుగుతోంది. 2014–19 పాలనాకాలానికి సంబంధించి చంద్రబాబు, ఆయన ప్రభుత్వంలోని మంత్రులు, సన్నిహితులపై 13 అవినీతి కేసులు ఉన్నాయి. ఇందులో మద్యం కుంభకోణం కేసు కూడా కీలకమైంది. ఈ కేసులను నిర్వీర్యం చేసేందుకు సీఎం పదవి ని అడ్డం పెట్టుకుని ఇలా చేస్తున్నారు.– విజయానందరెడ్డి, చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్తలోకేష్ నీకు చిప్పకూడే గతికూటమి ప్రభుత్వం కక్ష పూరితంగా ఎంపీ మిథు న్ రెడ్డిని అరెస్ట్ చేయడం బాధాకరం. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన నడుస్తోంది. ముఖ్యమంత్రి, మంత్రులు పరిపాలన మీద దృష్టి పెట్టకుండా తమ స్వార్థం కోసం వైఎస్సార్సీపీ నాయకులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. యువగళం పాద యాత్రలో ప్రజలకు న్యాయం చేస్తామని మాట ఇచ్చిన నారా లోకే ష్ పక్షాన ప్రశ్నిస్తే అరెస్టు చేయడం దుర్మార్గం. కూ టమి ప్రభుత్వ పాలనను ప్రజలందరూ గమనిస్తున్నారు. రానున్న కాలంలో కూటమి ప్రభుత్వానికి మూల్యం చెల్లించే సమయం ఆసన్నమైంది.– వీ.హరిప్రసాద్‌రెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రచార కార్యదర్శిసాక్షి టాస్క్‌ఫోర్స్

సంచలన ఆరోపణల వేళ.. ఒబామా అరెస్టు అంటూ ఏఐ వీడియో
సంచలన ఆరోపణల వేళ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పోస్ట్ చేసిన ఓ వీడియో తీవ్ర చర్చనీయాంశమైంది. ‘చట్టానికి ఎవరూ అతీతులు కాదని’ సందేశంతో ఆయన ఆ పోస్ట్ చేశారు. అయితే మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా అరెస్ట్ అయిన నేపథ్యంతో ఉన్న ఏఐ వీడియోను తన ట్రూత్ ప్లాట్‌ఫారమ్‌లో పోస్ట్ చేయడం గమనార్హం. ఓవల్ ఆఫీసులో ట్రంప్‌తో భేటీ అయిన సందర్భంలో మాజీ అధ్యక్షుడు ఒబామాను ఎఫ్‌బీఐ అరెస్టు చేసినట్లుగా ఆ వీడియో ఉంది. ఒబామా చేతుల్ని వెనక్కి విరిచి మరీ అధికారులు బేడీలు వేశారు. ఆ సమయంలో నవ్వుతూ కనిపించారు ట్రంప్. అటుపై ఒబామా కటకటాల్లో ఉన్నట్లు ఆ వీడియోలో ఉంది. అంతకంటే ముందు ఈ వీడియోలో.. చట్టానికి ఎవరూ అతీతులు కాదని పలువురు నేతలు చెప్పిన సందేశాన్ని దానికి జత చేశారు. ఆ నేతల్లో ముందుగా ఉంది ఒబామానే కావడం గమనార్హం. Donald #Trump reposts AI-generated video depicting Barack #Obama being arrested.#MAGA | #USApic.twitter.com/crkL8bew9l— Shivanshi Singh (@Shivansshi) July 21, 2025 అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసీ గబ్బార్డ్ మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాపై సంచలన ఆరోపణలకు దిగారు. 2016లో ట్రంప్ విజయం టైంలో ఒబామా ప్రభుత్వం కుట్రలకు తెర తీసిందని.. రష్యా ఎన్నికల జోక్యంపై కల్పిత ఇంటెలిజెన్స్ నివేదికలు తయారు చేయించారని, తద్వారా ట్రంప్ అధ్యక్ష పదవికి అర్హత లేదని చూపించే ప్రయత్నం చేశారని ఆరోపించారామె. ఈ క్రమంలో ఆమె అమెరికా న్యాయవిభాగానికి US Department of Justiceకి కొన్ని డాక్యుమెంట్లు సమర్పించినట్లు సమాచారం. Treason, Tulsi & Trump! Gabbard has accused #BarackObama of 'weaponizing intelligence' against #DonaldTrunp in 2016 - I explain why timing and intention of this huge claim is being questioned 👇#EpsteinFiles #TulsiGabbard pic.twitter.com/orQbiEICNK— Shreya Upadhyaya (@ShreyaOpines) July 20, 2025 ఈ వ్యవహారంపై రిపబ్లికన్ నేతలు గబ్బార్డ్‌కు మద్దతు తెలుపుతూ.. ఆమెపై ప్రశంసలు గుప్పించారు. అయితే డెమోక్రట్లు మాత్రం ఈ ఆరోపణలను రాజకీయ ప్రేరణతో కూడినవిగా, ఆధారాలు లేనివిగా అభివర్ణించారు. మరోవైపు Obama ఇంకా ఈ ఆరోపణలపై స్పందించలేదు. అయితే ఈ ఆరోపణలు వెల్లువెత్తిన మరుసటిరోజే ట్రంప్ ఇలా ఓ ఏఐ వీడియో తన అధికారిక ఖాతాలో పోస్ట్‌చేయడం గమనార్హం.

బరితెగించిన మానవ మృగం! తప్పించుకుని మరో బాలికను రక్షించి..
పట్టపగలే ఓ మానవ మృగం రెచ్చిపోయింది. తన అమ్మమ్మ ఇంటికి వెళ్తున్న ఓ చిన్నారిని ఎత్తుకెళ్లి కాటేసింది. చిన్నారి పారిపోయేందుకు ప్రయత్నించగా.. తీవ్రంగా గాయపరిచింది. అయినా ఆ చిన్నారిని వణికిపోలేదు. ధైర్యం తెచ్చుకుని.. ఎలాగోలా తప్పించుకుంది. అదే దారి వెంట వస్తున్న మరో చిన్నారిని ఆ కిరాతకుడి బారిన పడకుండా రక్షించగలిగింది. తమిళనాడులో హృదయవిదారకమైన ఘటన జరిగింది. తిరువళ్లూరులో పదేళ్ల బాలిక అత్యాచారానికి గురైంది. ఓ వ్యక్తి ఆ చిన్నారిని వెంబడించి మరీ ఎత్తుకెళ్లి ఈ ఘోరానికి పాల్పడ్డాడు. తీవ్ర కలకలం రేపిన ఈ పోక్సో కేసులో అనుమానితుడి ఫొటోలను, ఓ వీడియోను జిల్లా పోలీసులు విడుదల చేశారు. అతనికి సంబంధించిన సమాచారం అందించాలంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జులై 12వ తేదీ జరిగిన ఘటన వివరాల్లోకి వెళ్తే.. పదేళ్ల చిన్నారి తన అమ్మమ్మ ఇంటికి ఒంటరిగా వెళ్తోంది. ఆ సమయంలో ఆమెను వెంబడించిన ఓ వ్యక్తి ఎత్తుకెళ్లి సమీపంలోని మామిడి తోటల్లో అఘాయిత్యానికి ఒడిగట్టాడు. చిన్నారి తప్పించుకునేందుకు ప్రయత్నించగా, అతను మళ్లీ లాక్కెళ్లి కొట్టాడు. అయితే, ఈలోపు ఆ వ్యక్తికి ఫోన్ కాల్ రావడంతో అతని దృష్టి మరలింది. ఈ అవకాశాన్ని ఉపయోగించి చిన్నారి తప్పించుకుంది. కాస్త ముందుగా వెళ్లగా అదే దారిలో కిడ్నాప్ వైపు వెళ్తూ మరో చిన్నారి కనిపించింది. బాధిత చిన్నారి ఆ బాలిక వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్లి.. అటు వెళ్లొద్దంటూ అక్కడి నుంచి ఊరిలోకి తీసుకెళ్లింది. ఆపై ఇంటికి చేరి అమ్మమ్మకు జరిగినదాన్ని వివరించింది. బాధిత కుటుంబం ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. చిన్నారిని వైద్య చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన తమిళనాట దుమారం రేపుతోంది. పౌర సంఘాలతో పాటు విపక్ష పార్టీలు ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నాయి. డీఎంకే పాలనలో మహిళలకే కాదు.. చిన్నారులకూ రక్షణ లేకుండా పోతోందంటున్నాయి. అన్నామలై వర్సిటీ ఘటన, కదిలే రైలులో గర్బిణిపై జరిగిన దారుణాలను ప్రస్తావిస్తూ.. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇంకోవైపు తిరువళ్లూరు ఘటనలో నిందితుడి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. రన్నింగ్ ట్రైన్లో వచ్చిన నిందితుడు.. బాలికను వెంబడించాడని, ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీల్లో నమోదు అయ్యాయని అన్నారు. అతని ఫోన్ రింగ్ టోన్ హిందీ పాట ఉందని బాధిత బాలిక చెప్పిన ఆచూకీతో ఉత్తరాధి నుంచి వచ్చిన వలస కూలీ అయి ఉంటాడని పోలీసులు ఓ అంచనాకి వచ్చారు.The suspect in the photos/video is involved in a heinous crime of sexually assaulting a child. It is requested to communicate any information pertaining to him on 9952060948 pic.twitter.com/QBCdi5mQ2K— Thiruvallur District Police (@TNTVLRPOLICE) July 20, 2025

జమీన్ కీ బేటీ.. ఎంపీ ప్రియా సరోజ్ వైరల్ వీడియో!
రాజకీయ నాయకులు ఎలా ఉంటారో తెలిసిందే. అందులోనూ పదవీ, అధికారం చేతిలో ఉంటే..వాళ్లు ప్రవర్తించే తీరే వేరెలెవెల్ అన్నట్లు ఉంటుంది. కానీ ఈ ఎంపీగారు మాత్రం ప్రజలతో మమేకమయ్యేలా వ్యవహరించిన తీరు అందర్నీ ఆకట్టుకుంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అయితే కొందరు ఇది పబ్లిసిటీ స్టంట్ అపి విమర్శలు కురిపించగా కొందరు మాత్రం గ్రామీణ జీవన విధానంతో కనెక్ట్ అయ్యే తీరు ఇదేనని, ప్రజలకు చేరువవ్వాలంటే ఇలానే చేయాలంటూ ఆ మహిళా ఎంపీపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఇంతకీ ఆ మహిళా ఎంపీ ఎవరంటే..ఉత్తరప్రదేశ్ సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ, భారత క్రికెటర్ రింకు సింగ్ కాబోయే భార్య ప్రియా సరోజ్ రైతు మాదిరిగా స్వయంగా పొలంలో వరి నాట్లు నాటుతూ కనిపించారు. అందుకు సంబంధించిన వీడియోని ఎంపి ప్రియా తన ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగానే క్షణాల్లో వైరల్ అయ్యింది. ఆ వీడియోలో జౌన్‌పూర్‌లోని మచ్లిషహర్ నుంచి ఎంపీగా ఎన్నికైన ప్రియా సరోజ్, పొలంలో పనిచేస్తున్న మహిళా రైతు కూలీలతో కలిసి ఆమె కూడా వరి నాట్లు వేస్తూ బిజీగా కనిపించారు. నిజానికి ఆమె వారణాసిలోని పింద్రా తహసీల్ ప్రాంతంలోని కార్ఖియాన్‌లో నివసిస్తున్నారు. అయితే ఆదివారం వాతావరణం చాలా బాగుండటంతో తన గ్రామం వైపుగా వాకింగ్‌కి వెళ్తూ..అటుగా తన పొలానికి కూడా వెళ్లారు. అక్కడ పొలంలో పనిచేస్తునన్న ఇతర మహిళలు, తన స్నేహితులతో కలిసి ఆమె కూడా వరి నాటారు. ఏదో తూతూ మంత్రంగా చేసినట్లుగా కాకుండా సుమారు ఐదు ఎకరాల భూమిలో ఆమె స్వయంగా పనిచేశారు. అది ఒక రకంగా శ్రామిక జీవుల పట్ల ఆమెకున్న గౌరవాన్ని తేటతెల్లం చేయడమే గాక ప్రజలకు మరింతగా చేరువయ్యేలా చేసింది. అంతేగాదు ఆ వీడియోని చూసిన ప్రజలు ఆమెను “జమీన్ కీ బేటీ” అని ప్రశంసిస్తున్నారు. ఇదిలా ఉండగా, ప్రియా సరోజ్ తండ్రి తుఫానీ సరోజ్ కూడా రైతే. ఆమె కుటుంబానికి వ్యవసాయంతో చాలా అవినాభావ సంబంధం ఉంది. అందువల్ల ఆమెకు పొలంలో పనిచేయడం ఏమి కొత్త కాదని చెబుతున్నారు స్థానిక ప్రజలు. కాగా, ప్రియా రైతు మాదిరిగా వరి నాట్లు వేయడమే గాక రైతులు ఎదుర్కొంటున్న విద్యుత్ సరఫరా సమస్యల గురించి కూడా విద్యుత్ శాఖ మంత్రికి లేఖ రాసినట్లు సమాచారం. समाजवादी पार्टी की सांसद एवं रिंकू सिंह की होने वाली पत्नी की सादगी तो देखो मजदूरों के साथ धान लगवा रही हैं pic.twitter.com/70WBXfFbYJ— Bhanu Nand (@BhanuNand) July 20, 2025(చదవండి: ఫీల్ యువర్ ఫీలింగ్.. ఆర్ట్ ఆఫ్ హీల్.. ! వ్యాధులను నయం చేయడంలో..)

'బుక్‌మైషో' వాడికి డబ్బులిచ్చి ఇలాంటి పని చేపిస్తున్నాం: నాగవంశీ
విజయ్ దేవరకొండ హీరోగా నటించిన చిత్రం 'కింగ్డమ్'.. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య సంయుక్తంగా నిర్మించారు. జులై 31న పాన్ ఇండియా రేంజ్లో ఈ చిత్రం విడుదల కానుంది. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటించింది. అనిరుధ్ సంగీత దర్శకుడిగా వ్యవహరించారు. ఈ సినిమా విడుదల సందర్భంగా నిర్మాత నాగవంశీ ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ క్రమంలో 'బుక్‌మైషో'లో కనిపించే రేటింగ్స్, లైక్స్‌తో పాటు రివ్యూలు అన్నీ ఫేక్ అంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అదంతా డబ్బులిచ్చే తామే చేపిస్తామని ఆయన చెప్పుకొచ్చారు.కొత్తగా విడుదలయ్యే సినిమాకు ఒక నిర్మాత ఏలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారో నాగవంశీ ఓపెన్‌గా చెప్పారు.'మీడియాతో సరైనా సత్సంబంధాలు లేకుంటే ఒక సినిమా కిల్ అయిపోతుందనే భయం ప్రతి నిర్మాతలో ఉంటుంది. గత 15ఏళ్లుగా మేమే దానిని అలా క్రియేట్ చేసుకున్నామనిపిస్తుంది. ఇలాంటి వాతావరణాన్ని క్రియేట్ చేసే వారిలో కొందరు పీఆర్ (పబ్లిక్ రిలేషన్స్) టీమ్‌తో పాటు డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఉన్నారు. సినిమా విడుదలకు ముందు డబ్బులు ఖర్చు చేయకుంటే నష్టపోతామని మమ్మల్ని ఏకంగా పీఆర్ టీమ్ వారు బెదిరిస్తున్నారు. మూవీ విడుదల తర్వాత రేటింగ్, లైకులు, మంచి రివ్యూల కోసం ఏకంగా రూ. 30 లక్షలకు పైగా ఖర్చు చేయాల్సి వస్తుంది. కోట్లు ఖర్చు పెట్టి భయంతో ఉన్న మాకు రూ. 30 లక్షలే కదా అని ఒప్పుకోవాల్సిన పరిస్థితిలో మేము ఉన్నాం.తాజాగా కింగ్డమ్ ప్రోమో విడుదలైంది. ప్రేక్షకుల నచ్చింది. ప్రైమ్ మీడియాతో పాటు అందరూ బాగా రాశారు. అయితే, ఆ ప్రోమె కంటెంట్ నిజంగానే బాగుందని రాశారా..? లేదా పీఆర్ టీమ్ వారు టాలెంట్ చూపించి రాపించారా..? అనేది ఎవరికీ తెలియదు. కానీ, పీఆర్ టీమ్ మాత్రం తమ వల్లే వారందరూ మంచిగా రాశారని దర్శకుడు, ప్రోడ్యూసర్స్ దగ్గరికి వచ్చి గొప్పలు చెప్పుకుంటారు. అలా గొప్పగా మనమే రాపించామండి.. మనం చెప్పకపోతే వారు అసలు అలా రాయరని చెబుతారు. ఇలాంటి పరిస్థితి ప్రితి నిర్మాతకు ఎదురౌతుంది. 'బుక్‌మైషో'లో మీకు కనిపించే రేటింగ్స్, లైక్స్ కూడా మేము డబ్బులు ఇచ్చే చేపిస్తున్నాం. బుక్‌మైషోలో ఒక సినిమాకు ఎక్కువ లైకులు ఉంటే మరో సినిమా నిర్మాత ఇలా డబ్బులు ఇచ్చి చేపించడమే.. ఓపెన్‌గా చెబుతున్నాను ఇదే నిజం. ఇలాంటి తప్పుడు ప్రమోషన్ చేయకూడదని గిల్డ్‌లో మేము ఒక నిర్ణయం తీసుకున్నాం. బుక్‌మైషో వాడికి సినిమా టికెట్ ద్వారా వచ్చే కమీషన్‌తో పాటు ఇలా అదనంగా డబ్బు కూడా ఇవ్వాల్సి వస్తుంది. ఇక నుంచి ఇలాంటి పని ఎవరూ చేయకూడదని నిర్ణయం తీసుకున్నాం.' అని ఆయన అన్నారు.@vamsi84 intha open ga PRO la gurinchi cheppinodu evad ledu industry lo🔥🔥 nuvu thaggaku Absolutely 💯 correct ayana cheppindhi 🥵🥵🥵#KingdomCredits @greatandhranews pic.twitter.com/IO7HH9qyf5— 𝙏𝙝𝙚𝙢𝙨𝙠😉 (@saikiranM8721) July 20, 2025

BAN vs PAK: పాకిస్తాన్‌కు బంగ్లాదేశ్ షాక్
మిర్పూర్: బౌలర్లు విజృంభించడంతో సొంతగడ్డపై పాకిస్తాన్‌తో జరిగిన తొలి టీ20 (BAN vs PAK)లో బంగ్లాదేశ్ ఘనవిజయం సాధించింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆదివారం జరిగిన తొలి పోరులో బంగ్లాదేశ్ 7 వికెట్ల తేడాతో గెలిచి 1–0తో ఆధిక్యంలో నిలిచింది. 110 పరుగులకే ఆలౌట్‌టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ 19.3 ఓవర్లలో 110 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ ఫఖర్ జమాన్ (34 బంతుల్లో 44; 6 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్ కాగా... అబ్బాస్ అఫ్రిది (22; 3 సిక్స్‌లు), ఖుష్దిల్ షా (17; 1 ఫోర్, 1 సిక్స్) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. బంగ్లాదేశ్ బౌలర్ల ధాటికి మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. కెప్టెన్ సల్మాన్ ఆఘా (3)తో పాటు సయీమ్ అయూబ్ (6), హరీస్ (4), హసన్ నవాజ్ (0), మొహమ్మద్ నవాజ్ (3) పెవిలియన్‌కు వరుస కట్టారు. బంగ్లాదేశ్ బౌలర్లలో తస్కీన్ అహ్మద్ 3, ముస్తఫిజుర్ రహమాన్ 2 వికెట్లు పడగొట్టారు. పర్వేజ్ ఫిఫ్టిముఖ్యంగా ముస్తఫిజుర్ పాక్ బ్యాటర్లను వణికించాడు. 4 ఓవర్లలో కేవలం 6 పరుగులే ఇచ్చి 2 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. పాకిస్తాన్ ఆటగాళ్లలో ముగ్గురు రనౌట్ రూపంలో వెనుదిరిగారు. అనంతరం లక్ష్యఛేదనలో బంగ్లాదేశ్ 15.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 112 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ పర్వేజ్ హుసేన్ (Parvez Hossain Emon) (39 బంతుల్లో 56 నాటౌట్; 3 ఫోర్లు, 5 సిక్స్‌లు) అజేయ అర్ధశతకంతో అదరగొట్టగా... తౌహిద్ హృదయ్ (37 బంతుల్లో 36; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. పాకిస్తాన్ బౌలర్లలో సల్మాన్ మీర్జా 2 వికెట్లు పడగొట్టాడు. నాలుగో విజయంటీ20 ఫార్మాట్లో పాకిస్తాన్‌పై బంగ్లాదేశ్ నెగ్గిన మ్యాచ్‌లు. ఇప్పటిదాకా పాక్‌తో 23 టీ20 మ్యాచ్‌లు ఆడిన బంగ్లాదేశ్ నాలుగింటిలో మాత్రమే నెగ్గింది. 2015, 2016లలో మిర్పూర్‌లోనే జరిగిన మ్యాచ్‌ల్లో గెలిచిన బంగ్లాదేశ్... 2023 హాంగ్జౌ ఆసియా క్రీడల్లో చివరిసారి టీ20ల్లో పాక్‌ను ఓడించింది. చదవండి: IND vs PAK: పాక్‌తో మ్యాచ్ బహిష్కరణ

‘సుహృద్భావం’ క్లీన్‌బౌల్డ్
సాక్షి, అమరావతి: డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తాపై సీనియర్ ఐపీఎస్ అధికారుల తిరుగుబాటు బావుటా పోలీసు శాఖతోపాటు ఉన్నతస్థాయి అధికారవర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తూనే ఉంది. ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల మధ్య సుహృద్భావపూర్వకంగా నిర్వహించిన క్రికెట్ మ్యాచ్‌పై కూడా ఈ ఆధిపత్య పోరు ప్రభావం పడింది. డీజీపీ గుప్తాతో వేదిక పంచుకునేందుకు ఇతర డైరెక్టర్ జనరల్(డీజీ)లు ససేమిరా అనడం గమనార్హం. దీంతో క్రికెట్ మ్యాచ్ ముఖ్య అతిథులుగా హాజరవ్వాల్సిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) కె.విజయానంద్, డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా ముఖం చాటేయాల్సి వచ్చింది. పరిస్థితి తీవ్రతను గుర్తించిన సీనియర్ ఐఏఎస్, ఇతర ఐపీఎస్ అధికారులు ఎవరూ క్రికెట్ మ్యాచ్ వైపు తొంగి చూడనే లేదు. యావత్ ప్రభుత్వ అధికార యంత్రాంగంలో కలకలం రేపుతున్న ఈ తాజా పరిణామం ఇదిగో ఇలా ఉంది.. ఐఏఎస్, ఐపీఎస్ అ«ధికారుల మధ్య సుహృద్భావపూర్వక సంబంధాలు కొనసాగించేందుకు ఏటా క్రికెట్ మ్యాచ్ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రికెట్ మ్యాచ్‌కు సీఎస్, డీజీపీ ముఖ్య అతిథులుగా హాజరవుతారు. క్రికెట్ మ్యాచ్ ఆడే అధికారులే కాకుండా సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కుటుంబాలతోసహా వచ్చి మ్యాచ్‌ను వీక్షిస్తారు. కోవిడ్ వ్యాప్తితో 2020, 2021లో ఈ క్రికెట్ మ్యాచ్ నిర్వహించ లేదు. అనంతరం మూడేళ్లపాటు వివిధ కారణాలతో క్రికెట్ మ్యాచ్ నిర్వహించ లేకపోయారు. దీంతో ఈ ఏడాదికిగాను ఆదివారం క్రికెట్ మ్యాచ్ ఘనంగా నిర్వహించాలని ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల ఉమ్మడిగా నిర్ణయించారు. ఆదివారం మూలపాడు స్టేడియంలో మ్యాచ్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లూ చేశారు. సీఎస్ విజయానంద్, డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా ముఖ్య అతిథులుగా హాజరవుతారని కూడా షెడ్యూల్ ప్రకటించారు. ఇరుజట్ల తరపున క్రికెట్ మ్యాచ్ ఆడే 11 మంది చొప్పున అధికారులతోపాటు ఇతర సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఈ మ్యాచ్‌ను తిలకించేందుకు హాజరువుతామని చెప్పారు.డీజీపీతో వేదిక పంచుకునేదే లేదన్న డీజీలుకాగా రాష్ట్ర ప్రభుత్వం, డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా ఒంటెత్తు పోకడలపై డీజీలు తీవ్ర ఆగ్రహంగా ఉన్న విషయం తెలిసిందే. అసలు పోలీసు శాఖలో ఉన్నతస్థాయి అధికారుల మధ్యే ఎలాంటి సహృద్భావం లేనప్పుడు ఈ క్రికెట్ మ్యాచ్ ఎందుకని వారు తేల్చి చెప్పారు. మనసులో సామరస్య భావన లేకుండా కేవలం ముఖస్తుతి కోసం తాము వచ్చి మ్యాచ్‌ను వీక్షించలేమని స్పష్టం చేశారు.ముఖం చాటేసిన సీఎస్, డీజీపీడీజీల నిర్ణయంతో సీఎస్ విజయానంద్, డీజీపీ గుప్తా కంగు తిన్నారు. పరిస్థితిని సర్దుబాటు చేసేందుకు సీఎస్ చేసిన యత్నాలను డీజీలు ఇప్పటికే తోసిపుచ్చారు. ఈ నేపథ్యంలో డీజీలు హాజరుకాని క్రికెట్ మ్యాచ్ వీక్షించేందుకు తాను వెళితే వారు మరింత అవమానంగా భావించే అవకాశం ఉంటుందని సీఎస్ భావించారు. అందుకే తాను క్రికెట్ మ్యాచ్ వీక్షించేందుకు రావడం లేదని కబురు పంపారు. సీఎస్ రానప్పుడు తాను మాత్రం ఎందుకు వెళ్లడమని డీజీపీ గుప్తా భావించారు. తన ఉనికే డీజీలకు గిట్టనప్పుడు తానెందుకు మ్యాచ్‌కు వెళ్లడమని ఆయన భావించినట్టు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. దీంతో తాను కూడా మ్యాచ్‌కు రావడం లేదని గుప్తా సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది.స్టేడియంవైపు తొంగి చూడని ఇతర ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు సీఎస్, డీజీలే రాలేమన్న క్రికెట్ మ్యాచ్‌కు తామెందుకు వెళ్లాలని ఇతర సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు భావించారు. ఈ ఆధిపత్య పోరు పరిస్థితుల నేపథ్యంలో క్రికెట్ మ్యాచ్‌కు దూరంగా ఉండటమే సరైందని వారు నిర్ణయానికి వచ్చారు. దీంతో ముఖ్య కార్యదర్శి స్థాయి ఐఏఎస్ అధికారులు, ఇతర సీనియర్ ఐపీఎస్ అధికారులు ఎవరూ కూడా మూలపాడు స్టేడియం వైపు ఆదివారం కనీసం తొంగి చూడనే లేదు. ముందుగా ప్రకటించాం తప్పదు కాబట్టి కేవలం ఇరు జట్ల ఆటగాళ్లు మాత్రమే తూతూ మంత్రంగా క్రికెట్ మ్యాచ్ ఆడారు. మొత్తం ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, వారి కుటుంబ సభ్యులు వీక్షిస్తుండగా కోలాహలంగా నిర్వహించాల్సిన క్రికెట్ మ్యాచ్ కాస్త ... పోలీసు శాఖలో ఆధిపత్య పోరుతో నిస్తేజంగా ముగిసింది.

హెచ్–1బీ వీసాకు కొలువుతో లింకు!
వాషింగ్టన్: డొనాల్డ్ ట్రంప్ తొలిసారిగా అధ్యక్షునిగా పాలించిన కాలంలో అమలై తర్వాత బైడెన్ హయాంలో బుట్టదాఖలైన ఒక విధానాన్ని మళ్లీ ప్రవేశపెట్టాలని ఉవ్విళ్లూరుతున్నారు. ట్రంప్ తొలివిడత అమెరికా అధ్యక్షునిగా పరిపాలించిన కాలంలో హెచ్–1బీ వీసాల కోసం లాటరీ విధానాన్ని పక్కనబెట్టి ఆయా కంపెనీలు ఉద్యోగానికి ఇచ్చే జీతభత్యాల ఆధారంగా వీసాలను జారీచేయాలని నిర్ణయించారు. ఆ విధానాన్నే ఆనాడు అమలుచేశారు. దీంతో కంపెనీలు మరింత మంది ఉద్యోగులను ఉన్నత ఉద్యోగాలకు తీసుకుంటాయని, తక్కువ స్థాయి ఉద్యోగాలు అమెరికన్లకే దక్కుతాయని ట్రంప్ సర్కార్ భావించింది. అయితే విదేశాల నుంచి వచ్చే నిపుణులైన ఉద్యోగులకు అన్ని స్థాయిల ఉద్యోగాలు దక్కాలనే ఉద్దేశంతో జో బైడెన్ సర్కార్ ఈ విధానాన్ని రద్దుచేసి మళ్లీ లాటరీ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఇప్పుడు మళ్లీ ఈ లాటరీ విధానానికి స్వస్తిపలికి ఉద్యోగి జీతం, హోదా, పొజిషన్ ఆధారంగా హెచ్–1బీ వీసాలు ఇవ్వాలని అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం భావిస్తోంది. ఇందులోభాగంగా సంబంధిత ప్రతిపాదనను సమీక్షించాలంటూ శ్వేతసౌధంలోని ఇన్ఫర్మేషన్ అండ్ రెగ్యులేటరీ అఫైర్స్ ఫర్ రివ్యూ విభాగానికి తన ప్రతిపాదనలను పంపింది.వాస్తవానికి ప్రతి సంవత్సరం ఎన్ని హెచ్–1బీ వీసాలు జారీ చేయాలనే పరిమితిని అమెరికా కాంగ్రెస్(పార్లమెంట్) నిర్ణయిస్తుంది. ప్రస్తుతం ప్రతి సంవత్సరం 85,000 హెచ్–1బీ వీసాలను జారీచేస్తున్నారు. వీటిలో 20,000 వీసాలను మాస్టర్స్ డిగ్రీ పట్టా ఉన్న ఉద్యోగులు ప్రత్యేకంగా కేటాయించారు. వీటిలో అత్యధికం అమెజాన్, మెటా, మైక్రోసాఫ్ట్ వంటి పెద్ద కంపెనీలే సాధిస్తున్నాయి. ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు చేసి తమ ఉద్యోగుల్లో ఎక్కువ మందికి వీసా దక్కేలా చేస్తున్నాయి. ఇక ఎలాంటి పరిమితి లేని వీసాలను విశ్వవిద్యాలయాల్లోని పరిశోధన విభాగాల కోసం కేటాయించారు.2026 ఏడాదికి జారీచేయాల్సిన వీసాల కోసం స్వీకరించాల్సిన దరఖాస్తులు సరిపడా రావడంతో వాటి ప్రాసెస్‌ను నిలిపివేశారు. అమెరికా సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సరీ్వసెస్ విభాగం శుక్రవారం ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ లెక్కన 2026 సంవత్సరానికి లాటరీ విధానం ఉండకపోవచ్చని స్పష్టమైంది. పొజిషన్ ఆధారంగా వీసాల జారీ ప్రక్రియలను అమెరికాలోని ఆర్థికరంగ నిపుణులు స్వాగతిస్తున్నారు. అత్యధిక వృత్తి నైపుణ్యాలున్న వ్యక్తులకే అత్యధికంగా హెచ్–1బీ వీసాలు దక్కే అవకాశం ఉండటంతో వారి కృషి, పని ద్వారా అమెరికా ఆర్థికవ్యవస్థ మరింత మెరుగుపడుతుందని వారు ఆశిస్తున్నారు.

‘శశిథరూర్ మాతో లేరు.. మీటింగ్‌లకు పిలవం’
కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ వ్యవహార శైలిపై సొంత పార్టీలో.. అదీ సొంత రాష్ట్రంలోనే తీవ్ర అసంతృప్తి పెరుగుతోంది. ఆయన్ను తమలో ఒకరిగా పరిగణించడం లేదంటూ తాజాగా పార్టీ సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించారు. దేశ భద్రత అంశంపై థరూర్ తన వైఖరిని మార్చుకునే వరకు పార్టీ కార్యక్రమాలకు ఆయన్ను ఆహ్వానించేది లేదన్నారు మాజీ ఎంపీ కే మురళీధరన్. పార్టీ ప్రయోజనాల కంటే దేశానికే ప్రాధాన్యం ఇవ్వాలని శశిథరూర్ వ్యాఖ్యానించిన వేళ.. కేరళ కాంగ్రెస్ సీనియర్ నేత కే మురళీధరన్ మీడియాతో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘శశిథరూర్ తన తీరును మార్చుకునే వరకు.. తిరువనంతపురంలో నిర్వహించే పార్టీ కార్యక్రమాలకు ఆహ్వానించబోం. ఆయన మాతో కలిసి లేరు. కాబట్టి.. ఆయన్ను బహిష్కరించే ప్రశ్నే పుట్టదు. అయితే ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో పార్టీ అధిష్ఠానం నిర్ణయిస్తుంది’’ అని మురళీధరన్ అన్నారు. ఇదిలా ఉంటే.. కే మురళి శశిథరూర్‌పై మండిపడ్డడం ఇదే తొలికాదు. ఎమర్జెన్సీ రోజులపై థరూర్ రాసిన వ్యాసంపైనా ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్‌లో ఆయనకు(శశిథరూర్ పేరును ప్రస్తావించకుండా) ఏమైనా ఆంక్షలు ఉన్నట్లు అనిపిస్తే.. స్పష్టమైన రాజకీయ మార్గాన్ని ఎంచుకోవాలని సూచించారు. ఇంకోవైపు కేరళలోని యూడీఎఫ్ నేతల్లో సీఎం అభ్యర్థిగా శశిథరూర్ వైపే మొగ్గు ఉందంటూ ఓ సర్వేకు సంబంధించిన పోస్టుపైన మురళీధరన్ గతంలో విరుచుకుపడ్డారు. ఆయన ఏ పార్టీకి చెందినవారో ముందుగా నిర్ణయించుకోవాలన్నారు.గత కొంతకాలంగా శశిథరూర్‌కు కాంగ్రెస్ అధిష్టానాకి మధ్య పొసగడం లేదు. ఈ క్రమంలో మోదీ ప్రభుత్వ అనుకూల వ్యాఖ్యలు చేస్తూ సొంత పార్టీ నుంచి శశిథరూర్ విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అయితే ఎవరేమనుకున్నా తాను బీజేపీలో చేరేది లేదని.. కాంగ్రెస్‌లోనే కొనసాగుతానంటూ థరూర్ చెబుతూ వస్తున్నారు.

బాబు కుతంత్రం..‘అప్రూవర్’ తంత్రం
భయపెట్టి.. ప్రలోభపెట్టి.. మద్యం అక్రమ కేసులో తిమ్మినిబమ్మి చేసేందుకు కూటమి ప్రభుత్వం చేయని ప్రయత్నం లేదు. ఇంతా చేసి.. కోర్టుకు సమరి్పంచిన చార్జ్‌షీట్, రిమాండ్ రిపోర్ట్‌లో ఒక్క ఆధారమూ చూపలేదు. ఒకరిద్దరిని అప్రూవర్లుగా మార్చుకోవడమే తమ ముందున్న దారి అని చెప్పకనే చెప్పింది. ఫేక్ ఇన్వాయిస్లు అంటూ తనకు తానే స్వీయ ధ్రువీకరణ ఇచ్చుకుంది. ఫలానా సమయంలో ఫలానా సెల్ టవర్ పరిధిలో ఉండటమే ఆధారమని చెప్పుకు రావడం విడ్డూరం. సిట్ దర్యాప్తు తీరు చూస్తుంటే సీఎం చంద్రబాబునాయుడు కక్ష సాధింపు తప్ప ఈ కేసులో మరేమీ లేదని తేటతెల్లమవుతోంది. సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వ కుట్ర మరోసారి బట్టబయలైంది. బెదిరించి, వేధించి అబద్ధపు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాలతో సాగిస్తున్న అక్రమ కేసు కుతంత్రాన్ని టీడీపీ కూటమి ప్రభుత్వమే మరోసారి బయట పెట్టుకుంది. చంద్రబాబు ప్రభుత్వం రచించిన ‘అప్రూవర్ కుట్ర’ తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ అక్రమ కేసులో బెవరేజెస్ కార్పొరేషన్ పూర్వ ఎండీ వాసుదేవరెడ్డి, పూర్వ ఉద్యోగి సత్య ప్రసాద్‌ను ఇప్పటికే తీవ్రంగా వేధించి, మరీ అబద్ధపు వాంగ్మూలం నమోదు చేయించిన కూటమి ప్రభుత్వం.. తాజాగా వారి ద్వారా అప్రూవర్ కుట్రకు తెగబడేందుకు యత్నించడం గమనార్హం. ప్రభుత్వ పెద్దల డైరెక్షన్లో సిట్ అధికారులు గుట్టుచప్పుడు కాకుండా ఈ కుతంత్రాన్ని చక్కబెట్టేందుకు యత్నించిన వ్యవహారం బయటపడింది. తద్వారా వైఎస్సార్సీపీ ప్రభుత్వం పారదర్శకంగా మద్యం విధానాన్ని అమలు చేసినట్టు చంద్రబాబు ప్రభుత్వం పరోక్షంగా అంగీకరించింది. లేని కుంభకోణం ఉన్నట్టుగా చూపించేందుకు తాము అబద్ధపు వాంగ్మూలాలపైనే ఆధార పడ్డామని నిస్సిగ్గుగా వెల్లడించింది. ఆ ఇద్దరూ సిట్ చీఫ్‌తో భేటీరాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాలతోగానీ, మద్యం విధానంతో గానీ ఏమాత్రం సంబంధం లేని వారిని కూడా ప్రభుత్వ పెద్దల సూచనల మేరకు ఏ30 నుంచి ఏ40 వరకు నిందితులుగా పేర్కొని సిట్ అరెస్టు చేసింది. వారిలో ప్రపంచ స్థాయి సిమెంట్ దిగ్గజ సంస్థ వికాట్ కంపెనీ డైరెక్టర్ బాలాజీ గోవిందప్పతోపాటు పలువురు ఉన్నారు. ఇదే కేసులో నిందితులైన వాసుదేవరెడ్డి(ఏ2), సత్య ప్రసాద్(ఏ3)లను బెదిరించి, అప్రూవర్లుగా మారేందుకు అనుమతించాలని, వారిద్దరితో విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో పిటిషన్ వేయించాలని పన్నాగం పన్నింది. ఇందులో భాగంగా శనివారం వారు విజయవాడ ఏసీబీ న్యాయస్థానానికి వచ్చారు. ముందుగా సిట్ కార్యాలయానికి వెళ్లారు. సిట్ చీఫ్ ఎస్వీ రాజశేఖర్బాబుతోపాటు ఇతర అధికారులతో సమావేశమయ్యారు. అనంతరం కొందరు సిట్ అధికారులతో కలసి న్యాయస్థానంలో అప్రూవర్ పిటిషన్ దాఖలు చేసేందుకు వెళ్లారు. ఇలా వారిద్దరితో మరిన్ని అబద్ధపు వాంగ్మూలాలు న్యాయస్థానంలో నమోదు చేయించాలన్నది ప్రభుత్వ పెద్దల ఎత్తుగడగా స్పష్టమైంది. అయితే న్యాయ వర్గాలతో చర్చించిన వారు అప్రూవర్ పిటిషన్ దాఖలు చేయకుండా వెనక్కి తీసుకుని వెళ్లిపోయారు. ముందస్తు బెయిల్ పిటిషన్ నాటకం వాసుదేవరెడ్డి, సత్య ప్రసాద్ అప్రూవర్ పిటిషన్లు వేయకుండా వెనుదిరగడంపై సిట్ అధికారులు ఆందోళనకు గురైనట్లు సమాచారం. వీరిద్దరూ ఎదురు తిరిగితే ఈ అక్రమ కేసు పూర్తిగా నీరుగారి పోతుందని బెంబేలెత్తిన సిట్ అధికారులు ఈ విషయాన్ని ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకువెళ్లారు. వారి ఆదేశాలతో కొత్త ఎత్తుగడ వేశారు. వాసుదేవరెడ్డి, సత్య ప్రసాద్‌తో హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేయించారు. ఆ ముందస్తు బెయిల్ పిటిషన్లను న్యాయస్థానంలో వ్యతిరేకించకుండా సహకరిస్తామని సిట్ అధికారులు వారికి చెప్పినట్టు సమచారం. కాగా హడావుడిగా అప్పటికప్పుడు దాఖలు చేసిన ఆ పిటిషన్లకు తగిన పత్రాలు జతపరచ లేదు. దాంతో సాంకేతిక కారణాలతో న్యాయస్థానం ఆ పిటిషన్లను వెనక్కి పంపింది.అబద్ధపు వాంగ్మూలాలు ఇలా...⇒ వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానం పూర్తి పారదర్శకంగా అమలైందని చంద్రబాబు ప్రభుత్వమే పరోక్షంగా అంగీకరించినట్లయిందని ఈ తాజా పరిణామాలు మరోసారి స్పష్టం చేశాయి. రెడ్‌బుక్ కక్ష సాధింపు కోసం తాము నమోదు చేసిన అక్రమ కేసు దర్యాప్తు కోసం పూర్తిగా అబద్ధపు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాలపైనే ఆధార పడ్డామని ప్రభుత్వమే బయట పెట్టుకుంది.⇒ బెవరేజెస్ కార్పొరేషన్ పూర్వ ఎండీ వాసుదేవరెడ్డితోపాటు ఇప్పటి వరకు ఇతర అధికారులు, సాక్షులతో తాము నమోదు చేయించినవన్నీ అబద్ధపు వాంగ్మూలాలే అన్నది స్పష్టమైంది. వాసుదేవరెడ్డిని అబద్ధపు వాంగ్మూలం ఇవ్వాలని సిట్ అధికారులు వేధించారు. సిట్ వేధింపులపై ఆయన మూడుసార్లు హైకోర్టును ఆశ్రయించారు. అయినా సరే ప్రభుత్వం ఆయన్ను వెంటాడి వేధించింది. డెప్యుటేషన్ ముగిసినా రిలీవ్ చేయకుండా అడ్డుకుంది. కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురి చేసింది. దీంతో చివరికి సిట్ చెప్పినట్టుగా ఆయన అబద్ధపు వాంగ్మూలం ఇచ్చారు. ఆ వెంటనే వాసుదేవరెడ్డిని రిలీవ్ చేసి కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది.⇒ బెవరేజెస్ కార్పొరేషన్ పూర్వ ఉద్యోగులు సత్య ప్రసాద్, అనూషలను వేధించి అబద్ధపు వాంగ్మూలాలు నమోదు చేయించింది. అబద్ధపు వాంగ్మూలాలు ఇచ్చేందుకు సమ్మతించని వారిపై సిట్ తన ప్రతాపం చూపించింది. కొన్ని డిస్టిలరీల ప్రతినిధులు వృద్ధులని కూడా చూడకుండా విచారణ పేరుతో హైదరాబాద్ నుంచి విజయవాడ తీసుకువచ్చి వేధించింది. దాంతో వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దాంతో వారిని హైదరాబాద్‌లోని వారి నివాసంలోనే విచారించాలని న్యాయస్థానం ఆదేశించింది. ⇒ ఈ కేసుతో ఏమాత్రం సంబంధం లేని రాజ్ కేసిరెడ్డి తండ్రిని బలవంతంగా తీసుకువచ్చి విచారణ పేరుతో వేధించింది. మరో నిందితుడి తండ్రి, రిటైర్డ్ కానిస్టేబుల్‌ను అక్రమంగా నిర్బంధించి మరీ వేధించడంతో ఆ కుటుంబం హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది.⇒ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి వద్ద గతంలో గన్‌మెన్‌గా పని చేసిన గిరి, మదన్ రెడ్డిలను అక్రమంగా నిర్బంధించి అబద్ధపు వాంగ్మూలం కోసం వేధించారు. బెంబేలెత్తిన గిరి సిట్ అధికారులు చెప్పినట్టు అబద్ధపు వాంగ్మూలం ఇచ్చారు. అందుకు సమ్మతించని మదన్ రెడ్డిపై సిట్ అధికారులు థర్డ్ డిగ్రీ ప్రయోగించడం విభ్రాంతి కలిగించింది. సిట్ అధికారులు తనపై భౌతికంగా దాడి చేశారని ఆయన న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు కూడా.⇒ అబద్ధపు వాంగ్మూలం ఇస్తే నామినేటెడ్ పదవి ఇవ్వడంతోపాటు రూ.2 కోట్లు ఇస్తామని ప్రభుత్వ పెద్దలు సిట్ అధికారుల ద్వారా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి స్నేహితుడు వెంకటేశ నాయుడు దంపతులను ప్రలోభ పెట్టారు. అందుకు వారు తిరస్కరించడంతోనే ఈ కేసులో ఆయన్ను అరెస్టు చేశారు. ప్రభుత్వ పెద్దల అండతో ఈ అక్రమ కేసు దర్యాప్తు పేరిట సిట్ బరితెగించి సాగిస్తున్న అధికారిక గూండాగిరీకి ఈ పరిణామాలే నిదర్శనం.అబద్ధాలూ.. వక్రీకరణలే వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంపై నమోదు చేసిన అక్రమ కేసు కుట్రలో ప్రభుత్వం తన కుతంత్రాలకు మరింతగా పదును పెడుతోంది. పూర్తిగా అవాస్తవాలు, వక్రీకరణలతో నిబంధనలను ఉల్లంఘిస్తోంది. సిట్ దాఖలు చేసిన చార్జ్‌షీట్, ఎంపీ మిథున్ రెడ్డి రిమాండ్ నివేదికలే ఆ విషయాన్ని మరోసారి బయటపెట్టాయి. లేని కుంభకోణం ఉన్నట్టుగా చూపించేందుకు సిట్ యత్నిస్తోందని ఎంపీ మిథున్ రెడ్డి రిమాండ్ నివేదిక వెల్లడించింది. ఆయనకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు సృష్టించలేకపోయిన సిట్ అధికారులు వక్రభాష్యాలతో కనికట్టు చేసేందుకు యత్నించారు. ఈ కేసులో ఇతర నిందితులతోపాటు ఎంపీ మిథున్ రెడ్డి సమావేశమై అక్రమాలకు కుట్ర పన్నారని సిట్ రిమాండ్ నివేదికలో పేర్కొంది. అందుకు సిట్ చూపించిన ఆధారం ఏమిటో తెలుసా.. సెల్‌టవర్ లొకేషన్! హైదరాబాద్‌లో సమావేశం జరిగిందని చెబుతున్న రోజున ఎంపీ మిథున్ రెడ్డి, ఇతర నిందితుల సెల్ ఫోన్లు అన్ని ఒకే చోట ఉన్నట్టు సెల్ టవర్ లొకేషన్ ద్వారా తెలుసుకున్నామని సిట్ పేర్కొనడం విడ్డూరంగా ఉంది. ఎందుకంటే సెల్ టవర్ పరిధి 200 చ.మీటర్లు ఉంటుంది. అంత పరిధిలో హైదరాబాద్ వంటి కాంక్రీట్ జంగిల్ వంటి మహానగరంలో వేలాది సెల్ ఫోన్లు ఉంటాయి. అంత మాత్రాన ఆ వేలాది మంది కూడా ఒక గదిలో సమావేశమైనట్టు భావించాలా? ఎక్కడ న్యాయం? ఎక్కడ ధర్మం?ఎంపీ మిథున్ రెడ్డి ఈ కేసుకు సంబంధించిన పలువురితో సెల్ ఫోన్లో మాట్లాడినట్టు కాల్ డేటా వివరాలు వెల్లడిస్తున్నాయని సిట్ అధికారులు రిమాండ్ నివేదికలో పేర్కొనడం విడ్డూరంగా ఉంది. 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న కుటుంబం నుంచి వచ్చిన ఆయన ఎంపీ. లోక్‌సభలో వైఎస్సార్సీపీ నేతగా కీలక బాధ్యతల్లో ఉన్నారు. అటువంటి క్రియాశీల ప్రజాప్రతినిధి రోజూ ఎందరో నేతలు, కార్యకర్తలు, వివిధ వర్గాల ప్రజలతో ఫోన్లో మాట్లాడుతునే ఉంటారు. అంత మాత్రాన వారిందరితో కలసి కుట్ర పన్నినట్టు ఎలా భావిస్తారు? ఎలాంటి ఆధారాలు లేనందునే సిట్ అధికారులు సెల్ టవర్ లొకేషన్, కాల్ డేటాలను వక్రీకరిస్తూ న్యాయస్థానాన్ని తప్పుదారి పట్టించేందుకు యత్నించారన్నది స్పష్టమవుతోంది. దర్యాప్తు పేరిట సిట్ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని చార్జ్‌షీట్ వెల్లడిస్తోంది. కేంద్ర జీఎస్టీ చట్టాన్ని ఉల్లంఘిస్తూ మరీ సిట్ అధికారులు తమ పరిధిని అతిక్రమించారు. మద్యం సరఫరా చేయకుండానే చేసినట్టు ఫేక్ ఇన్వాయిస్లు సమర్పించినట్టు తమ దర్యాప్తులో వెల్లడైనట్టు సిట్ అధికారులు చార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. అవి ఫేక్ ఇన్వాయిస్లని ఎలా గుర్తించారో మాత్రం వెల్లడించనే లేదు. కేంద్ర జీఎస్టీ అధికారులు నిర్ధారించకుండా అవి ఫేక్ ఇన్వాయిస్‌లనీ సిట్ అధికారులు ఏకపక్షంగా ఎలా తుది నిర్ణయానికి వచ్చారో అర్థం కావడం లేదు. అంటే లేని ఆధారాలు ఉన్నట్టుగా సిట్ అధికారులు న్యాయస్థానాన్నే తప్పుదారి పట్టించేందుకు తెగిస్తున్నారన్నది స్పష్టమవుతోంది. కుట్రపూరితంగానే కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఈ కేసులో సిట్ దాఖలు చేసిన చార్జ్‌షీట్ ఆధారంగానే నిగ్గు తేలింది. ఈ లెక్కన ఈ కేసులో ఎక్కడ న్యాయం ఉన్నట్లు? ఎక్కడ ధర్మం ఉన్నట్లు? ప్రభుత్వం కుట్రతోనే వ్యవహరిస్తున్నదని అడుగడుగునా స్పష్టమవుతోంది.
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
ఆర్థిక సంక్షేమానికి ‘కస్టమైజ్డ్’ ఆరోగ్య బీమా
శ్రావణం శుభప్రదం..! వరలక్ష్మీ వత్రం ఎప్పుడంటే..?
బరితెగించిన మానవ మృగం! తప్పించుకుని మరో బాలికను రక్షించి..
T20I Tri-Series: ఫైనల్లో న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా
BAN vs PAK: పాకిస్తాన్‌కు బంగ్లాదేశ్ షాక్
జమీన్ కీ బేటీ.. ఎంపీ ప్రియా సరోజ్ వైరల్ వీడియో!
ఇస్కాన్ రెస్టారెంట్లోకి చికెన్ తెచ్చిన యువకుడు.. తీవ్ర విమర్శలు
‘మా అంచనా తప్పింది’
రిటైర్మెంట్ కోసం స్మాల్‌క్యాప్ బెటరా?
రామ్‌చరణ్ సాయం..? ఒక్క రూపాయి రాకుండా చేశారు: ఫిష్ వెంకట్ కూతురు
'జూనియర్' కలెక్షన్.. మొదటిరోజు అన్ని కోట్లా?
ఎలుక... ఎంత పని చేసింది!
పైలట్ ‘మాస్ మర్డర్-సూసైడ్’
మీ బండిపై చలాన్ ఉంది.. కట్టేయండి!
ఈ రాశి వారికి పలుకుబడి పెరుగుతుంది.. శుభవార్తలు వింటారు
కుటుంబ సభ్యుల మోసం.. నాన్న కొత్త ప్రయాణం: అనసూయ
అనుకున్నదే జరిగింది.. కరుణ్ నాయర్ గుడ్‌బై
ఇద్దరితో సహజీవనం.. అతడితో పెళ్లి.. భార్యకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపి..
ఈ రాశి వారికి వ్యాపారాలు.. ఉద్యోగాలలో నూతనోత్సాహం
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
మియాపూర్: స్కూల్ బిల్డింగ్ పైనుంచి దూకి విద్యార్థి మృతి
స్వామీ! మీరే కాపాడాలి.. ఎక్కడ మద్యం కేసులయినా మమ్మల్నే అందులోకి లాగుతున్నారు!
మూడు వారాలకే ఓటీటీలోకి తెలుగు సినిమా
కాంగ్రెస్‌కు శశిథరూర్లాగా మనకూ ఈయన అలాగే ఉన్నాడనిపిస్తుంది సార్!
ODI WC 2011: యువీని సెలక్ట్ చేయడం అవసరమా?
గాజా నేలమట్టం
క్రికెట్ ప్లేయర్లు లంచ్ బ్రేక్‌లో ఏమి తింటారో తెలుసా?
పుష్ప 2 తొక్కిసలాట.. అల్లు అర్జున్ చేసిన తప్పు అదే!: విష్ణు
అనంతపురంలో విషాదం.. చిన్నారి ప్రాణం తీసిన దోశ
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
ఆర్థిక సంక్షేమానికి ‘కస్టమైజ్డ్’ ఆరోగ్య బీమా
శ్రావణం శుభప్రదం..! వరలక్ష్మీ వత్రం ఎప్పుడంటే..?
బరితెగించిన మానవ మృగం! తప్పించుకుని మరో బాలికను రక్షించి..
T20I Tri-Series: ఫైనల్లో న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా
BAN vs PAK: పాకిస్తాన్‌కు బంగ్లాదేశ్ షాక్
జమీన్ కీ బేటీ.. ఎంపీ ప్రియా సరోజ్ వైరల్ వీడియో!
ఇస్కాన్ రెస్టారెంట్లోకి చికెన్ తెచ్చిన యువకుడు.. తీవ్ర విమర్శలు
‘మా అంచనా తప్పింది’
రిటైర్మెంట్ కోసం స్మాల్‌క్యాప్ బెటరా?
రామ్‌చరణ్ సాయం..? ఒక్క రూపాయి రాకుండా చేశారు: ఫిష్ వెంకట్ కూతురు
'జూనియర్' కలెక్షన్.. మొదటిరోజు అన్ని కోట్లా?
ఎలుక... ఎంత పని చేసింది!
పైలట్ ‘మాస్ మర్డర్-సూసైడ్’
మీ బండిపై చలాన్ ఉంది.. కట్టేయండి!
ఈ రాశి వారికి పలుకుబడి పెరుగుతుంది.. శుభవార్తలు వింటారు
కుటుంబ సభ్యుల మోసం.. నాన్న కొత్త ప్రయాణం: అనసూయ
అనుకున్నదే జరిగింది.. కరుణ్ నాయర్ గుడ్‌బై
ఇద్దరితో సహజీవనం.. అతడితో పెళ్లి.. భార్యకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపి..
ఈ రాశి వారికి వ్యాపారాలు.. ఉద్యోగాలలో నూతనోత్సాహం
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
మియాపూర్: స్కూల్ బిల్డింగ్ పైనుంచి దూకి విద్యార్థి మృతి
స్వామీ! మీరే కాపాడాలి.. ఎక్కడ మద్యం కేసులయినా మమ్మల్నే అందులోకి లాగుతున్నారు!
మూడు వారాలకే ఓటీటీలోకి తెలుగు సినిమా
కాంగ్రెస్‌కు శశిథరూర్లాగా మనకూ ఈయన అలాగే ఉన్నాడనిపిస్తుంది సార్!
ODI WC 2011: యువీని సెలక్ట్ చేయడం అవసరమా?
గాజా నేలమట్టం
క్రికెట్ ప్లేయర్లు లంచ్ బ్రేక్‌లో ఏమి తింటారో తెలుసా?
అనంతపురంలో విషాదం.. చిన్నారి ప్రాణం తీసిన దోశ
పుష్ప 2 తొక్కిసలాట.. అల్లు అర్జున్ చేసిన తప్పు అదే!: విష్ణు
సినిమా

ఇంట్లోనే ఉపాసన బర్త్ డే సెలబ్రేషన్స్.. చరణ్ పోస్ట్
మెగా కోడలు ఉపాసన మరో వసంతంలోకి అడుగుపెట్టింది. భర్త రామ్ చరణ్‌తో కలిసి తన 37వ పుట్టినరోజుని ఇంట్లోనే సింపుల్‌గా సెలబ్రేట్ చేసుకుంది. ఇందుకు సంబంధించిన ఫొటోని చరణ్ తన ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు. ఈ పిక్‌లో చరణ్-ఉపాసనతో పాటు కూతురు క్లీంకార కూడా కనిపించింది. ఆమె ఫేస్ కూడా కాస్త రివీల్ అయింది.(ఇదీ చదవండి: నా జీవితానికి వెలుగు నీవే.. సితారకు మహేశ్ బర్త్‌డే విషెస్)సెలబ్రిటీలు చాలావరకు తమ తమ పుట్టినరోజుని విదేశాల్లో సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. చరణ్-ఉపాసన కూడా గతంలో వెళ్లారు. అయితే ఈసారి మరి చరణ్ షూటింగ్ షెడ్యూల్స్ వల్లనో ఏమో గానీ ఇంట్లోనే సింపుల్‌గా పుట్టినరోజు జరుపుకొన్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా ఈ పోస్ట్ దిగువన మెగా ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ఉపాసనకు విషెస్ చెబుతున్నారు.చరణ్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం 'పెద్ది' చేస్తున్నాడు. బుచ్చిబాబు దర్శకుడు కాగా జాన్వీ కపూర్ హీరోయిన్. కొన్నిరోజుల ముందు వరకు ఢిల్లీ షూటింగ్ చేసొచ్చారు. ప్రస్తుతం ఎక్కడ జరుగుతుందనేది క్లారిటీ లేదు. ఈ మూవీ నుంచి ఇదివరకే రిలీజైన గ్లింప్స్ మంచి రెస్పాన్ అందుకుంది. వచ్చే ఏడాది మార్చి 27న మూవీని థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నారు.(ఇదీ చదవండి: సేనాని రూల్స్ మాట్లాడతారు.. పాటించరు) View this post on Instagram A post shared by Ram Charan (@alwaysramcharan)

బిగ్‌బాస్ సోనియా ప్రెగ్నెన్సీ రివీల్.. కమెడియన్‌తో సమంత
ప్రెగ్నెన్సీ ప్రకటించిన బిగ్‌బాస్ ఫేమ్ సోనియానదివే పాటని వెన్నెల కిశోర్‌తో రీల్ చేసిన సమంతబీచ్ వెకేషన్లో బాలీవుడ్ బ్యూటీ కృతిసనన్నడుము ఒంపుసొంపులు చూపించేస్తున్న ఇనయాపెర్ఫెక్ట్ షేప్ కనిపించేలా మౌనీ రాయ్ గ్లామర్పిల్లాడితో కనిమా రీల్ చేసిన రీతూ చౌదరిమత్తెక్కించేలా మారిపోయిన రుక్సార్ థిల్లాన్ View this post on Instagram A post shared by Yash Veeragoni (@yashveeragoni) View this post on Instagram A post shared by Rahul Ravindran (@rahulr_23) View this post on Instagram A post shared by Doulath sulthana (@inayasulthanaofficial) View this post on Instagram A post shared by Rithu_chowdary (@rithu_chowdhary) View this post on Instagram A post shared by mon (@imouniroy) View this post on Instagram A post shared by Sri Satya (@sri_satya_) View this post on Instagram A post shared by Saiee M Manjrekar (@saieemmanjrekar) View this post on Instagram A post shared by Kriti Sanon 🦋 (@kritisanon) View this post on Instagram A post shared by Saanve Megghana (@saanve.megghana) View this post on Instagram A post shared by Rukshar Dhillon (@rukshardhillon12) View this post on Instagram A post shared by Fatima Sana Shaikh (@fatimasanashaikh) View this post on Instagram A post shared by Priya Prakash Varrier✨ (@priya.p.varrier) View this post on Instagram A post shared by Sakshi Agarwal |Actress |Fitness & Lifestyle (@iamsakshiagarwal) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya)

'భళ్లాలదేవ'గా నేనే చేయాలి.. కానీ అలా జరిగేసరికి: జయసుధ కొడుకు
గత దశాబ్దంలో తెలుగు సినిమా చాలా మారిపోయింది. 'బాహుబలి' సినిమా దెబ్బకు టాలీవుడ్.. ఇంటర్నేషనల్ లెవల్లో గుర్తింపు తెచ్చుకుంది. ఇకపోతే 'బాహుబలి' రిలీజై ఈ ఏడాదికి పదేళ్లయిన సందర్భంగా అక్టోబరులో రెండు పార్ట్స్ కలిసి ఒక్కటిగా రీ రిలీజ్ చేయబోతున్నారు. అందుకు తగ్గ పనులు జరుగుతున్నాయి. మరోవైపు ఈ సినిమాలోని భళ్లాలదేవ పాత్రని తానే చేయాల్సిందని, కొన్ని కారణాల వల్ల అది తప్పిపోయిందని సీనియర్ నటి జయసుధ కొడుకు చెబుతున్నాడు.ఇంతకీ ఏంటి విషయం?నటి జయసుధ కొడుకు పేరు నిహార్ కపూర్. హీరోగా కొన్ని సినిమాలు చేశాడు. సహాయ నటుడిగానూ పలు చిత్రాల్లో కనిపించాడు. కాకపోతే గుర్తింపు రాలేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొనగా.. బాహుబలి మూవీలో అవకాశం మిస్ అయిన సంగతి చెప్పుకొచ్చాడు. అప్పుడు అసలేం జరిగిందో పూసగుచ్చినట్లు వెల్లడించాడు.(ఇదీ చదవండి: నిజజీవిత కథ.. 'గరివిడి లక్ష్మి' గ్లింప్స్ రిలీజ్)'భళ్లాలదేవుడి పాత్ర రానానే చేయాలి. కానీ ఆయన డేట్స్ సెట్ అవకపోవడంతో నన్ను అడిగారు. ఓకే చెప్పేశాను. నాలుగు వారాల ట్రైనింగ్ కూడా ఇచ్చారు. ఆ పాత్రని రానా చేస్తానని మళ్లీ చెప్పడంతో నాకు కాలకేయ పాత్రని ఆఫర్ చేశారు. నేను ఆలోచనలో పడిపోయా. కాలకేయుడి పాత్రకు సంబంధించిన ఓ క్యారికేచర్ చూపించారు. పాత్ర ఇలా ఉంటుందని వివరించారు. ఎక్కువగా ప్రొస్థటిక్ మేకప్ వేశారు. ఇదే విషయాన్ని అమ్మకి చెబితే..'నీ మొదటి సినిమా ముఖం కూడా సరిగా కనిపించట్లేదు బాడీ కూడా కవర్ అయిపోతుంది. ప్రేక్షకులు గుర్తించరు' అని చెప్పారు''అమ్మ అలా చెప్పేసరికి 'బాహుబలి' టీమ్‌కి నో చెప్పేశాను. దీంతో ఆ పాత్రని ప్రభాకర్ చేశారు. క్యారికేచర్‌తో పోలిస్తే తెరపైకి వచ్చేసరికి పాత్ర లుక్ పూర్తిగా మారిపోయింది. అయితే ఆ రోల్ చేయనందుకు నేనేం బాధపడట్లేదు. మొదటినుంచి దర్శకుడు రాజమౌళి నాతో అన్ని విషయాలు మాట్లాడారు. ఆ తర్వాత సరదాగా షూటింగ్‌కి రమ్మంటే రెండు మూడుసార్లు వెళ్లాను' అని నిహార్ కపూర్ చెప్పుకొచ్చాడు. ఏదైతేనేం నిహార్ మంచి ఛాన్స్ మిస్ అయ్యాడని చెప్పొచ్చు.(ఇదీ చదవండి: Anushka Shetty: ఎక్కడికి వెళ్లినా ఆ దేవుడి విగ్రహం తనవెంటే!)

ఇండస్ట్రీలో మరో విషాదం.. స్టార్ డైరెక్టర్ ఇక లేరు
ఇండస్ట్రీలో మరో విషాదం. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ చంద్ర బరోట్(86) కన్నుమూశారు. గత కొన్నిరోజులుగా శ్వాసకోస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఈయన.. ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఈ విషయమై బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కూడా స్పందించారు. దర్శకుడికి నివాళి అర్పించారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.(ఇదీ చదవండి: యంగ్ హీరో నిఖిల్‌కి ఝలక్.. ట్వీట్ వైరల్)అమితాబ్ హీరోగా వచ్చిన 'డాన్' ఎంత సెన్సేషన్ సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ సినిమా తీసింది ఈయనే. అలా 'డాన్' దర్శకుడిగా చాలా ఫేమస్ అయిపోయారు. దీని తర్వాత ప్యార్ బరా దిల్, హాంకాంగ్ వాలీ స్క్రిప్ట్, నీల్ కో పకడ్నా తదితర చిత్రాల్ని తెరకెక్కించారు. కానీ, ఆయనకు అత్యంత గుర్తింపు తెచ్చింది మాత్రం డాన్. దర్శకత్వం వహించడానికి ముందు పురబ్ ఔర్ పచ్చిమ్, యాద్గార్, రోటీ కపడా ఔర్ మకాన్ తదితర మూవీస్‌కి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. ఇప్పుడు ఈయన మృతి చెందడంతో పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.(ఇదీ చదవండి: నిజజీవిత కథ.. 'గరివిడి లక్ష్మి' గ్లింప్స్ రిలీజ్)
న్యూస్ పాడ్‌కాస్ట్
క్రీడలు

పాక్‌తో మ్యాచ్ బహిష్కరణ
బర్మింగ్‌హామ్: ‘వరల్డ్ చాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్’ (డబ్ల్యూసీఎల్) టోర్నమెంట్లో భాగంగా ఆదివారం పాకిస్తాన్‌తో జరగాల్సిన మ్యాచ్‌ను భారత స్టార్లు బహిష్కరించారు. జమ్మూకశ్మీర్ పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్‌తో ఏ స్థాయిలోనూ క్రికెట్ ఆడబోమని శిఖర్ ధావన్ సహా భారత ఆటగాళ్లు వెల్లడించడంతో దాయాదుల పోరును రద్దు చేయక తప్పలేదు. ఇంగ్లండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) నిర్వహిస్తున్న ఈ టోర్నీ రెండో సీజన్ పోటీలు గత నెల 18న ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ప్రారంభమయ్యాయి. వచ్చేనెల 2న జరగనున్న ఫైనల్‌తో టోర్నమెంట్ ముగియనుంది. ఇందులో భారత చాంపియన్స్ జట్టుకు స్టార్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ సారథ్యం వహిస్తున్నాడు. జట్టులో హర్భజన్ సింగ్, శిఖర్ ధావన్, ఇర్ఫాన్ పఠాన్, యూసుఫ్ పఠాన్, సురేశ్ రైనా, రాబిన్ ఉతప్ప, వరుణ్ అరోన్ వంటి పలువురు భారత మాజీ ప్లేయర్లు ఉన్నారు. బరి్మంగ్‌హామ్ వేదికగా జరగాల్సిన భారత్, పాకిస్తాన్ మ్యాచ్ రద్దు అయినట్లు డబ్ల్యూసీఎల్ నిర్వాహకులు సామాజిక మాధ్యమాల వేదికగా వెల్లడించారు. ‘పాకిస్తాన్ హాకీ జట్టు భారత్‌లో ఆడనుందనే వార్తలతో పాటు మరి కొన్ని క్రీడల్లో ఇరు దేశాల మధ్య పోటీలు జరుగుతున్న నేపథ్యంలో డబ్ల్యూసీఎల్లో దాయాదుల మ్యాచ్ ద్వారా కొన్ని ఆనంద క్షణాలు పంచుకోవచ్చని అనుకున్నాం. అయితే మా నిర్ణయం చాలా మందికి నచ్చలేదని అర్థమైంది. వారి మనోభావాలను దెబ్బతీయకూడదనే ఉద్దేశంతో మ్యాచ్‌ను రద్దు చేశాం. ఎవరికైన ఇబ్బంది కలిగించి ఉంటే మన్నించమని కోరుతున్నాం’అని డబ్ల్యూసీఎల్ పేర్కొంది. పాకిస్తాన్ లెజెండ్స్ జట్టుకు షాహిద్ అఫ్రిది కెపె్టన్‌గా వ్యవహరిస్తుండగా... షోయబ్ మాలిక్, హఫీజ్, యూనిస్ ఖాన్, తన్వీర్, వహాబ్ రియాజ్, కమ్రాన్ అక్మల్ జట్టులో ఉన్నారు. మరోవైపు ఈ మ్యాచ్ ఆడకూడదని ధావన్ ఇప్పటికే సామాజిక మాధ్యమాల వేదికగా వెల్లడించాడు. టోర్నీ ఆరంభం కావడానికి ముందే పాకిస్తాన్‌తో మ్యాచ్‌లు ఆడబోనని ధావన్ స్పష్టం చేశాడు. పహల్గామ్లో పర్యాటకులపై ఉగ్రదాడి అనంతరం భారత ప్రభుత్వం ‘ఆపరేషన్ సిందూర్’పేరిట ప్రత్యేక ఆపరేషన్ చేపట్టి పాక్ ఆక్రమిత కశ్మీర్‌తో పాటు... పాకిస్తాన్‌లోని ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది. ఎంపీలు యూసుఫ్ పఠాన్, హర్భజన్ సింగ్‌తో పాటు ఇర్ఫాన్ పఠాన్ కూడా చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో మ్యాచ్‌కు సుముఖత వ్యక్తం చేయలేదని డబ్ల్యూసీఎల్ తెలిపింది. ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన గత ఎడిషన్ ఫైనల్లో పాకిస్తాన్ లెజెండ్స్‌పై 5 వికెట్ల తేడాతో నెగ్గిన భారత చాంపియన్స్ జట్టు తొలి టైటిల్ కైవసం చేసుకుంది.

గ్రూప్ టాపర్‌గా భారత్
సోలో (ఇండోనేసియా): ఆసియా జూనియర్ బ్యాడ్మింటన్ మిక్స్డ్ టీమ్ చాంపియన్‌షిప్‌లో భారత్ జోరు సాగుతోంది. ఇప్పటికే క్వార్టర్ ఫైనల్ చేరిన భారత జట్టు గ్రూప్ ‘డి’లో భాగంగా చివరి మ్యాచ్‌లో హాంకాంగ్‌పై విజయం సాధించింది. తద్వారా గ్రూప్‌లో అగ్రస్థానం దక్కించుకుంది. ఆదివారం జరిగిన పోరులో భారత్ 110–100 పాయింట్ల తేడాతో హాంకాంగ్‌ను ఓడించింది. ఈ మ్యాచ్‌కు ముందే హాంకాంగ్ కూడా నాకౌట్ బెర్త్ దక్కించుకుంది.మహిళల సింగిల్స్ తొలి పోరులో రుజులా రాము 11–8తో సుమ్ యూపై గెలిచి భారత జట్టుకు శుభారంభం అందించగా... భార్గవ్ రామ్–విశ్వతేజ్ జోడీ 11–5తో చెంగ్ సెయి షింగ్–డెంగ్ చీ ఫై జంటపై గెలిచి ఆధిక్యాన్ని మరింత పెంచింది. ఆ తర్వాత హాంకాంగ్ షట్లర్లు కాస్త ప్రతిఘటించినా... జూనియర్ మహిళల ప్రపంచ నంబర్‌వన్ తన్వీ శర్మ, రౌనక్ చౌహాన్ సహా యువ షట్లర్లు సత్తా చాటడంతో భారత జట్టు విజయం సాధించింది. సోమవారం జరగనున్న క్వార్టర్ ఫైనల్లో గ్రూప్ ‘ఎ’లో రెండో స్థానంలో నిలిచిన జపాన్ జట్టుతో భారత్ తలపడనుంది. ఆసియా జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత్ అత్యుత్తమంగా 2011లో కాంస్య పతకం సాధించింది. ఆ తర్వాత మరెప్పుడూ పతకం గెలవలేకపోయింది. గతేడాది క్వార్టర్ ఫైనల్లో మలేసియా చేతిలో ఓడింది.

ఇంగ్లండ్‌లోనే తర్వాతి మూడు డబ్ల్యూటీసీ ఫైనల్స్
సింగపూర్: వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్స్ మ్యాచ్‌ను వరుసగా ఇంగ్లండ్ గడ్డపైనే నిర్వహించడంపై అన్ని వైపుల నుంచి విమర్శలు వస్తున్నా... అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మాత్రం మరోసారి దానికే ఓటు వేసింది. వచ్చే మూడు డబ్ల్యూటీసీ ఫైనల్స్ కూడా ఇంగ్లండ్‌లోనే జరుగుతాయని ఐసీసీ ప్రకటించింది. 2027, 2029, 2031లకు సంబంధించి ఇంగ్లండ్ క్రికెట్ బోర్డుకే ఆతిథ్య హక్కులు కట్టబెడుతున్నట్లు స్పష్టం చేసింది. ఇప్పటి వరకు జరిగిన మూడు ఫైనల్స్ (2021–సౌతాంప్టన్, 2023–ఓవల్, 2025–లార్డ్స్) సమర్థ నిర్వహణే అందుకు కారణమని వెల్లడించింది. డబ్ల్యూటీసీ ఫైనల్ జరిగే జూన్ నెలలో ఇతర క్రికెట్ దేశాలతో పోలిస్తే ఒక్క ఇంగ్లండ్‌లోనే ఆటకు అంతరాయం కలిగించని, సరైన వాతావరణం ఉండటం ప్రధాన కారణం. పైగా తుది పోరులో ఎవరు తలపడినా... టెస్టు క్రికెట్ అభిమానులైన అక్కడి ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో హాజరై మ్యాచ్‌లకు ఆదరించడం కూడా ఐసీసీ నిర్ణయానికి కారణమైంది. ఐసీసీ సమావేశంలో రెండు కొత్త జట్లకు అసోసియేట్ సభ్యులుగా అవకాశం కల్పించారు. తిమోర్ లెస్టె, జాంబియా క్రికెట్ జట్లు ఇప్పుడు ఐసీసీలో భాగమయ్యాయి. దాంతో ఐసీసీ మొత్తం సభ్య దేశాల సంఖ్య 110కి చేరింది.

‘యునైటెడ్ ఇన్ మాంచెస్టర్’
మాంచెస్టర్: భారత క్రికెట్ జట్టు ఒకవైపు నాలుగో టెస్టుకు సన్నద్ధమవుతూనే మరోవైపు విరామ సమయాన్ని సరదాగా గడుపుతోంది. తాజాగా విఖ్యాత ఫుట్‌బాల్ క్లబ్ ‘మాంచెస్టర్ యునైటెడ్’ ప్రాక్టీస్ గ్రౌండ్‌ను టీమిండియా ఆటగాళ్లు సందర్శించారు. ఇరు జట్లకు ప్రధాన స్పాన్సర్‌గా ఉన్న స్పోర్ట్స్‌వేర్ ‘అడిడాస్’ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. క్రికెట్, ఫుట్‌బాల్ టీమ్‌ల సభ్యులు పరస్పర గౌరవాన్ని ప్రదర్శిస్తూ జెర్సీలు మార్చుకున్నారు. భారత ఆటగాళ్లతో పాటు మాంచెస్టర్ ఆటగాళ్లంతా రెండు జట్లుగా విడిపోయి ముందుగా ఫుట్‌బాల్ ఆడారు. ఆపై మాంచెస్టర్ ప్లేయర్లు క్రికెట్లో తమ ఆసక్తి ప్రదర్శిస్తూ బ్యాటింగ్ చేశారు. స్టార్ డిఫెండర్ హ్యారీ మేగ్వైర్‌కు సిరాజ్ బౌలింగ్ చేయగా... ‘రెడ్ డెవిల్స్’ టీమ్ సభ్యులు డియాలో, మేసన్ మౌంట్ తదితరులతో ఫుట్‌బాల్ ఆడేందుకు పంత్, బుమ్రా ప్రత్యేక ఆసక్తి కనబర్చారు. మాంచెస్టర్ యునైటెడ్, పోర్చుగల్ జట్లకు కెపె్టన్ అయిన బ్రూనో ఫెర్నాండెజ్‌తో భారత కెపె్టన్ శుబ్‌మన్ గిల్ కబుర్లాడాడు. మరోవైపు భారత్, మాంచెస్టర్ యునైటెడ్ హెడ్ కోచ్‌లు గంభీర్, రూబెన్ అమోరిమ్ మధ్య కూడా సుదీర్ఘ సంభాషణ చోటు చేసుకుంది. శిక్షణ, నాయకత్వం, స్టార్ ఆటగాళ్లతో జట్లను నడిపించడంవంటి అంశాలపై చివర్లో ఇరు జట్ల కోచ్‌లు తమ అభిప్రాయాలు వెల్లడించడంతో కార్యక్రమం ముగిసింది. బుధవారం నుంచి ఓల్ట్ ట్రఫోర్డ్ మైదానంలో భారత్, ఇంగ్లండ్ మధ్య నాలుగో టెస్టు మ్యాచ్ జరుగుతుంది.
బిజినెస్

రోజూ 2జీబీ హైస్పీడ్ డేటాతో జియో కొత్త ప్లాన్
ప్రముఖ ప్రైవేట్ టెలికాం ఆపరేటర్ రిలయన్స్ జియో రోజూ 2జీబీ హైస్పీడ్ డేటాతో రూ .1049 ప్రత్యేక ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. రోజువారీ హై-స్పీడ్ డేటా, అపరిమిత కాలింగ్, టాప్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లకు ఉచిత యాక్సెస్ అందించే ప్రీపెయిడ్ ప్లాన్ కోసం చూస్తున్నట్లయితే ఈ జియో ప్లాన్ మీకు సరిగ్గా సరిపోతుంది. ఈ ప్లాన్ ప్రయోజనాలేంటో ఇక్కడ వివరంగా తెలుసుకోండి..ప్లాన్ వాలిడిటీ.. ప్రధాన ప్రయోజనాలుఈ రూ .1049 జియో ప్లాన్ మొత్తం 84 రోజులు చెల్లుబాటు అవుతుంది. ఇందులో ప్రతిరోజూ 2 జీబీ హై-స్పీడ్ డేటా లభిస్తుంది. అంటే మొత్తం 84 రోజుల్లో మొత్తం 168 జిబి డేటా ఆనందించవచ్చు. దీంతోపాటు అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు కూడా లభిస్తాయి.ఈ ప్లాన్ అతిపెద్ద ఫీచర్ ఇది అందించే ఉచిత ఓటీటీ యాక్సెస్. వినియోగదారులు ఎటువంటి అదనపు రుసుము చెల్లించకుండా అనేక ప్రసిద్ధ స్ట్రీమింగ్ సర్వీసులకు యాక్సెస్ పొందుతారు. వీటిలో అమెజాన్ ప్రైమ్ లైట్ (84 రోజులు చెల్లుబాటు అవుతుంది), సోనీలివ్, జీ5, జియోటీవీ, జియో హాట్‌స్టార్ (90 రోజులు, ఒకసారి చెల్లుబాటు అవుతుంది) వంటివి ఉన్నాయి.ఈ రీఛార్జ్ ప్లాన్ 50 జీబీ జియోఏఐక్లౌడ్ స్టోరేజ్, ఉచిత 5జీ డేటా (5జీ ఫోన్ అయి ఉండి 5జీ నెట్వర్క్ అందుబాటులో ఉంటే మాత్రమే) వంటి జియో నుండి కొన్ని ఇతర ప్రత్యేక ప్రయోజనాలను కూడా అందిస్తుంది.

మీ పాన్‌కార్డుతో ఎవరైనా లోన్ తీసుకున్నారేమో..
కొందరికి అప్పు అంటే మహా చెడ్డ భయం. దాని జోలికి కూడా వెళ్లరు. మీరు తీసుకోరు సరే.. మరి ఎవరైనా మీ పేరుతో అదేనండి మీకు తెలియకుండా మీ పాన్ కార్డు వివరాలతో లోన్ తీసుకుని ఉంటే.. అమ్మో ఇది ఫ్రాడ్. అవును ఫ్రాడే మరి. డౌట్‌గా ఉందా? మీ పాన్ కార్డును ఎవరైనా దుర్వినియోగం చేశారేమో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఎలాగో ఈ కథనంలో చదివేయండి వెంటనే..రుణ మోసాలు, సున్నితమైన, ఆర్థికపరమైన డాక్యుమెంట్ల దుర్విగియోగం వంటివి ఇటీవల ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో మీ కార్డులేమైనా దుర్వినియోగానికి గురయ్యాయా అని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీ పాన్ కార్డు మీ క్రెడిట్ రిపోర్ట్ తో లింక్ అయి ఉంటుంది. దానిని ఉపయోగించి తీసుకున్న ఏదైనా రుణం (మీ సమ్మతితో లేదా సమ్మతి లేకుండా) మీ క్రెడిట్ రేటింగ్, మీ రుణ సామర్థ్యంపై ప్రభావం చూపుతుంది. కాబట్టి మీ పాన్ కార్డు దుర్వినియోగం అయ్యిందో లేదో తెలుసుకోండిలా..మీ క్రెడిట్ రిపోర్టును క్రమం తప్పకుండా చెక్ చేయండిమీ పాన్ కార్డును ఉపయోగించి ఏదైనా రుణం తీసుకున్నారో లేదో తెలుసుకోవడానికి సులభమైన మార్గం మీ క్రెడిట్ రిపోర్ట్ చూడటం. సిబిల్, ఎక్స్ పీరియన్, ఈక్విఫాక్స్, సీఆర్ఐఎఫ్ హై మార్క్ వంటి క్రెడిట్ బ్యూరోలు మీ పేరిట తీసుకున్న అన్ని రుణాలు, క్రెడిట్ కార్డుల రికార్డును నిర్వహిస్తాయి. ఆయా సైట్లకు వెళ్లి మీ పాన్, మొబైల్ నంబరు ఇచ్చి క్రెడిట్ రిపోర్ట్ తీసుకోవచ్చు. అది కూడా ఉచితంగా.మీ క్రెడిట్ రిపోర్టులో ఇవి గమనించండిమీరు క్రెడిట్ రిపోర్టును సమీక్షిస్తున్నప్పుడు, మీరు దరఖాస్తు చేయని రుణాలు లేదా క్రెడిట్ కార్డులు, తప్పు ఖాతా నంబర్లు, పరిచయం లేని రుణ సంస్థల పేర్లు లేదా మీరు ఆమోదించని కొత్త హార్డ్ ఎంక్వైరీలు ఏమైనా ఉన్నాయేమో చూడండి.మీ పాన్ కార్డును ఎవరైనా దుర్వినియోగం చేశారనడానికి ఇవి సంకేతాలు. మీరు ఇటువంటి అనేక ఎంట్రీలను చూసినట్లయితే, మీ క్రెడిట్ మరింత క్షీణించకుండా వెంటనే చర్యలు తీసుకోండి.👉 ఇది చదివారా? ఈపీఎఫ్‌వో రూల్స్‌లో మార్పులు.. ఆ కండీషన్లు ఇక ఉండవుఫేక్ లోన్ బయటపడితే ఏం చేయాలి?మీరు మోసపూరిత రుణాన్ని ఎదుర్కొన్నట్లయితే, దానిని రుణ సంస్థ దృష్టికి తీసుకురండి. అలాగే దానిని నివేదించిన క్రెడిట్ బ్యూరోతో చర్చించండి. చాలా వివాదాలను క్రెడిట్ బ్యూరోలు ఆన్లైన్లో దాఖలు చేయవచ్చు. ఐడీ ప్రూఫ్, లోన్‌కు సంబంధించిన వాస్తవాలు, సంతకం చేసిన అఫిడవిట్ ఇవ్వాల్సి ఉంటుంది. అదనంగా, మీ స్థానిక పోలీసు సైబర్ క్రైమ్ సెల్లో ఫిర్యాదు చేయండి. పాన్ దుర్వినియోగం అయినట్లు ఆధారాలను సమర్పించండి.భవిష్యత్తులో పాన్ దుర్వినియోగం కాకూడదంటే..అసురక్షిత సైట్లు, యాప్‌లు లేదా వాట్సాప్ ఫార్వార్డ్‌లలో మీ పాన్ కార్డు నంబర్‌ను ఎప్పుడూ పంచుకోవద్దు. బహిరంగంగా షేర్ చేయడం, అనవసరంగా ఎవరికైనా అప్పగించడం చేయొద్దు. మీ పాన్ కార్డు పోతే, రీప్రింట్ కోసం దరఖాస్తు చేయండి. ఆ సమయంలో కొన్ని నెలలు మీ క్రెడిట్ రిపోర్ట్‌ను సమీక్షించండి. ఫైనాన్షియల్ అకౌంట్ లకు బలమైన పాస్ వర్డ్ లను సెట్ చేసుకోండి. మీ పాన్ తో లింక్ చేసిన లోన్ లేదా క్రెడిట్ అప్లికేషన్ ల కోసం ఎస్ఎంఎస్/ఈమెయిల్ నోటిఫికేషన్ లను ఎనేబుల్ చేయండి.

రంగులు వేయకున్నా ఇల్లు మెరవాలంటే..
సాక్షి, సిటీబ్యూరో: శ్రావణ మాసం వస్తుందంటే చాలు శుభ ముహూర్తాలు ప్రారంభమవుతాయి. వరుస పండగలతో సందడి నెలకొంటుంది. ఈ ఆనందాన్ని రంగులమయం చేస్తే ఇంటి అందం ద్విగుణీకృతమవుతుంది. అయితే ఇంటికి రంగులు వేయించడం అందరికీ కుదరక పోవచ్చు. మరెలా? రంగులు వేయకున్నా ఇల్లు మెరవాలంటే శుభ్రం చేయడం కోసం కొంత సమయాన్ని వెచ్చించాలి. ఇందుకు ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలి. హడావుడి లేకుండానే ఓ పద్ధతి ప్రకారం ఇంటిని అలంకరించుకోవాలి.ఫ్లోరింగ్: మార్బుల్ ఫ్లోరింగ్ ఇంటికి అదనపు అందం, ఆకర్షణే. అయితే ఇదంతా తరచూ నిర్వహణ ఉన్నప్పుడే.. ఇంట్లోకి దుమ్ము, ధూళి రాకుండా నివారించాలి. దీని కోసం డోర్ మ్యాట్లు వాడకంతో సరిపెట్టకుండా ఇంటికి వచ్చే అతిథులు షూస్ బయటేవిప్పి ఇంట్లోకి వచ్చేలా చూసుకోవాలి. ఫ్లోరింగ్ శుభ్రత కోసం రసాయనాల జోలికి వెళ్లకుండా నీటిలో కొంచెం అమ్మోనియా కలిపితే శుభ్రం చేశాక ఫ్లోరింగ్ మెరిసిపోతుంది.కార్పెట్లు: ఇవి దుమ్మును ఎక్కువగా ఆకర్షిస్తాయి. తరచూ వ్యాక్యుమ్ క్లీనర్‌తో శుభ్రంచేయక తప్పదు. దుమ్ము పట్టడం వల్ల కార్పెట్ కళావిహీనంగా కన్పించవచ్చు. కాబట్టి నాలుగున్నర లీటర్ల నీటిలో ఓ కప్పు తెల్ల వెనిగర్‌ను కలిపి బ్రష్‌తో రుద్దితే కార్పెట్‌లోని వర్ణాలు మెరుస్తాయి. కార్పెట్‌పై కొన్నిసార్లు టీ, సిరా వంటి మరకలు పడితే వాటిని పోగొట్టడానికి పావు కప్పు తేనె సోడా, రెండు చెంచాల తెల్ల వెనిగర్‌తో చేసిన పేస్టు రుద్దాలి. ఫలితంగా ఆ మరకలు తొలగిపోతాయి. పేస్టును ఆరనిచ్చి వ్యాక్యుమ్ క్లీనర్‌తో మరక ఉన్న ప్రాంతాన్ని శుభ్రం చేయండి.గోడలు: గోడలను తరచూ స్టాటిక్ డస్టర్‌తో తుడవాలి. ఎక్కడైనా బూజు, సాలెగూడు వంటివి ఉంటే తొలగిపోతాయి. అనుకోకుండా గోడలపై పానీయాలు, టీ వంటివి పడితే వెంటనే నీళ్లు, గాఢత తక్కువగా ఉండే డిటెర్జెంట్లతో శుభ్రం చేయాలి. అయితే ఈ సమయంలో గోడల్ని గట్టిగా రుద్దడం చేయవద్దు.మైక్రోఓవెన్: కొందరు మైక్రోఓవెన్‌ను అధికంగా వాడుతుంటారు. దీంతో ఇది ఎక్కువగా మురికి పడుతుంటుంది. దీనిని శుభ్రం చేయడానికి ఉత్తమ మార్గం సగం కప్పు నీళ్లు, సగం కప్పు తెల్ల వెనీర్‌ను మైక్రోప్రూఫ్ గిన్నెలో పోసి, మైక్రోఓవెన్లో వేడిచేయాలి. గట్టిగా ఉండే ఆహార పదార్థాలు, గ్రీజు మరకలు శుభ్రం చేయడానికి అనువుగా తేలికపడతాయి.వంటింట్లో: బాత్‌ఫిట్టింగ్‌ల దగ్గర నుంచి ఫర్నిచర్ల వరకు ఉక్కు ఎక్కువగా వాడుతుంటాం. స్టీల్‌కే పరిమితం కాకుండా పైన క్రోమ్‌పూతతో వస్తున్నాయిప్పుడు. స్నానాల గదిలో, వంటింట్లో వాడే నల్లాలు.. నీటిలోని ఉప్పు పేరుకుపోవడంతో చూడ్డానికి వికారంగా కనిపిస్తాయి. ఇలాంటి మరకల్ని తొలగించి స్టీల్ వస్తువులు మెరిసిపోవాలంటే ఆల్కాహాల్‌తో తుడవాలి. నల్లాపై ఏర్పడే మరకల్ని టూత్‌పేస్టుతో తుడవడం వల్ల తొలగించవచ్చు. వంటింట్లో సింక్ పరిశుభ్రంగా కనిపించాలంటే నాలుగు భాగాల ఉప్పుకు ఒక భాగం వెనిగర్‌ను కలిపి ప్రయత్నించండి.

తగ్గిన మొండిబాకీలు.. పెరిగిన లాభాలు
ప్రభుత్వ రంగానికి చెందిన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2025 ఏప్రిల్–జూన్ కాలానికి రూ.4,116 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. 2024 ఇదే కాలానికి ఆర్జించిన రూ.3,679 కోట్లతో పోలిస్తే ఇది 12% అధికం. మొత్తం ఆదాయం రూ.30,874 కోట్ల నుంచి రూ.31,791 కోట్లకు పెరిగింది. వడ్డీ ఆదాయం రూ.26,364 కోట్ల నుంచి అధికమై రూ.27,296 కోట్లకు చేరింది. నికర వడ్డీ ఆదాయం రూ.9,412 కోట్ల నుంచి రూ.9,113 కోట్లకు దిగివచ్చింది. నిర్వహణ లాభం 11% క్షీణించి రూ.7,785 కోట్ల నుంచి రూ.6,909 కోట్లకు తగ్గింది.స్థూల నిరర్థక ఆస్తులు(ఎన్పీఏలు) 4.54% నుంచి 3.52 శాతానికి, నికర ఎన్పీఏలు 0.90% నుంచి 0.62 శాతానికి తగ్గాయి. మొండి రుణాలకు ప్రొవిజన్ల కేటాయింపు రూ.1,651 కోట్ల నుంచి రూ.1,153 కోట్లకు తగ్గాయి. స్థూల అడ్వాన్సులు 6.83% పుంజుకొని 9,12,214 కోట్ల నుంచి రూ.9,74,489 కోట్లకు చేరుకున్నాయి. ప్రొవిజన్ కవరేజ్ రేషియో(పీసీఆర్) 116 బేసిస్ పాయింట్లు పెరిగి 93.49 శాతం నుంచి 94.65 శాతానికి చేరింది. మొత్తం వ్యాపారం 5% వృద్ధి చెంది రూ.21,08,762 కోట్ల నుంచి రూ.22,14,422 కోట్లకు ఎగసింది.సెంట్రల్ బ్యాంక్ ఫలితాలు భేష్ప్రభుత్వరంగ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) తొలి త్రైమాసికంలో ఆకర్షణీయమైన ఫలితాలు ప్రకటించింది. ఆదా యం మెరుగవడం, మొండి రుణాలు (ఎన్పీఏలు) తగ్గడంతో ఏప్రిల్–జూన్‌లో రూ.1,169 కోట్ల నికర లాభా న్ని నమోదు చేసింది. గత ఆర్థిక సంవత్సరం(2024– 25) ఇదే క్యూ1 నికర లాభం రూ.880 కోట్లతో పోలి స్తే ఇది 33% అధికం. వార్షిక ప్రాతిపదికన మొత్తం ఆదాయం రూ.9,500 కోట్ల నుంచి రూ.10,374 కోట్లకు ఎగసింది.బ్యాంకు వడ్డీ ఆదాయం రూ.8,335 కోట్ల నుంచి రూ.8,589 కోట్లకు చేరుకుంది. నిర్వహణ లాభం 19% పెరిగి రూ.2,304 కోట్లకు చేరింది. ఆస్తుల నాణ్యత మెరుగవడంతో స్థూల మొండి బకాయిలు 4.54% నుంచి 3.13 శాతానికి దిగివచ్చాయి. నికర ఎన్పీఏలు 0.73% నుంచి 0.49 శాతానికి తగ్గాయి. స్థూల అడ్వాన్సులు 9.97% పుంజుకొని 2,50,615 కోట్ల నుంచి రూ.2,75,595 కోట్లకు చేరుకున్నాయి. ప్రొవిజన్ కవరేజ్ రేషియో 96.17 % నుంచి 97.02 శాతం పెరిగింది. కనీస మూలధన నిష్పత్తి 15.6% నుంచి 17.6 శాతానికి మెరుగైంది. మొత్తం వ్యాపారం 11% వృద్ధి చెంది రూ.6,35,564 కోట్ల నుంచి రూ.7,04,485 కోట్లకు ఎగసింది.
ఫ్యామిలీ

స్మార్ట్ స్టడీ స్ట్రాటజీస్..!
ప్రతి విద్యార్థి రోజూ గంటలు, గంటలు చదువుతున్నారు. అయినా పరీక్షల్లో గందరగోళ పడుతున్నారు. చదివినది గుర్తురాక, పరీక్షలు సరిగా రాయలేక ఆందోళనకు లోనవుతున్నారు. దాంతో పేరెంట్స్, టీచర్స్ మరిన్ని గంటలు చదవమని ఒత్తిడి పెడుతున్నారు. విద్యార్థులతో రెండు దశాబ్దాలకు పైబడి పనిచేస్తున్న సైకాలజిస్ట్‌గా, జీనియస్ మ్యాట్రిక్స్ డెవలపర్‌గా ఒక విషయం స్పష్టంగా చెప్తున్నా. ఎన్ని గంటలు చదివామనే దానికన్నా, ఎంత బాగా చదివామనేది ముఖ్యం. మెదడు ఎలా నేర్చుకుంటుందో తెలుసుకుని చదివితే మార్కులు పరుగెత్తుకుంటూ వస్తాయి. లేదంటే మీరు పెట్టే శ్రమ, టైమ్, ఫీజులు అన్నీ వృథా అవుతాయి. అందుకే స్మార్ట్‌గా ఎలా చదవాలో తెలుసుకుందాం. లైఫ్ లాంగ్ లెర్నర్‌గా ఎదుగుదాం. మార్కులు, ర్యాంకుల కన్నా ఇదే నిజమైన విజయం. లెర్నింగ్ సైన్స్మనం కొత్తగా ఏదైనా నేర్చుకుంటున్నప్పుడు నాడీకణాల మధ్య బంధాలు బలపడతాయి. ప్రతిసారి రివిజన్ చేసేటప్పుడు ఆ బంధాలు మైలినేషన్ అనే ప్రక్రియ ద్వారా వేగవంతం అవుతాయి. అప్పుడు గుర్తుంచుకోవడం సులువవుతుంది. స్పేస్డ్ రిపిటీషన్, రిట్రీవల్ ప్రాక్టీస్, ఇంటర్ లీవింగ్ వంటి టెక్నిక్స్ వల్ల చదివింది బాగా గుర్తుంటుందని కెంట్ స్టేట్ యూనివర్సిటీ పరిశోధనల్లో వెల్లడైంది. యాక్టివ్ రీకాల్: ఒక సెక్షన్ చదివాక, పుస్తకం మూసేసి ‘ఇప్పుడు నేనేం నేర్చుకున్నాను, నా ప్రెజెంట్ నాలెడ్జ్‌తో అదెలా కలుస్తుంది, నేర్చుకున్నది ఏమిటి?’ అని మీకు మీరే ప్రశ్నించుకోండి. ఇది జ్ఞాపకంలో నుంచి సమాచారాన్ని తిరిగి తెస్తుంది. దీని వల్ల జ్ఞాపకం బలపడుతుంది.స్పేస్డ్ రిపిటీషన్: ఎవరేం నేర్చుకున్నా 24 గంటల్లో దాదాపు 70 శాతం మర్చిపోతారు. దీర్ఘకాలం గుర్తుండాలంటే 24 గంటల్లోపు ఒకసారి రివిజన్ చేయాలి. ఆ తర్వాత వారం, నెల, మూడు నెలల వ్యవధిలో రివిజన్ చేయడం వల్ల నేర్చుకున్నది దీర్ఘకాలిక జ్ఞాపకాల్లోకి చేరి పూర్తిగా గుర్తుంటుంది. ఇంటర్ లీవింగ్: ఒకే సబ్జెక్ట్ గంటల తరబడి చదవకుండా, సంబంధిత సబ్జెక్ట్స్‌ను మార్చి మార్చి చదవడం మెదడులో ఫ్లెగ్జిబిలిటీని పెంచుతుంది.డ్యూయల్ కోడింగ్: పదాలతో పాటు విజువల్స్ కలిపి చదవడం. మైండ్ మ్యాప్స్, డయాగ్రమ్స్ వాడడం వల్ల మాటల జ్ఞాపకం, విజువల్ జ్ఞాపకం రెండూ కలసి జ్ఞాపకం పెరుగుతుంది. టీచ్ వాట్ యూ లెర్న్: మీరు నేర్చుకున్నది ఇతరులకు బోధించండి. లేదా మీకు మీరే చెప్పుకోండి. దీనివల్ల మెదడులో సమాచారం క్లియర్‌గా ఆర్గనైజ్ అవుతుంది. తల్లిదండ్రులు తెలుసుకోవాల్సినవి రోజూ గంటలకు గంటలు చదవమని పిల్లలను ఒత్తిడి చేయవద్దు. ప్రతిరోజూ కొద్దిపాటి విరామాలతో కొద్ది కొద్ది సేపు చదివేలా అలవాటు చేయండి.కేవలం మార్కులు, ర్యాంకులకే కాదు– ప్రయత్నం, స్ట్రాటజీ, క్రియేటివిటీని అభినందించండి. ఉదాహరణకు, ‘నువ్వు ఈ క్లిష్టమైన చాప్టర్‌ను సులువుగా విభజించడం నాకెంతో నచ్చింది’ అని చెప్పండి.చదవడానికి డిస్ట్రాక్షన్స్ లేని ప్రశాంత వాతావరణం సృష్టించండి. రోజుకు కనీసం7–9 గంటల నిద్ర అందేలా చూడండి.రోజూ వ్యాయామం చేయడం వల్ల మెదడులో కొత్త కనెక్షన్లను ఏర్పరచే బీఎన్డీఎఫ్ అనే ప్రొటీన్ విడుదలవుతుంది. మెదడుకు శక్తినిచ్చే ఒమేగా–3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండే వాల్నట్స్, ఫ్లాక్స్సీడ్స్, చేపలు, బెర్రీలు వంటివి అందించండి. విద్యార్థులు చేసే పొరపాట్లుపాసివ్ రీడింగ్: పాఠాలను హైలైట్ చేస్తూ పదేపదే చదివితే బాగా గుర్తుంటుందని అనుకుంటారు. కానీ దీనివల్ల బలమైన మెమరీ ట్రేసెస్ ఏర్పడవు. క్రామింగ్: చివరి రోజు వరకు వాయిదా వేసి ఒక్కరోజులో మొత్తం రివిజన్ చేయడం వర్కింగ్ మెమరీను ఒత్తిడికి గురి చేస్తుంది. ఈజీగా మరచిపోతారు.మల్టీ టాస్కింగ్: చదివేటప్పుడు టీవీ చూడటం, సోషల్ మీడియాలో కాలక్షేపం చేయడం, ఒకేసారి రెండు మూడు సబ్జెక్టులు చదవడంలాంటి పనులు చేస్తే అధ్యయన సామర్థ్యం 40 శాతం వరకు తగ్గిపోతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.మూడు స్మార్ట్ స్టడీ స్ట్రాటజీస్పొమోడోరో టెక్నిక్: 25 నిమిషాలు ఫోకస్‌తో చదివి, 5 నిమిషాలు బ్రేక్ తీసుకోండి. అలా నాలుగుసార్లు చదివాక 20–30 నిమిషాలు పెద్ద విరామం తీసుకోండి. సెల్ఫ్–టెస్టింగ్: చాప్టర్ హెడింగ్స్‌ను ప్రశ్నలుగా మార్చుకుని ముందుగా వాటికి సమాధానం చెప్పడానికి ప్రయత్నించండి. తరువాత చదివాక తిరిగి పరీక్షించుకోండి.కాంటెక్స్ట్ /వేరియేషన్: ఎప్పుడూ ఒకే చోట కూర్చుని చదవకండి. చదివే ప్రదేశాలు మార్చడం వల్ల జ్ఞాపకానికి వివిధ క్యూస్ ఏర్పడి గుర్తుకు తెచ్చుకోవడం సులువవుతుందని అధ్యయనాలు చెప్తున్నాయి. సైకాలజిస్ట్ విశేష్www.psyvisesh.com(చదవండి: జైలు శిక్షనే శిక్షణగా మార్చుకున్న జీనియస్ ఖైదీ..!)

లెక్కలతో జీవితాన్నే తిరగరాసుకున్న ఖైదీ..!
జైలు గోడల మధ్య మగ్గిపోతున్న కాలంలోనే ఎందరో స్వాతంత్య్ర సమరయోధులు, పోరాట నాయకులు అద్భుతమైన రచనలు చేసిన సంగతి చాలామందికి తెలుసు. అయితే, అమెరికాలో జైలు గోడల మధ్య శిక్ష అనుభవిస్తున్న ఒక ఖైదీ స్వయంకృషితో గణిత సాధన చేస్తూ, ప్రపంచ గణిత మేధావుల దృష్టిని ఆకట్టుకుంటున్నాడు. దృఢసంకల్పం ఉండాలే గాని, అనుకున్నది సాధించడానికి జైలుగోడలు ఆటంకం కాదని నిరూపిస్తున్నాడు.ఆ ఖైదీ పేరు క్రిస్టఫర్ హేవెన్స్. హత్య కేసులో అతడికి 2010లో పాతికేళ్ల జైలు శిక్ష పడింది. అప్పటి నుంచి జైలులో ఒంటరి గదిలో ఉంటూ లెక్కల లోకంలో లోతుగా మునిగిపోయాడు. జైలు గదిలో చిన్న పజిల్స్‌తో మొదలైన ప్రయాణం, పెద్ద గణిత సూత్రాల వరకు వెళ్లింది. అతడు ఉండే జైలు గదిలో కంప్యూటర్ లేదు, ఇంటర్నెట్ లేదు, చేతిలో పుస్తకం, మదిలో లక్ష్యాలు తప్ప. అలా లెక్కలు వేసి వేసి నోటుబుక్కులు, జైలు గోడలు నింపేశాడు. ఏకంగా ప్రపంచానికి కొత్త గణిత రహస్యాన్ని చూపించి, గణిత పండితులను ఆశ్చర్యంలో ముంచెత్తాడు. క్రిస్టఫర్ ప్రయాణం అంతటితోనే ఆగలేదు. ‘నేను మాత్రమే కాదు, అందరూ గణితం నేర్చుకోవాల్సిందే!’అనే తపనతో, జైల్లో నుంచే ఖైదీల కోసం ‘ప్రిజన్ మ్యాథ్స్ ప్రాజెక్టు’ ప్రారంభించాడు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ కింద అమెరికాలోని దాదాపు ముప్పై రాష్ట్రాల్లో వందలాది ఖైదీలు గణితంలో మునిగి తేలుతున్నారు. వారిని చూస్తే, నిజంగా జైలులో ఉన్నారా, లేక ఏదైనా విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఉన్నారా అనే అనుమానం కలుగుతుంది. మరో కొత్త ప్రయత్నంఇంతలోనే ఇంకో కొత్త ప్రయత్నం. ‘కంప్యూటర్ లేని ఖైదీలు గణితంలో సంక్లిష్టమైన లెక్కలు ఎలా చేయాలి?’ అనే ప్రశ్న తలెత్తింది. అప్పుడే హేవెన్స్కి తట్టిన ఆలోచన. ‘ఈమెయిలు ద్వారా కోడింగ్’ ఈ పద్ధతిలో కోడ్ లేఖలా పంపిస్తారు, ఫలితాలు తిరిగి వస్తాయి. ఈ విధానంతో జైలులో ఉండే ఖైదీ ఇప్పుడు మేఘగణన చేస్తున్నాడు. ప్రస్తుతం క్రిస్టఫర్, జర్మనీకి చెందిన గణిత నిపుణుడితో కలిసి ‘జోప్’ అనే గణిత శ్రేణిపై పరిశోధన చేస్తున్నాడు. ఈ విషయమై హేవెన్స్ మాట్లాడుతూ, ‘న్యాయం అంటే శిక్ష కాదు, మార్పు. లెక్కలతో నా జీవితాన్ని తిరిగి రాసుకున్నా’ అని చెప్పాడు. (చదవండి: పెయిన్ కిల్లర్స్ వాడితే..ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేయకూడదా..?)

నీలిరంగులో కనిపించే పండ్లు, కూరగాయలు ఇవే..!
కొన్ని పండ్లు, కూరగాయలు సర్వసాధారణంగా ఒక నిర్దిష్టమైన రంగులో ఉంటాయి. అవి భిన్నమైన రంగులో కనిపిస్తే, అదొక విచిత్రంగా ఉంటుంది. అలవాటైన రంగుల్లో కాకుండా, నీలిరంగులో కనిపించే కొన్ని రకాల పండ్లు, కూరగాయల సంగతి తెలుసుకుందాం...టొమాటోలు పండిన తర్వాత ఎర్రని ఎరుపురంగులో ఉంటాయి. పచ్చిగా ఉన్నప్పుడు లేత ఆకుపచ్చ రంగులో ఉంటాయి. అరుదుగా కొన్ని జాతుల టొమాటోలు ముదురు నీలి రంగులోను, ముదురు ఊదా రంగులోను ఉంటాయి. వీటిని ‘బ్లూ టొమాటో’ అని, ‘పర్పుల్ టొమాటో’ అని అంటారు. ఇవి ప్రకృతి సిద్ధంగా పండినవి కాదు. ఇంగ్లండ్‌లోని జాన్ ఇనెస్ సెంటర్‌కు చెందిన శాస్త్రవేత్తలు జన్యు మార్పిడి ద్వారా ఈ నీలి టొమాటో జాతులను సృష్టించారు. నేరేడు జాతికి చెందిన పండ్ల రంగుకు కారణమైన పిగ్మెంట్‌తో ముదురు నీలి, ముదురు ఊదా రంగులు వచ్చేలా టొమాటోలను రూపొందించారు. వీటిని ఇప్పుడు పలు యూరోపియన్ దేశాల్లో పండిస్తున్నారు. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయని, ఈ జాతుల టొమాటో మొక్కలు చీడ పీడలను తట్టుకుని పుష్కలంగా దిగుబడిని ఇవ్వగలవని చెబుతున్నారు.బ్లూ క్యారట్స్మొక్కజొన్న దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా దొరుకుతుంది. సాధారణంగా మొక్కజొన్న గింజలు పసుపు రంగులో ఉంటాయి. అక్కడక్కడా లేత పసుపు, తెలుపు రంగు గింజలతో కూడా ఉంటాయి. అరుదుగా నీలి రంగు గింజలు ఉండే మొక్కజొన్నలు మెక్సికోలో పండుతాయి. మామూలు మొక్కజొన్న మాదిరిగానే నీలి మొక్కజొన్నను కూడా రకరకాల వంటకాల్లో ఉపయోగిస్తారు. సాధారణ మొక్కజొన్నల కంటే నీలి మొక్కజొన్నలో యాంటీ ఆక్సిడెంట్లు, పోషకాలు పుష్కలంగా ఉంటాయని చెబుతారు.నీలి ముల్లంగిమన దేశంలో ఎక్కువగా ముల్లంగి తెలుపు రంగులోనే దొరుకుతుంది. కొన్ని దేశాల్లో ఎరుపు, పసుపు, గులాబి వంటి రంగుల్లో కూడా దొరుకుతుంది. అరుదుగా కొన్ని చోట్ల ముదురు నీలి, ముదురు ఊదా రంగుల్లో కూడా ముల్లంగి దొరుకుతుంది. నీలి, ఊదా రంగుల్లో ఉన్న ముల్లంగిని కోస్తే, లోపలి భాగంలో నీలి, ఊదా రంగులతో పాటు కొంత తెలుపుదనం కూడా ఉంటుంది. రుచికి ఈ రకం ముల్లంగి కొంచెం తీపిగా, కొంచెం ఘాటుగా ఉంటుంది. వీటిని పచ్చిగా తినడంతో పాటు సలాడ్లు, ఇతర వంటకాల తయారీలో కూడా ఉపయోగిస్తారు.చిలకడ దుంపలు సాధారణంగా కాస్త ఎరుపురంగు తొక్కతోను, లేత గోధుమ రంగు తొక్కతోను ఉంటాయి. తొక్క రంగు ఎలా ఉన్నా, లోపలి భాగం తెలుపుగా లేదా లేత నారింజరంగులోను ఉంటుంది. ముదురు రంగు తొక్క కలిగి, లోపలి భాగం కూడా ముదురు ఊదా రంగు లేదా ముదురు నీలి రంగులో ఉండే ‘బ్లూ స్వీట్ పొటాటో’ రకాన్ని జపాన్‌లో పండిస్తారు. దీనిని ‘ఒకినావన్ స్వీట్ పొటాటో’ అంటారు. సాధారణ చిలకడ దుంపల కంటే ఈ ‘బ్లూ స్వీట్ పొటాటో’ రకానికి చెందిన చిలకడ దుంపల్లో పోషకాలు మరింత అధికంగా ఉంటాయని చెబుతారు.నీలి అరటిపండ్లుఅరటిపండ్లు ఎక్కువగా పసుపురంగులో ఉంటాయి. కొన్ని ఆకుపచ్చగాను, అరుదుగా ఇంకొన్ని ఎరుపు రంగులోను ఉంటాయి. జావాలో మాత్రం ప్రపంచంలోనే అత్యంత అరుదైన నీలిరంగు అరటిపండ్లు పండుతాయి. దీనిని ‘బ్లూ జావా బనానా’ అని, ‘హవాయిన్ బనానా’ అని అంటారు. అరటిచెట్లు శీతల ప్రాంతాల్లో ఎక్కువగా పెరగవు. అయితే, ఈ నీలి అరటిపండ్ల జాతికి చెందిన చెట్లు మాత్రం చల్లని వాతావరణాన్ని కూడా తట్టుకుని పెరగగలవు. దీని రుచి వెనీలా ఐస్‌క్రీమ్‌లా ఉంటుంది. అందువల్ల దీనిని ‘వెనీలా బనానా’ అని, ‘ఐస్‌క్రీమ్ బనానా’ అని కూడా అంటారు. ఇప్పుడు వీటిని యూరోపియన్ దేశాల్లో కూడా పండిస్తున్నారు.బ్లూ స్వీట్ పొటాటోచిలకడ దుంపలు సాధారణంగా కాస్త ఎరుపురంగు తొక్కతోను, లేత గోధుమ రంగు తొక్కతోను ఉంటాయి. తొక్క రంగు ఎలా ఉన్నా, లోపలి భాగం తెలుపుగా లేదా లేత నారింజరంగులోను ఉంటుంది. ముదురు రంగు తొక్క కలిగి, లోపలి భాగం కూడా ముదురు ఊదా రంగు లేదా ముదురు నీలి రంగులో ఉండే ‘బ్లూ స్వీట్ పొటాటో’ రకాన్ని జపాన్‌లో పండిస్తారు. దీనిని ‘ఒకినావన్ స్వీట్ పొటాటో’ అంటారు. సాధారణ చిలకడ దుంపల కంటే ఈ ‘బ్లూ స్వీట్ పొటాటో’ రకానికి చెందిన చిలకడ దుంపల్లో పోషకాలు మరింత అధికంగా ఉంటాయని చెబుతారు.బ్లూ పొటాటోబంగాళ దుంపలు పైకి గోధుమరంగులో ఉంటాయి. తొక్క తీశాక తెలుపురంగులో ఉంటాయి. అయితే, ముదురు నీలి రంగులోను, ముదురు ఊదా రంగులోను ఉండే బంగాళ దుంపలు కూడా ఉన్నాయి. తొక్క తీసి, తరిగిన తర్వాత కూడా ఈ దుంపలు ముదురు ఊదా లేదా నీలి రంగుల్లోనే ఉంటాయి. ‘అడిరోన్డాక్ బ్లూ’ జాతికి చెందిన బంగాళ దుంపలు ఈ ముదురు ఊదా లేదా నీలి రంగుల్లో ఉంటాయి. అమెరికాలోని కార్నెల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు వీటి నుంచి మరిన్ని నీలిరంగు బంగాళ దుంపల జాతులను కూడా ఇటీవలి కాలంలో అభివృద్ధి చేశారు. (చదవండి: పెయిన్ కిల్లర్స్ వాడితే..ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేయకూడదా..?)

పెయిన్ కిల్లర్స్ వాడితే..ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేయకూడదా..?
నాకు ముప్పై ఐదు ఏళ్లు. మోకాలి నొప్పి చాలా ఎక్కువగా ఉంది. కొన్ని రోజులు పెయిన్ కిల్లర్స్ వాడాను. ఇప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నాను. మునుపటి మందుల వలన ఏదైనా ఇబ్బంది ఉంటుందా? ఇప్పటికీ ఆ మందులు వాడొచ్చా?– అనిత, మెదక్.మీరు చెప్పిన మోకాలి నొప్పి సమస్య ఆస్టియో ఆర్థరైటిస్ కారణం కావచ్చు. ఇది జాయింట్ డీజెనరేషన్ లక్షణాలలో ఒకటి కావచ్చు. పెయిన్ కిల్లర్ మందులు తాత్కాలిక ఉపశమనం ఇస్తాయి కాని, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్న సమయంలో మాత్రం ఈ మందుల వాడకాన్ని జాగ్రత్తగా పరిశీలించాలి. ఐబుప్రొఫెన్ లాంటి మందులు తక్కువ కాలం ఉపశమనం ఇస్తాయి కాని, దీర్ఘకాలంగా వాడడం సురక్షితమేమీ కాదు. ముందుగా పూర్తి పరీక్షలు చేయించుకోవాలి. ఫోలిక్ యాసిడ్ వంటి సప్లిమెంట్లు తప్పనిసరిగా వాడాలి. ఐబుప్రొఫెన్ వంటి మందులు ఎన్ ఎస్ఎఐడీ గ్రూపులోకి వస్తాయి. ఇవి నొప్పికి తక్షణ ఉపశమనం కలిగిస్తాయి. అయితే కొన్ని సైడ్ ఎఫెక్టులు కూడా వుంటాయి. మోకాలిలో నొప్పి లేదా గట్టిపడటం వంటి సందర్భాల్లో శరీరంలో ప్రోస్టాగ్లాండిన్లు అనే కెమికల్స్ విడుదల అవుతాయి. వీటిని తగ్గించడానికే ఈ మందులు పనిచేస్తాయి. ప్రెగ్నెన్సీలో వీటిని వాడితే పుట్టబోయే బిడ్డ ఎదుగుదలపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. కొన్ని మందులు జీర్ణాశయంలో అల్సర్లు, శ్వాస సమస్యలు, బ్లడ్ క్లాట్లు వంటి ఇబ్బందులు కలిగించవచ్చు. హెర్బల్ మందులు కూడా డాక్టర్ సలహా లేకుండా వాడకూడదు. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్న సమయంలో ఏ ఔషధాన్నైనా డాక్టర్‌ను సంప్రదించి మాత్రమే వాడాలి.నాకు యాభై ఐదు ఏళ్లు. ఇటీవల వజైనాలో పొడిగా ఉంటోంది. ఇరిటేషన్, ఇచింగ్, డిశ్చార్జ్ వస్తోంది. కొన్ని క్రీములు వాడాను. అయినా తగ్గడం లేదు. పరిష్కారం చెప్పండి.– సుజాత, రాజోలు.వజైనాలో పొడిబారడం అంటే ఎక్కువగా హార్మోనుల మార్పుల వలన వచ్చే సమస్య. ముఖ్యంగా మెనోపాజ్ తర్వాత ఎక్కువగా కనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో పచ్చటి డిశ్చార్జ్ వస్తే, అది ఇన్ఫెక్షన్ కావొచ్చు. పొడిగా మారడం, ఇచింగ్ అనేవి వజైనల్ వాల్స్, యూరినరీ ట్రాక్ట్ సున్నితంగా మారినప్పుడు జరుగుతుంది. ఆరోగ్యకరమైన వజైనల్ మ్యూకస్ ఫ్లూయిడ్ తగ్గిపోతుంది. దీనివల్ల వజైనాలో తేమ తగ్గిపోతుంది. ఇక ఎక్కువ మంది బాధపడే ఇచింగ్ సమస్యకు కేవలం ఇన్ఫెక్షన్ మాత్రమే కాదు, వజైనల్ బ్యాక్టీరియా లోపం కూడా కారణం కావచ్చు. మెనోపాజ్ తర్వాత ఓవరీల నుంచి ఈస్ట్రోజన్ ఉత్పత్తి తగ్గుతుంది. ఒత్తిడి వల్ల కూడా తేమ తగ్గే అవకాశం ఉంటుంది. వజైనల్ గ్లాండ్లు ఈస్ట్రోజ పై ఆధారపడి మ్యూకస్ తయారుచేస్తాయి. అవి తగ్గిపోతే పొడి సమస్య ఎక్కువవుతుంది. యాంటీఫంగల్ ఆయింట్మెంట్లు, పౌడర్లు తాత్కాలిక ఉపశమనం ఇస్తాయి కానీ మళ్లీ మళ్లీ వస్తుంటుంది. కాబట్టి దీనికి పరిష్కారం ఈస్ట్రోజన్ క్రీములు, వజైనల్ లూబ్రికెంట్లు, వజైనల్ ఈస్ట్రోజన్ టాబ్లెట్లు, కొన్ని ప్రత్యేకమైన మందులు డాక్టర్ సూచనతోనే వాడాలి. బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నవారు ఈ చికిత్సలు తీసుకోకూడదు. కనుక తప్పకుండా గైనకాలజిస్టును సంప్రదించి, వారి సూచనల మేరకు తగిన చికిత్స తీసుకోవాలి.(చదవండి: పెద్ద పిల్లల్లో చొల్లు చేటే..! సీరియస్‌గా తీసుకోవాల్సిందే..)
ఫొటోలు
అంతర్జాతీయం

పాక్‌లో వర్ష బీభత్సం.. 200 మంది మృతి
ఇస్లామాబాద్: పొరుగుదేశం పాకిస్తాన్లో వర్ష బీభత్సం కొనసాగుతోంది. వర్షాకాలంలో ముఖ్యంగా జూన్ నుండి సెప్టెంబర్ మధ్యకాలంలో పాక్‌లో భారీ వరదలు సంభవిస్తుంటాయి. ఫలితంగా కొండచరియలు విరిగిపడుతూ, అపారనష్టం వాటిల్లుతుంటుంది.ఇటువంటి విపత్తుల కారణంగా ఇటీవలి కాలంలో 100 మంది పిల్లలతో సహా 200 మందికి పైగా జనం ప్రాణాలను కోల్పోయారని, 500 మందికి పైగా జనం గాయపడ్డారని పాకిస్తాన్ జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ (ఎన్ఎండీఏ) తెలిపింది.అధికారిక డేటా ప్రకారం పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్ అత్యధికంగా 123 మంది మృత్యువాత పడ్డారు. అలాగే ఖైబర్ పఖ్తుంఖ్వాలో 40, సింధ్‌లో 21, బలూచిస్తాన్‌లో 16,ఇస్లామాబాద్, పాకిస్తాన్ ఆక్రమిత జమ్ముకశ్మీర్‌లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. ఫైసలాబాద్‌లో వర్షాల కారణంగా గణనీయమైన నష్టం వాటిల్లింది. రెండు రోజుల్లో చోటుచేసుకున్న 33 ఘటనలలో 11 మంది మృతి చెందారు. 450 మి.మీ కంటే అధిక వర్షపాతం నమోదైన చక్వాల్‌లో 32 రోడ్లు కొట్టుకుపోయాయి. మౌలిక సదుపాయాల నష్టంతో పాటు, కమ్యూనికేషన్ సంబంధాలు తెగిపోయాయి. అనేక ప్రాంతాలలో విద్యుత్ సరఫరా పునరుద్ధరణ జరగలేదు.

20 ఏళ్లుగా కోమాలో.. సౌదీ ‘స్లీపింగ్ ప్రిన్స్’ కన్నుమూత
సౌదీ అరేబియా ప్రిన్స్ అల్వలీద్ బిన్ ఖలెద్(36) ఇక లేరు. గత 20 ఏళ్లుగా కోమాలో ఉన్న ఆయన.. శనివారం కన్నుమూశారు. ఈ కారణంగానే సౌదీ అరేబియా స్లీపింగ్ ప్రిన్స్‌గా ఈయనకంటూ ఓ పేరు ముద్రపడిపోయింది. ప్రిన్స్ అల్వలీద్ బిన్ ఖలెద్ సౌదీ అరేబియా రాజ కుటుంబానికి చెందినవారు. ఆయన ప్రిన్స్ ఖలెద్ బిన్ తలాల్ అల్ సౌద్ పెద్ద కుమారుడు. 2005లో లండన్‌లోని మిలిటరీ అకాడమీలో చదువుకుంటున్న టైంలో ఖలెద్ కారు ప్రమాదంలో గాయపడ్డాడు. మెదడులో రక్తస్రావం జరిగి.. వెంటిలేటర్‌పై కోమాలో ఉంటూ ఓ ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఖలెద్ కోసం అమెరికా, స్పెయిన్ నుండి నిపుణులు కూడా చికిత్స అందించారు. అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. జూలై 20న రియాద్‌లో అంత్యక్రియలు నిర్వహించే అవకాశం ఉంది. Statement On the Passing of Prince Alwaleed bin Khaled bin Talal Al Saud pic.twitter.com/st19kxb7lC— Global Imams Council (GIC) (@ImamsOrg) July 19, 2025 View this post on Instagram A post shared by @arabianroyalagency

అమెరికాలో తప్పిన ఘోర విమాన ప్రమాదం
అమెరికాలో ఘోర విమాన ప్రమాదం తృటిలో తప్పింది. డెల్టా ఎయిర్‌లైన్స్ బోయింగ్ 767 ఇంజిన్‌లో మంటలు చెలరేగడంతో అత్యవసరంగా ల్యాండింగ్ అయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. వీడియోలో బోయింగ్ విమానం ఎడమ ఇంజిన్ నుండి మంటలు రావడం కనిపిస్తోంది. అట్లాంటాకు వెళ్లాల్సిన ఈ డెల్టా ఎయిర్ లైన్స్ విమానం లాస్ ఏంజిల్స్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది.❗️Boeing 787 Makes Emergency Landing in LA 🇺🇸 - Engine ON FIRE 🔥Video claims to show a Delta Airlines flight bound for Atlanta on Friday making an emergency landing at LAX. The engine reportedly caught fire shortly after take-off.📹 @LAFlightsLIVE https://t.co/t1HBVLDi0P pic.twitter.com/vYNgkpZJcq— RT_India (@RT_India_news) July 19, 2025శుక్రవారం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానం ఇంజిన్ మంటల్లో చిక్కుకున్నట్లు గుర్తించడంతో.. అట్లాంటాకు వెళ్లాల్సిన డెల్టా ఎయిర్ లైన్స్ విమాన్నాన్ని లాస్ ఏంజిల్స్ అంతర్జాతీయ విమానాశ్రయం (ఎల్ఏఎక్స్)కి తిరిగి మళ్లించి, అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. ఈ విమాన ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదని, అగ్నిమాపక సిబ్బంది రన్‌వేపై మంటలను చల్లార్చడంతో ముప్పు తప్పిందని అధికారులు తెలిపారు. ఏవియేషన్ A2Z నివేదిక ప్రకారం ఈ విమానం విమానాశ్రయం నుండి బయలుదేరిన వెంటనే ఇంజిన్‌లో మంటలు వ్యాపించాయి. విమాన సిబ్బంది అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. దీంతో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) విమానాన్ని తిరిగి విమానాశ్రయానికి మళ్లించేలా మార్గనిర్దేశం చేసింది. ఈ అగ్ని ప్రమాదానికి కారణం ఇంకా తెలియరాలేదు. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఈ సంఘటనపై దర్యాప్తు ప్రారంభించింది. ఈ విమానం దాదాపు 25 సంవత్సరాల క్రితం నాటిది.డెల్టా ఇలాంటి సమస్యను ఎదుర్కోవడం ఈ ఏడాది ఇదేమీ మొదటిసారి కాదు. గత ఏప్రిల్‌లో ఓర్లాండో అంతర్జాతీయ విమానాశ్రయంలో డెల్టా విమానం మంటల్లో చిక్కుకుంది. అట్లాంటాకు బయలుదేరడానికి సిద్ధమవుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ సమయంలో విమానంలో 282 మంది ప్రయాణికులు, 10 మంది విమాన సహాయకులు, ఇద్దరు పైలట్లు ఉన్నారు. అయితే ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు.

ఐఎస్ఎస్ వైపూ ట్రాఫిక్ బిజీ!
వాషింగ్టన్: తిరుమల తిరుపతి దేవస్థానంలో దర్శనం కోసం వరసబెట్టి భక్తులు క్యూ లైన్లలో నిల్చున్నట్లు ఇప్పుడు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)కి సైతం వ్యోమ నౌకలు ఒకరకంగా క్యూ కట్టాయి. కొద్ది వారాల వ్యవధిలో సరకు రవాణా స్పేస్‌క్రాఫ్ట్ లేదా వ్యోమగాములను తీసుకొచ్చే వ్యోమనౌకలు ఒకదాని వెంట మరోటి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి రాకపోకలు సాగిస్తూ ఐఎస్ఎస్ మార్గాన్ని బిజీగా మార్చేశాయి. నాసా, రోస్కాస్మోస్, స్పేస్ ఎక్స్ సంస్థల వ్యోమనౌకలు తమ వంతు కోసం వేచిచూస్తున్నాయి. బోయింగ్ వారి ప్రతిష్టాత్మక స్టార్‌లైనర్ వ్యోమనౌక మరో ఏడాదిదాకా ఐఎస్ఎస్కు పయనమయ్యే అవకాశం దక్కదని తాజా షెడ్యూల్‌ను బట్టి తెలుస్తోంది. చరిత్రలో ఎన్నడూలేనంతగా ఐఎస్ఎస్కు స్పేస్‌క్రాఫ్ట్‌ల రాకపోకలు ఇటీవ లకాలంలో ఎక్కువయ్యాయి. గత రెండు మూడు వారాలపాటు యాగ్జియం–4 మిషన్ వారి డ్రాగన్ ‘గ్రేస్’ క్యాప్సూల్ ఐఎస్ఎస్ ‘ఔట్‌పోస్ట్’ వద్ద ‘పార్కింగ్’లో ఉండిపోయింది. ఇటీవలే అది భారత వ్యోమగామి శుభాంశు శుక్లాసహా నలుగురు వ్యోమగాములను సురక్షితంగా భూమికి తీసుకొచ్చింది. దీంతో క్రూ–11 మిషన్ ప్రయోనికి రంగం సిద్ధమైంది. ఇదిగాక ఇప్పటికే ఐఎస్ఎస్ వద్ద రష్యా అంతరిక్ష సంస్థ పంపిన ప్రోగ్రెస్–92 కార్గోషిప్ అక్కడ తిష్టవేసింది. దీంతోపాటు మరోమూడు వ్యోమనౌకలు ఐఎస్ఎస్ వద్దే ఉన్నాయి. స్పేస్ఎక్స్ డ్రాగన్, సోయూజ్ ఎంఎస్–27, ప్రోగ్రెస్ రీ–సప్లై నౌకలు అక్కడ ఉన్నాయి. చాలా రోజులుగా ఐఎస్ఎస్లో విధుల్లో ఉండి అలసిపోయిన వ్యోమగా ములను భూమి మీదకు తీసుకొచ్చేందుకు, అక్కడ నిండుకున్న సరుకులను భూమి నుంచి మోసుకొచ్చేందుకు తరచూ ఇలా వ్యోమనౌకలు ఐఎస్ఎస్కు వస్తూనే ఉన్నాయి. ఈ స్పేస్‌క్రాఫ్ట్‌ల ట్రాఫిక్ ఈ ఏడాది చివరిదాకా కొనసాగనుంది. డిసెంబర్‌లోపు మరో ఆరు వ్యోమనౌకలు అక్కడికి చేరుకోనున్నాయి. కొత్త వ్యోమగాములను మోసుకెళ్లడం, సరకుల తరలింపు, ఆధునిక శాస్త్రసాంకేతికత సంబంధ ఉపకరణాలను మోసుకుంటూ ఇవి అటూఇటూ తిరగనున్నాయి. అత్యంత బరువైన ప్రయోగ పేలోడ్లను తరలించనున్నాయి. పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చిన 2000 సంవత్సరం నుంచి చూస్తే ఐఎస్ఎస్కు ఇంతటి భారీ ఎత్తున వ్యోమగాములు, సరకులు, ప్రయోగ పరికరాల రాకపోకలు పెరగడం ఇదే తొలిసారి కావడం విశేషం. అమెరికా నాసా, రష్యా వారి రోస్కాస్మోస్, ఎలాన్‌మస్క్ స్పేస్ఎక్స్, స్టార్‌లైనర్ ఇలా అన్ని సంస్థల స్పేస్‌క్రాఫ్ట్‌లు అంతరిక్షయానాన్ని బిజీగా మార్చాయి.క్యూ వరస నుంచి తప్పుకున్న స్టార్లైనర్భారతీయ మూలాలున్న మహిళా అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్సహా బుచ్ విల్మోర్ను బోయింగ్ వారి స్టార్‌లైనర్ వ్యోమనౌక 2024 జూన్‌లో ఐఎస్ఎస్కు పంపించింది. అయితే తిరుగుప్రయాణంలో అది మొరాయించడంతో వ్యోమగాములు లేకుండానే పలుసార్లు వాయిదాల తర్వాత ఒంటరిగా భూమికి తిరిగొచ్చింది. దీంతో 2025లో స్టార్‌లైనర్ మరోసారి ఐఎస్ఎస్కు వెళ్లలేదు. ఇలా స్పేస్‌షిప్‌ల ట్రాఫిక్ నుంచి ఇది తప్పుకుంది. న్యూ మెక్సికోలోని నాసా వారి వైట్శాండ్స్ పరీక్షకేంద్రంలో ఈ స్టార్‌లైనర్ వ్యోమనౌకకు సమగ్రస్థాయిలో పరీక్షలు జరుపుతున్నారు. 2026లో జరపబోయే ఐఎస్ఎస్ ప్రయాణానికి సురక్షితమేనా కాదా అనేది నిర్ధారించుకునేందుకు కీలక సమీక్షా పరీక్షలు జరుపుతున్నారు. నెలల తరబడి నిరీక్షణ తర్వాత సునీతా విలియమ్స్ చివరకు క్రూ డ్రాగన్ ఫ్రీడమ్ వ్యోమనౌకలో తిరుగుపయనమైన విషయం విదితమే. అంతర్జాతీయ అంతరిక్ష సందర్శకుల తాకిడి ఎక్కువైతే ఐఎస్ఎస్ మార్గం మరింత బిజీగా మారనుంది.
జాతీయం

సిందూర్‌పై చర్చకు సై
ఆపరేషన్ సిందూర్ సహా జాతీయ స్థాయిలో ప్రాముఖ్యత కలిగిన కీలకాంశాలపై పార్లమెంట్లో చర్చకు వెనుకంజ వేసే ప్రసక్తే లేదు. విపక్షాల ప్రశ్నలన్నింటికీ మేం సమాధానం ఇస్తాం. అయితే పార్టీలకు, కూటములకు వేర్వేరు సిద్ధాంతాలు ఉన్నప్పటికీ పార్లమెంట్ కార్యకలాపాలకు సహకరించాల్సిన బాధ్యత అన్ని పక్షాలపైనా ఉంది. విదేశీ పర్యటనలో ఉన్న రోజుల్లో మినహా మిగతా సమయంలో ప్రధాని మోదీ పార్లమెంట్ సమావేశాలకు హాజరవుతారు. – కిరణ్ రిజిజు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి భారత్–పాక్ మధ్య యుద్ధం ఆపేశానంటూ ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలు, పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదుల దుశ్చర్యకు దారితీసిన భద్రతా లోపాలు, బిహార్‌లో ఓటర్ల జాబితా సవరణపై ప్రధాని మోదీ స్పందించాలి. పొరుగు దేశాలతో విదేశాంగ విధానం, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, రైతుల కష్టాలు, దేశ ఆర్థిక వ్యవస్థ, మణిపూర్ అంశాలపై ప్రభుత్వం పూర్తిస్థాయిలో చర్చించాలి. – గౌరవ్ గొగోయ్, కాంగ్రెస్ ఎంపీ సాక్షి, న్యూఢిల్లీ: పాకిస్తాన్ ఉగ్రవాదుల భరతం పట్టేందుకు భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ సహా కీలక అంశాలపై పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో చర్చించడానికి సిద్ధంగా ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం ప్రారంభం కానున్నాయి. ఆగస్టు 21వ తేదీ వరకు కొనసాగుతాయి. పహల్గాం ఉగ్ర దాడి, ఆపరేషన్ సిందూర్, బిహార్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ తర్వాత జరుగుతున్న ఈ సమావేశాలు వాడీవేడీగా సాగే అవకాశం కనిపిస్తోంది. పార్లమెంట్ లేవనెత్తాల్సిన కీలక అంశాలపై విపక్షాలు కసరత్తు పూర్తిచేశాయి. నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సిద్ధమయ్యాయి. అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ అభిశంసనపై వర్షాకాల సమావేశాల్లో తీర్మానం ప్రవేశపెట్టబోతున్నారు. నిర్మాణాత్మక చర్చలకు సహకరించాలి వర్షాకాల సమావేశాలు సజావుగా సాగేందుకు, ఉభయ సభల్లో నిర్మాణాత్మక చర్చలు జరిగేందుకు ప్రతిపక్షాలు సహకరించాలని కేంద్రం విజ్ఞప్తి చేసింది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా అధ్యక్షతన ఆదివారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో కేంద్ర మంత్రులు కిరణ్ రిజిజు, అర్జున్‌రామ్ మేఘ్వాల్, మురుగన్‌తోపాటు కాంగ్రెస్ ఆర్జేడీ, జేడీ(యూ), సమాజ్‌వాదీ పార్టీ, వైఎస్సార్సీపీ, డీఎంకే, నేషనల్ కాన్ఫరెన్స్, టీఎంసీ, బీఆర్ఎస్, శివసేన(షిండే), ఆమ్ ఆద్మీ తదితర పార్టీల సభ్యులు హాజరయ్యారు. విపక్షాలు తమ ఎజెండాను ప్రస్తావించాయి. బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికల ముందు ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ, పహల్గాం ఉగ్రవాద దాడి, భారత్–పాక్ ఘర్షణపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలను లేవనెత్తాయి. పొరుగు దేశాలతో విదేశాంగ విధానం, తాజా పరిస్థితులపై పార్లమెంట్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన చేయాలని డిమాండ్ చేశాయి. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, రైతుల కష్టాలు, దేశ ఆర్థిక వ్యవస్థ, మణిపూర్ అంశాలపై పూర్తిస్థాయిలో చర్చించాలని కోరాయి. అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన అంశంపై చర్చ చేపట్టాలని డీఎంకే అభ్యర్థించింది. అఖిలపక్ష భేటీ అనంతరం కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ మీడియాతో మాట్లాడారు. భారత్–పాక్ మధ్య యుద్ధం ఆపేశానంటూ ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలు, పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదుల దుశ్చర్యకు దారితీసిన భద్రతా లోపాలు, బిహార్‌లో ఓట్ల జాబితా సవరణపై ప్రధాని మోదీ మాట్లాడాలని కోరినట్లు తెలిపారు.అఖిలపక్ష భేటీ నుంచి వస్తున్న కేంద్ర మంత్రులు కిరణ్ రిజిజు, జేపీ నడ్డా, ఎంపీలు జైరాం రమేశ్ తదితరులు కొత్త బిల్లులు వర్షాకాల సమావేశాల్లో కేంద్రం 8 కొత్త బిల్లులను ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. మణిపూర్ వస్తువులు, సేవల పన్ను(సవరణ) బిల్లు, జన్ విశ్వాస్(నిబంధనల సవరణ) బిల్లు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్(సవరణ) బిల్లు, పన్నుల చట్టాలు(సవరణ) బిల్లులతో పాటు జియోహెరిటేజ్ సైట్స్, జియో–రెలిక్స్(సంరక్షణ), జాతీయ క్రీడా పాలన బిల్లు, జాతీయ డోపింగ్ నిరోధక(సవరణ) బిల్లులను ప్రవేశపెట్టనుంది. మణిపూర్‌లో రాష్ట్రపతి పాలనను పొడిగించడానికి ప్రభుత్వం పార్లమెంట్ ఆమోదం కోరనుంది. వీటితోపాటు పెండింగ్‌లో ఉన్న సముద్ర వస్తువుల రవాణా బిల్లు, కోస్టల్ షిప్పింగ్ బిల్లు, మర్చంట్ షిప్పింగ్ బిల్లు, ఓడరేవుల బిల్లులపై చర్చించి, ఆమోదం తెలిపే అవకాశాలున్నాయి. చర్చకు వెనుకాడం కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఆపరేషన్ సిందూర్ సహా జాతీయ స్థాయిలో ప్రాముఖ్యత కలిగిన కీలక అంశాలపై పార్లమెంట్లో చర్చకు వెనుకంజ వేసే ప్రసక్తే లేదని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు. విపక్షాల ప్రశ్నలకు సమాధానం ఇస్తామన్నారు. అఖిలపక్ష భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్ సమావేశాలు ఎలాంటి అంతరాయాలు లేకుండా సజావుగా కొనసాగేందుకు అధికార, విపక్ష సభ్యులు కలిసికట్టుగా పని చేయాలన్నారు. వర్షాకాల సమావేశాలు ఫలవంతం కావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. పార్టీలకు, కూటములకు వేర్వేరు సిద్ధాంతాలు ఉన్నప్పటికీ పార్లమెంట్ కార్యకలాపాలకు సహకరించాల్సిన బాధ్యత అన్ని పక్షాలపైనా ఉందన్నారు. ఉభయ సభల్లో మాట్లాడేందుకు ఎక్కువ సమయం ఇవ్వాలని చిన్న పార్టీల ఎంపీలు కోరారని, అందుకోసం ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని రాజ్యసభ చైర్మన్, లోక్‌సభ స్పీకర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. చిన్న ఎంపీలకు తగినంత సమయం ఇవ్వాలన్నదే తమ ఉద్దేశమని వివరించారు. విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు మినహా మిగతా సమయంలో ప్రధాని మోదీ పార్లమెంట్ సమావేశాలకు హాజరవుతారని కిరణ్ రిజిజు వెల్లడించారు. విపక్షాలు లేవనెత్తే అంశాలపై సంబంధిత కేబినెట్ మంత్రులు సమాధానం ఇస్తారని స్పష్టంచేశారు. 17 బిల్లులు ప్రవేశపెట్టబోతున్నామని, వాటి వివరాలు త్వరలో వెల్లడిస్తామని చెప్పారు.

ఆపరేషన్ సింధూర్ ‘లిటిల్ హీరో’కు సన్మానం
పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్‌లోని ఉగ్రస్థావరాలే లక్ష్యంగా భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టిన సంగతి తెలిసిందే. పాక్‌కు వెన్నులో వణుకు పుట్టించిన ఆపరేషన్ సింధూర్‌తో భారత్ ఆర్మీ తన సత్తాచాటింది. పాక్‌లోకి దూసుకుపోయి మరీ ఉగ్రస్థావరాలను, పలు పాక్ ఎయిర్ బేస్‌లపై దాడులు చేసింది. ఇందులో మన ఆర్మీ పాత్రను ఎంత కొనియాడినా తక్కువే. అత్యంత కట్టుదిట్టమైన ప్రణాళికతో పాక్‌కు దడపుట్టించింది. ఆ దెబ్బతో పాక్ కాల్పుల విరమణ ఒప్పందానికి రావడంతో దానికి భారత్‌కు అంగీకరించింది.ఇదిలా ఉంచితే, భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్‌కు సాయం చేసిన ఒక 10 ఏళ్ల లిటిల్ హీరో కూడా ఉన్నాడు. అదేంటి 10 ఏళ్ల పిల్లాడు ఏం చేస్తాడు అనుకుంటున్నారా?, పాక్ ఆర్మీతో యుద్ధం చేస్తున్న సమయంలో భారత్ సైనికులకు భోజనాలు అందించి తన పాత్రను నిలబెట్టుకున్నాడు. ఆపరేషన్ సింధూర్‌లో భాగంగా పంజాబ్ గ్రామంలో భారత సైనికులు యుద్ధం చేస్తున్న సమయంలో వారికి ఆ ‘బుడ్డోడు’ భోజనాలు తదితర ఆహార పదార్థాలను సప్లై చేశాడు. దాంతో ఆ లిటిల్ హీరోను సత్కరించింది ఆర్మీ. పంజాబ్‌లోని తారా వాలి గ్రామంలో జరిగిన సన్మాన కార్యక్రమంలో ఆ చిన్నోడు ధైర్యాన్ని ఇండియన్ ఆర్మీ కీర్తించింది. ఆపరేషన్ సిందూర్ సమయంలో పంజాబ్ గ్రామంలో తుపాకీతో పోరాడుతున్న సైనికులకు మధ్య మధ్యలో భోజనం సరఫరా చేసిన పదేళ్ల బాలుడు ష్వాన్ కథను వెస్ట్రన్ కమాండ్ కమాండింగ్-ఇన్-చీఫ్ జనరల్ మనోజ్ కుమార్ కటియార్ పంచుకున్నారు.Indian Army decides to sponsor all educational needs of the Youngest Warrior of '#OperationSindoor' from Punjab, Master Shvan Singh.This 10-years old from Ferozepur kept on providing essential eatables, day and night, to the army men deployed in his fields in the border… pic.twitter.com/8xv7kozth4— All India Radio News (@airnewsalerts) July 20, 2025ఆ బాలుడి ధైర్యానికి మెచ్చిన ఇండియన్ ఆర్మీ.. ఆ పిల్లాడు చదువుకు అయ్యే ఖర్చును భరిస్తామని హామీ ఇచ్చింది. ష్వాన్ యొక్క కథ దేశంలో ఉన్నవారికి ఆదర్శం కావాలని ఆర్మీ స్పష్టం చేసింది. ఫిరోజ్‌పూర్ జిల్లాలోని మామ్‌డోట్ ప్రాంతంలోని ఒక చిన్న గ్రామానికి చెందిన 10 ఏళ్ల ష్వాన్... అతను కూడా పెద్దయ్యాక సైన్యంలో చేరాలని కోరుకుంటున్నాడు.‘ నేను పెద్దయ్యాక 'ఫౌజీ' కావాలనుకుంటున్నాను. దేశానికి సేవ చేయాలనుకుంటున్నాను’ అని గతంలోనే చెప్పుకొచ్చాడు.

జస్టిస్ యశ్వంత్ వర్మ తొలగింపునకు ముహూర్తం ఖరారు?
సాక్షి,న్యూఢిల్లీ: కాలిన నోట్ల కట్టల వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మకు పదవి నుంచి ఉద్వాసన పలికే సమయం ఆసన్నమైంది.రేపటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సమావేశాల ప్రారంభానికి ఒక రోజు ముందే జస్టిస్ యశ్వంత్ వర్మను అభిశంసన ద్వారా తొలగించే ప్రక్రియపై 100 మంది పార్లమెంట్ సభ్యులు సంతకాలు పెట్టినట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు అధికారికంగా ప్రకటించారు.ఇంట్లో కాలిన నోట్ల కట్టలు.. విచారణకు సుప్రీంఈ ఏడాది మార్చి నెలలో జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసంలో భారీ ఎత్తున కాలిన నోట్ల కట్టలు వెలుగులోకి వచ్చాయి. దీంతో జస్టిస్ వర్మపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇదే అంశంపై సుప్రీం కోర్టు త్రిసభ్య కమిటీతో విచారణ చేపట్టింది. ఈ విచారణలో కాలిన నోట్ల కట్టలు జస్టిస్ యశ్వంత్ వర్మవేనన్న సాక్షులు,ఆధారాలు వెలుగులోకి వచ్చాయి.అభిశంసన చర్యలువీటిని పరిగణలోకి తీసుకున్న అత్యున్నత న్యాయస్థానం నియమించిన త్రిసభ్య కమిటీ సైతం జస్టిస్ వర్మను అభిశంసన ద్వారా తొలగించాలని సిఫారసు చేసింది. త్రిసభ్య కమిటీ నిర్ణయాన్ని తప్పుబట్టిన జస్టిస్‌వర్మ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. కమిటీ ఇచ్చిన నివేదికను రద్దు చేయాలని అత్యున్నత న్యాయ స్థానంలో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. అలాగే తనపై అభిశంసన చర్యలు ప్రారంభించాలంటూ అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా చేసిన సిఫార్సులను సైతం సవాలు చేశారు.త్రిసభ్య కమిటీ రిపోర్టుపై సవాలునోట్ల కట్టల వ్యవహారంలో తన వాదన పూర్తిగా వినకుండానే నివేదిక రూపొందించారని అంతర్గత ఎంక్వైరీ కమిటీ తీరును ఆయన తప్పుపట్టారు. ఈ దర్యాప్తులో లోపాలు ఉన్నాయని స్పష్టం చేశారు. తనకు వ్యతిరేకంగా బలమైన సాక్ష్యాధారాలు కమిటీకి లభించలేదన్నారు.ఏకమైన అధికార,ప్రతి పక్షాలు తనను దోషిగా తేల్చాలన్న ముందస్తు వ్యూహంతోనే నివేదిక సిద్ధంగా చేశారని విమర్శించారు. తనపై దర్యాప్తు ప్రక్రియ మొత్తం రాజ్యాంగవిరుద్ధంగా సాగిందని, తన ప్రాథమిక హక్కులు ఉల్లంఘనకు గురయ్యాయని ఆందోళన వ్యక్తంచేశారు. నివేదికపై తాను అధికారికంగా స్పందించకముందే దాన్ని మీడియాకు లీక్ చేశానని, తన ప్రతిష్టను దెబ్బతీయాలన్న కుట్ర జరిగిందని జస్టిస్ వర్మ మండిపడ్డారు. అందుకే ఈ నివేదికను రద్దు చేయాలని అత్యున్నత న్యాయస్థానాన్ని కోరారు. అయినప్పటికీ జస్టిస్ వర్మపై అభిశంసన తీర్మానం ప్రవేశ పెట్టేందుకు అధికార,ప్రతి పక్షాలు ఏకమయ్యాయి. అభిశంసన తీర్మానం ద్వారాభారత రాజ్యాంగం ప్రకారం.. అవినీతి ఆరోపణల ఆధారంగా రాష్ట్రపతి ఉత్తర్వు ద్వారా మాత్రమే సుప్రీంకోర్టు న్యాయమూర్తిని పదవి నుండి తొలగించవచ్చు.అటువంటి ఘటనల్లో అభిశంసన తీర్మానాన్ని రాజ్యసభలో కనీసం 50 మంది సభ్యుల మద్దతు లేదంటే లోక్‌సభలో కనీసం 100 మంది సభ్యుల మద్దతు ఉంటేనే ఆమోదిస్తారు. ఈ తీర్మానాన్ని ఆమోదించడానికి సభలోని మూడింట రెండు వంతుల ఎంపీల మద్దతు అవసరం.మంత్రి కిరణ్ రిజిజు ఏమన్నారంటే?ఇప్పుడు ఇదే పద్దతిలో జస్టిస్ వర్మ తొలగింపునకు అధికార,ప్రతిపక్ష లోక్ సభ,రాజ్య సభ సభ్యులు సంతకాలు పెట్టారు. న్యాయవ్యవస్థలో అవినీతి అనేది చాలా సున్నితమైన విషయం. ఈ అంశంపై అన్ని రాజకీయ పార్టీలు ఐక్యంగా ఉన్నాయి. వర్షాకాల సమావేశంలో జస్టిస్ యశ్వంత్ వర్మపై ప్రభుత్వం అభిశంసన తీర్మానాన్ని ప్రవేశ పెట్టనున్నాం’ అని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. అభిశంసన తీర్మానంలో అనూహ్య పరిణామంఈ అభిశంసన తీర్మానంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. పార్లమెంటు సమావేశాల్లో బీజేపీ, కాంగ్రెస్‌లు పరస్పరం విభేదిస్తుంటాయి. కానీ న్యాయవ్యవస్థలో అవినీతి వంటి సున్నితమైన అంశంపై పార్టీలకు అతీతంగా స్పందించడం, ప్రజాస్వామ్యానికి మద్దతుగా నిలుస్తూ.. 100 మంది ఎంపీలు అభిశంసన తీర్మానంపై సంతకాలు చేయడం, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో సహా 35 మంది కాంగ్రెస్ ఎంపీలు సైతం సంతాలు చేసినట్లు సమాచారం.

‘ఆ టైమ్‌లో కిటికీలు తెరిచే ఉంచొచ్చు’.. విమాన ప్రయాణికులకు డీజీసీఏ వరం
న్యూఢిల్లీ: విమాన ప్రయాణికులకు ఆహ్లాదం కలిగించే వార్త ఇది. ల్యాండింగ్, టేకాఫ్ సమయంలో కిటికీలో నుంచి బయటకు చూడాలనే ప్రయాణికుల ఆశ నెరవేరనున్నది. భారత వైమానిక దళంలోని జాయింట్ యూజర్ ఎయిర్‌పోర్ట్‌లలో (జేయూఏఎస్))విమానాలు టేకాఫ్, ల్యాండింగ్ సమయంలో కిటికీ షేడ్స్‌ను మూసివేసి ఉంచాలనే నిబంధనను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ)ఉపసంహరించుకుంది. అయితే, విమానాశ్రయాలలో గ్రౌండ్ లేదా ఏరియల్ ఫోటోగ్రఫీపై నిషేధం కొనసాగుతుంది.పలు భద్రతా కారణాల దృష్ట్యా గతంలో టేకాఫ్, ల్యాండింగ్ సమయంలో కిటికీ షేడ్స్‌ను కిందికి ఉంచాలంటూ డీజీసీఏ అన్ని వాణిజ్య, చార్టర్, ప్రైవేట్ ఎయిర్‌క్రాఫ్ట్ ఆపరేటర్లకు సూచించింది. ఈ సూచన ముఖ్యంగా ఇండో-పాక్ సరిహద్దుకు సమీపంలో ఉన్న ఎయిర్‌బేస్‌లను ఉద్దేశించి చేశారు. ఇప్పుడు ఈ నియమాన్ని సడలించారు. అయితే ఫోటోలు, వీడియోలు తీయడంపై గల నిషేధం భద్రతా కారణాల దృష్ట్యా అలాగే కొనసాగనుంది. ప్రయాణికులు తమ ప్రయాణంలో ఫోటోలు లేదా వీడియోలు తీయకూడదని డీజీసీఏ కోరింది.భారత వైమానిక దళం సూచనల ప్రకారం, భద్రత దృష్ట్యా ఫోటోగ్రఫీపై నిషేధం చాలా ముఖ్యమైనదని డీజీసీఏ స్పష్టం చేసింది. టేకాఫ్, ల్యాండింగ్ లేదా విమానం రన్‌వేపై ఉన్నప్పుడు ప్రయాణికులను ఫోటోలు లేదా వీడియోలు తీయడానికి అనుమతించరు. ఈ నియమం ముఖ్యంగా జాయింట్ యూజర్ ఎయిర్‌పోర్ట్‌లు అని పిలిచే ఐఏఎఫ్ ఎయిర్‌బేస్‌లకు వర్తిస్తుంది. పౌర, సైనిక విమాన కార్యకలాపాలు ఈ విమానాశ్రయాలలో కొనసాగుతాయి. పఠాన్‌కోట్, శ్రీనగర్, ఆగ్రా, బరేలీ, గ్వాలియర్ తదితర ఎయిర్‌బేస్‌లలో ఫోటోగ్రఫీపై నిషేధం వర్తిస్తుంది.
ఎన్ఆర్ఐ

లండన్‌లో కేంద్ర మంత్రి బండి సంజయ్ జన్మదిన వేడుకలు
కరీంనగర్ పార్లమెంటు సభ్యులు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివర్యులు, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ జన్మదిన వేడుక సంబరాలు అంబరాన్నంటాయి. శుక్రవారం రోజున బండి సంజయ్ కుమార్ పుట్టినరోజును పురస్కరించుకొని లండన్ ఇల్ఫార్డ్‌లోని బీజేపీ శ్రేణులు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, కేక్ కటింగ్, స్వీట్లు, పంపిణి మొక్కలు నాటడంతో పాటు పలు సేవా కార్యక్రమాలను భారీ ఎత్తున చేపట్టారు.బీజేపీ లండన్ అధ్వర్యంలో ఇల్ఫార్డ్ లోని బండి సంజయ్ జన్మదిన వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ కేక్ కట్ చేసి, స్వీట్లు, పూల మొక్కలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాటిపల్లి సచిందర్ రెడ్డి మాట్లాడుతూ కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ క్షేత్రస్థాయిలో దిగ్విజయనేత అని కొనియాడారు. కార్పొరేటర్ నుండి ఎంపీ, కేంద్రమంత్రి స్థాయికి బండి సంజయ్ ఎదిగిన తీరు కార్యకర్తలకు ఆదర్శం, స్ఫూర్తిదాయకమన్నారు. సరస్వతీ శిశు మందిరం లో విద్యనభ్యసించిన బండి సంజయ్ కుమార్ ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారని అన్నారు.ఆర్ఎస్ఎస్లో ఘటన్ నాయక్ గా, ముఖ్య శిక్షక్ గా ప్రాథమిక విద్యా స్థాయిలోనే బండి సంజయ్ పని చేశారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. అనంతరం అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ)లో, బిజెపి కరీంనగర్ పట్టణ ఉపాధ్యక్షుడిగా, అధ్యక్షులుగా, జిల్లా , రాష్ట్ర కార్యవర్గాల్లో వివిధ హోదాల్లో బిజెపిలో ఆయన బాధ్యతలు నిర్వర్తించారని తెలిపారు. భారతీయ జనతా పార్టీ కేరళ, తమిళనాడు రాష్ట్రాల ఇన్చార్జిగా ను ఆయన పని చేశారని, ఎల్కే అద్వానీ చేపట్టిన రథయాత్రలోనూ బండి సంజయ్ కుమార్ భాగం పంచుకున్నారని , 35 రోజులపాటు దేశవ్యాప్తంగా జరిగిన ప్రచారంలో పాల్గొన్నారని తెలిపారు. 1994 _ 2003 మధ్యకాలంలో బండి సంజయ్ కుమార్ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ గా పని చేశారన్నారు.2005లో కరీంనగర్ 48వ డివిజన్ నుండి కార్పొరేటర్‌గా బండి సంజయ్ విజయం సాధించారని, వరుసగా మూడుసార్లు ఆయన కార్పొరేటర్ గా గెలుపొందారన్నారు.2019 లో కరీంనగర్ పార్లమెంటు సభ్యులుగా ఎన్నికయ్యారని తెలిపారు. అనంతరం బిజెపి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన బండి సంజయ్ కుమార్ పార్టీని బలోపేతం చేయడానికి ఎంతో కృషి చేశారని తెలిపారు. ఆయన సారాధ్యంలో బిజెపి రాష్ట్రంలో పుంజుకుందన్నారు. ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో తెలంగాణ వ్యాప్తంగా బండి సంజయ్ కుమార్ చేపట్టిన పాదయాత్రతో బీజేపీ గ్రామ గ్రామానికి చేరిందని పేర్కొన్నారు. ముఖ్యంగా ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజలతో మమేకమై, వారి కష్ట సుఖాలు తెలుసుకుంటూ, అధికార పార్టీపై తీవ్రస్థాయిలో బండి సంజయ్ కుమార్ విరుచుకుపడ్డారని తెలిపారు.బండి సంజయ్ కుమార్ నాయకత్వంలో రాష్ట్రంలో జరిగిన దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికలు జిహెచ్ఎంసి ఎన్నికలు చరిత్ర సృష్టించాయన్నారు. బండి సంజయ్ దిశా నిర్దేశంలో రాష్ట్రంలో బిజెపి గ్రాఫ్ పెరిగిందన్నారు. అనంతరం బండి సంజయ్ బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారని తెలిపారు. కరీంనగర్ చరిత్రలోనే భారీ మెజారిటీతో రెండోసారి బండి సంజయ్ పార్లమెంట్ సభ్యునిగా గెలుపొంది, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టారని తెలిపారు. ప్రస్తుతం దేశ, రాష్ట్ర బిజెపి కీలక నేతల్లో బండి సంజయ్ ఒకరని చెప్పారు.ప్రధానంగా కరీంనగర్ పార్లమెంటు సర్వతో ముఖాభివృద్ధి కోసం బండి సంజయ్ కుమార్ అహర్నిశలు కృషి చేస్తున్నారని, రెండు టర్ములలో పార్లమెంటు ఎన్నికల్లో అత్యధిక మెజారిటి తో గెలుపొంది రాష్ట్ర బిజెపి అధ్యక్షునిగా పనిచేసి కేంద్రమంత్రి గా కొనసాగుతూ స్థానికంగా ప్రజలకి అందుబాటులో ఉంటున్నారని కొనియాడారు ఈ కార్యక్రమం లోఓవర్సీస్ బీజేపీ నాయకులు వాస భరత్, బండ సంతోష్, కోమటిరెడ్డి శివ ప్రసాద్ రెడ్డి, జయంత్, సంజయ్, బద్దం చిన్న రెడ్డి, సురేష్, చార్లెస్, జేమ్స్, ఆంథోనీ తదితరులు పాల్గొన్నారు.

సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో ఘనంగా బోనాల ఉత్సవం
సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో బోనాల పండుగ వైభవంగా జరిగింది. శ్రీ అరసకేసరి శివన్ ఆలయంలో సుమారు 900 మంది భక్తులతో ఈ వేడుకు ఘనంగా జరిగింది. అంతర్జాలం ద్వారా మరో 7,000 మంది వీక్షించారు. తెలంగాణ జానపద గేయాలు, భక్తిగీతాలు, నృత్యప్రదర్శనలు ఉత్సవానికి విశేష ఆకర్షణగా నిలిచాయి.బోయిన స్వరూప, పెద్ది కవిత, సరితా తులా, దీపారెడ్డి, మోతే సుమతి, గంగా స్రవంతి, సంగీత తదితర మహిళలు కుటుంబ సమేతంగా భక్తిశ్రద్ధలతో దుర్గాదేవికి బోనాలు సమర్పించారు. మొదటి నుంచి చివరి వరకు సాంప్రదాయభరితంగా, సాంస్కృతిక ఘనతతో కొనసాగిన ఈ కార్యక్రమంలో తెలుగు కుటుంబాలు, కార్మిక సోదరులు పెద్దఎత్తున పాల్గొన్నారు.మహిళలు, చిన్నారులు ఉత్సాహంతో నృత్యాలు చేసి అందరినీ ఆకట్టుకున్నారు. కాళికా అమ్మవారికి వేపచెట్టు రెమ్మలు, పసుపు, కుంకుమతో అలంకరించి, దీపం వెలిగించిన బోనాలను అత్యంత భక్తిశ్రద్ధలతో సమర్పించారు. మట్టి కుండల్లో అన్నం, పాలు, పెరుగు, బెల్లంతో చేసిన బోనాలను తలపై మోస్తూ, డప్పులు, పోతురాజులు, ఆటగాళ్లతో ఆలయానికి తరలివచ్చారు. అనంతరం అమ్మవారి తీర్థప్రసాదాలను పంచిపెట్టారు. పెద్దపులి ఆట, పోతురాజు వేషధారణ, సాంస్కృతిక నృత్యాలు కార్యక్రమానికి మరింత ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా సింగపూర్‌లోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వారికి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామని నిర్వాహకుడు బోయిన సమ్మయ్య తెలిపారు.బోనాలు తెలంగాణకు ప్రత్యేకమైన సాంప్రదాయక పండుగ అని, తక్కువ సమయంలో పెద్ద ఉత్సవాన్ని విజయవంతంగా నిర్వహించిచారంటూ సమాజం అధ్యక్షుడు బొమ్మారెడ్డి శ్రీనివాసులు రెడ్డి అభినందించారు. ఈ ఏడాది సమాజం సువర్ణోత్సవాలను కూడా ప్రకటించారు. కార్మిక సోదరులు పెద్దఎత్తున హాజరయినందుకు ఉపాధ్యక్షులు పుల్లన్నగారి శ్రీనివాసరెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఉపాధ్యక్షులు కురిచేటి జ్యోతీశ్వర్ రెడ్డి స్పాన్సర్ వజ్ర రియల్‌ఎస్టేట్‌కు అభినందనలు తెలిపారు.కార్యక్రమాన్ని విజయవంతం చేసిన సింగపూర్ తెలుగు సమాజం, అరసకేసరి దేవస్థానం సభ్యులకు, ఆహుతులకు, హాజరైన భక్తులు అందరికీ గౌరవ కార్యదర్శి పోలిశెట్టి అనిల్ కుమార్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.కోశాధికారి ప్రసాద్, ఉపకోశాధికారి ప్రదీప్, ఉపాధ్యక్షులు నాగేష్, మల్లిక్, కార్యదర్శి స్వాతి, కమిటీ సభ్యులు గోపి కిషోర్, జనార్ధన్, జితేందర్, భైరి రవి, గౌరవ ఆడిటర్లు ప్రీతి, నవత తదితరులు ఈ వేడుకలో భాగం పంచుకున్నారని, తెలుగు వారంతా బోనాల స్ఫూర్తితో పాల్గొని మన ఐక్యతను చాటారని నిర్వాహకులు పేర్కొన్నారు.

ట్రంప్‌కు మరో షాక్.. రాజీనామా యోచనలో కాష్ పటేల్!
ట్రంప్ వీరవిధేయుడు, ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ తన పదవికి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. బిగ్ బ్యూటీఫుల్ బిల్లు విషయంలో విభేదాలతో ఎలాన్ మస్క్ డోజ్‌ను వీడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కాష్ పటేల్ కూడా ఎప్స్టీన్ ఫైల్స్ వ్యవహారంలో అదే బాటలో పయనించే అవకాశం కనిపిస్తోంది.వాషింగ్టన్: భారత సంతతికి చెందిన కాష్ పటేల్(కశ్యప్ ప్రమోద్ పటేల్) ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ డైరెక్టర్ పదవికి రాజీనామా చేయాలని భావిస్తున్నారు. ఎఫ్‌బీఐ డిప్యూటీ డైరెక్టర్ డాన్ బోంగినో రాజీనామా చేస్తారనే ఊహాగానాల నడుమ.. కాష్ ఈ నిర్ణయం వైపు మొగ్గు చూపిస్తున్నట్లు తెలుస్తోంది. డాన్ రాజీనామా చేసిన వెంటనే తన పదవి నుంచి వైదొలగాలని కాష్ భావిస్తున్నారని స్థానిక మీడియా కథనాలు ఇస్తోంది. ఎప్స్టీన్ ఫైల్స్(EPSTEIN FILES) అనేది అమెరికాలో సంచలనం సృష్టించిన జెఫ్రీ ఎప్స్టీన్ సెక్స్ కుంభకోణానికి సంబంధించిన కీలక పత్రాల వ్యవహారం. ఈ ఫైల్స్‌లో ఎప్స్టీన్ కాంటాక్ట్ లిస్ట్, ఫ్లైట్ లాగ్‌లు, అతనికి వ్యతిరేకంగా సేకరించిన ఆధారాలు ఉన్నాయి. అయితే ఈ కేసులో ప్రముఖ రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, సెలబ్రిటీలు ఉన్నారని ఆరోపణలూ ఉన్నాయి. ఎఫ్‌బీఐ డిప్యూటీ డైరెక్టర్ డాన్ బోంగినోఎప్స్టీన్ ఫైల్స్ వ్యవహారాన్ని అమెరికా న్యాయ విభాగం.. ఎఫ్‌బీఐ కలిపి విచారిస్తోంది. అయితే ఈ కేసును అటార్నీ జనరల్ పామ్ బాండీకు అప్పగించినప్పటి నుంచి ఎఫ్‌బీఐ డిప్యూటీ డైరెక్టర్ డాన్ బోంగినో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఆయన సెలవులపై వెళ్లారు. అయితే ఆమె ఉండగా తాను తిరిగి విధుల్లోకి రాలేనని బోంగినో ఎఫ్‌ఐబీకి స్పష్టం చేసినట్లు కథనాలు వెలువడ్డాయి. ఈ తరుణంలోనే కాష్ పటేల్ ఈ వ్యవహారంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. బోంగినో గనుక రాజీనామా చేస్తే.. కాష్ తాను పదవి నుంచి వైదొలగాలని భావిస్తున్నారని అక్కడి మీడియా కథనాలు ఇచ్చింది. పామ్ బాండీ‘‘ఈ దర్యాప్తులో పామ్ బాండీ ఉండాలని కాష్ పటేల్ కూడా కోరుకోవడం లేదు. బాండీ మరికొన్ని పత్రాలను విడుదల చేయకపోవడంపైనా ఎఫ్‌బీఐ వర్గాల్లో తీవ్ర అసహనం నెలకొంది. అందుకే బోంగినో గనుక వీడితే ఆయన కూడా ఎఫ్‌బీఐని వీడే అవకాశం ఉంది’’ అని ఓ ప్రముఖ జర్నలిస్టు తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఎఫ్‌బీఐకి, డీవోజే(డిపార్ట్మెంట ఆఫ్ జస్టిస్)కు నడుమ పొసగట్లేదన్న విషయాన్ని సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, ట్రంప్ అనుచరురాలు లారా లూమర్ సైతం ధృవీకరించడం గమనార్హం. పారదర్శకత లోపించిందనేది ప్రధాన ఆరోపణతో ఎఫ్‌బీఐ వర్గాలు బాండీ తీరుపట్ల అసంతృప్తిగా ఉన్నాయంటూ లూమర్ తెలిపారు. ఈ క్రమంలో బాండీని.. బ్లోండీ అంటూ ఆమె ఎద్దేవా చేయడం గమనార్హం. ప్రముఖ ఇన్వెస్టర్ అయిన ఎప్స్టీన్ లైంగిక వేధింపుల ఆరోపణలతో మీటూ ఉద్యమ సమయంలో అరెస్ట్ అయ్యాడు. ఆపై 2019లో జైల్లో అనుమానాస్పద స్థితిలో మరణించగా.. ఆత్మహత్య చేసుకున్నాడని అధికారులు ప్రకటించారు. అయితే ఈ ఫైల్స్ ఇప్పటిదాకా బయటకు రాకపోవడంతో అమెరికా రాజకీయాల్లో, మీడియాలో పెద్ద చర్చ నడుస్తోంది. అయితే.. ఎప్స్టీన్ ఫైల్స్‌లో.. ప్రముఖుల పేర్లు ఉన్నాయని, వాటిని త్వరలోనే బయటపెడతామని ఫిబ్రవరిలో ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పామ్ బాండీ ప్రకటించారు. అయితే తాజాగా డీవోజే-ఎఫ్‌బీఐ సంయుక్తంగా విడుదల చేసిన మెమోలో.. ఎలాంటి ఆధారాల్లేవని, కేసును ముగించినట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో బాండీ మాటమార్చి.. తన గత వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఒకవైపు ఎలాన్ మస్క్ సైతం ఈ వ్యవహారంపై ట్రంప్ ప్రభుత్వానికి చురకలంటిస్తున్నారు. మరోవైపు ట్రంప్ ఈ వ్యవహారంపై తనకు సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటిదాకా ఎఫ్‌బీఐ వర్సెస్ జ్యూడీషియల్ డిపార్టెమెంట్ వ్యవహారంపై వైట్‌హౌజ్ ఎలాంటి ప్రకటనా చేయలేదు. ఇంకోవైపు మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్(MAGA) ఉద్యమకారులు సైతం ఈ పరిణామాలపై అసంతృప్తితో రగిలిపోతున్నారు.కశ్యప్ పూర్వీకులు భారత్‌లోని గుజరాత్ నుంచి వలస వెళ్లారు. అతడి తల్లిదండ్రులు తూర్పు ఆఫ్రికాలో పెరిగారు. ఉగాండా నుంచి అమెరికాకు వలస వచ్చారు. 1980లో న్యూయార్క్‌లో కశ్యప్ జన్మించారు. యూనివర్శిటీ ఆఫ్ రిచ్మాండ్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి యూనివర్సిటీ ఆఫ్ కాలేజ్ లండన్‌లో న్యాయవిద్యను పూర్తి చేశారు.అనంతరం మియామీ కోర్టుల్లో లాయర్‌గా వివిధ హోదాల్లో సేవలందించారు. ఆ సమయంలోనే ట్రంప్‌కు ఆయన దగ్గరయ్యారు. ఫిబ్రవరి 22వ తేదీన ఎఫ్‌బీఐ 9వ డైరెక్టర్‌గా కాష్ పటేల్ బాధ్యతలు స్వీకరించారు. ఆ సమయంలో పామ్ బాండీ కాష్‌తో ప్రమాణం చేయించగా.. భగవద్గీత మీద చేయి ఉంచి ఆయన బాధ్యతలు చేపట్టారు.

యూఎస్‌కు బైబై : ఇండియాలో రూ.25 కోట్లతో బతికేయొచ్చా? చెప్పండి ప్లీజ్!
కూటి కోసం కోటి తిప్పలు..ఇది సగటు మనిషి ఆలోచన. మెరుగైన జీవితం కోసం డాలర్ డ్రీమ్స్ ఎందరివో. విదేశాలకు వెళ్లాలి. డాలర్లలో సంపాదించాలి అనేది లెక్కలేనంతమంది భారతీయు యువతీ యువకుల ఆశ, ఆశయం. కానీ డాలర్ డ్రీమ్స్ ఇపుడు మసక బారుతున్నాయి. ముఖ్యంగా ఎక్కువమంది భారతీయ టెకీలు నివసించే అమెరికాలోరోజు రోజుకీ మారుతున్న పరిణామాలు భారతదేశానికి తిరిగి పయనమయ్యేలా చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రెడ్డిట్‌లో అమెరికాలో ఉంటున్న ఒక యువజంట పోస్ట్ వైరల్‌గా మారింది. ఈ జంట గత 15 ఏళ్లుగా అమెరికాలో నివసిస్తోంది. వీరి ఒక చిన్న బాబు కూడా ఉన్నాడు. ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా (OCI) హోదాను కలిగి ఉన్నారు, ఇది వారికి ఏ దేశంలోనైనా నివసించడానికి, పని చేయడానికి వెసులుబాటునిస్తుంది. కుమారుడికి కూడా అమెరికా పౌరసత్వం ఉంది. ముగ్గురు సభ్యుల ఫ్యామిలీ ఇండియాకు తిరిగి రావాలని ప్లాన్ చేస్తోంది. ‘‘మేం ఇద్దం 30ల్లో ఉన్నాం. టెక్నాలజీ, ఇక్కడ జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో భారతదేశానికి తిరిగి వెళ్లాలని భావిస్తున్నాం. ఒక ముగ్గురు సభ్యులున్న కుటుంబం ఇండియాలో బతకాలంటే రూ. 25 కోట్లు సరిపోతాయా... రిటైర్ మెంట్ తరువాత పిల్లలను పెంచుకుంటూ, హ్యాపీగా జీవించాలి అసలు ఎంత కావాలి దయచేసి తెలపండి’’ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఇండియాకు వెళ్లాక కొంతకాలం విరామం తీసుకోవచ్చు. ఆ తరువాత ఇంట్రస్ట్‌ను బట్టి ఉద్యోగాలు వెదుక్కుంటాం. కానీ అది మా జీవితాలను ప్రభావితం చేయకూడదని పేర్కొన్నారు. దాదాపు 5.5 మిలియన్ల డార్లు (సుమారు రూ. 47.21 కోట్లు) ఉన్నాయంటూ తమ ఆస్తులకు సంబంధించిన వివరాలను కూడా అందించారు.రెడ్డిటర్లు ఈ పోస్ట్‌పై స్పందించారు. అది మీరుండే నగరం, ఇల్లు,అలవాట్లు, జీవన శైలిసహా అనేక అంశాలపై ఇది ఆధారపడి ఉంటుందని కొందరు సాధారణంగా భారతీయ నగరంలో జీవించడానికి రూ. 25 కోట్లు సరిపోతాయని మరి కొందరు చెప్పగా, టైర్ 2 స్మార్ట్/బాగా అభివృద్ధి చెందిన నగరంలో నివసిస్తుంటే ప్రామాణిక ఖర్చులు అద్దె, ఆహారం, కొన్ని అవసరమైన వస్తువులు సహా 75 వేల రూపాయలు సరిపోతాయి. సొంత ఇల్లు ఇంకా మంచిది. పిల్లవాడికి ఒక మాదిరి స్కూలు ఫీజు నెలకు 30-50 వేలు చాలు. నికరంగా ఒక స్టాండర్డ్ లైఫ్‌కి నెలకు 2 లక్షలు బేషుగ్గా సరిపోతాయి రెండు మూడేళ్ల తరువాత ఏదో ఒక ఉద్యోగం వెతుక్కుంటే చాలు అని ఒకరు వివరించారు. (Today Tip : మూడు నెలల్లో బాన పొట్ట కరిగిపోవాలంటే..!)ముగ్గురే కాబట్టి ఇక్కడ సౌకర్యవంతంగా బతకాలంటే జీవనశైలి బట్టి నెలకు కనీసంగా రూ. 4 లక్షలు, గరిష్టంగా రూ. 8 కోట్లు సరిపోతాయని లెక్కలు చెప్పారు. మరో యూజర్ ఏమన్నారంటే.. "నేను ఇటీవల భారతదేశంలో (ముఖ్యంగా బెంగళూరులో) కొంత సమయం గడిపాను. US కి దగ్గరగా జీవించాలనుకుంటే ఇండియాచాలా ఖరీదైనది. US సబర్బన్ లాంటి, బెంగళూరులోని ఆదర్శ్, బ్రిగేడ్ లేదా ప్రెస్టీజ్ వంటి కొన్ని ప్రీమియర్ గేటెడ్ కమ్యూనిటీలు 2000 చదరపు అడుగులు, అంతకంటే ఎక్కువ విస్తీర్ణంలో రూ. 5 కోట్లు కంటే ఎక్కువ ఖర్చు అవుతాయి కానీ మీరు ఇంతకంటే చవగ్గా కూడా బతకొచ్చు. కాబట్టి మూడు మిలియన్ డాలర్లు సరిపోతాయా లేదా అనేది మీమీదే ఆధారపడి ఉంటుదని మరొకరు వ్యాఖ్యానించారు.అంతేకాదు “ఇండియాలో ట్రాఫిక్, దుమ్ము, కాలుష్యం, అవినీతి, శాంతిభద్రతల సమస్యలు, వేడి, నీటి కొరత లాంటి సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.” అని మరో రెడ్డిటర్ వ్యాఖ్యానించాడు.ఇదీ చదవండి: Lishalliny Kanaran : భారతీయ పూజారిపై మిస్ గ్రాండ్ మలేషియా సంచలన ఆరోపణలు!
క్రైమ్

పక్కలోకి వస్తేనే సంతకం పెడతా
బెల్లంకొండ: రేషన్ కార్డులో పిల్లల పేర్లు నమోదు చేయాలంటూ వచ్చిన ఓ వివాహితను వీఆర్వో లైంగిక వేధింపులకు గురి చేశాడు. ఈ ఘటన పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలంలో ఆదివారం వెలుగులోకి వచ్చింది. రేషన్ కార్డులో పేర్ల మార్పు చేర్పుల కోసం వివాహిత కొద్ది రోజుల క్రితం దరఖాస్తు చేసింది. వీఆర్వో వెంకయ్య నాగిరెడ్డిపాలెం గ్రామంలో కొన్నేళ్లుగా ఒక గది అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. ఆఫీసుకు వెళ్లి వచ్చిన తర్వాత ఆ గదిలోనే ఉంటూ అర్జీదారులను అక్కడికే పిలిపించుకుంటూ కార్యకలాపాలు సాగిస్తుంటాడు. వారం రోజుల నుంచి వివాహిత వీఆర్వో వద్దకు వస్తుండగా కాలయాపన చేస్తూ పలుమార్లు తిప్పాడు. తన కోరిక తీరిస్తేనే సంతకం పెడతానంటూ ఆమెను వేధించాడు. దీంతో 2 రోజుల క్రితం వీఆర్వో ఉంటున్న గది వద్దకు వివాహిత వెళ్లి ఆయన వేధింపులను సెల్ఫోన్లో వీడియో తీసి, శనివారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు వీఆర్వోపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై తహశీల్దార్ టీ.ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ..ఈ ఘటనను ఉన్నతాధికారులకు తెలియజేసి, వీఆర్వోపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.

చిట్టి మనసు.. తల్లడిల్లి..!
సాక్షి ప్రతినిధి, నల్లగొండ/సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విద్యార్థుల బలవన్మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా గురుకుల విద్యా సంస్థలు, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల (కేజీబీవీ) చిన్నారులు ఎక్కువ సంఖ్యలో ఆత్మహత్యలకు పాల్పడటం తల్లిదండ్రులను కలవరపరుస్తోంది. గతేడాది ఏకంగా 48 మంది విద్యార్థులు ప్రాణాలు తీసుకోగా.. ప్రస్తుత విద్యా సంవత్సరంలో కేవలం నెలన్నర వ్యవధిలోనే దాదాపు 10 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. వీరిలో ఇద్దరు కేజీబీవీ విద్యార్థులుండగా..ఒక వారం వ్యవధిలోనే నలుగురు మరణించడం చర్చనీయాంశమవుతోంది. ఒంటరితనం..ఒత్తిడి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ గురుకుల సొసైటీలతో పాటు విద్యాశాఖ పరిధిలోని జనరల్ గురుకుల సొసైటీ పరిధిలో 1,038 గురుకుల విద్యా సంస్థలున్నాయి. వీటి పరిధిలో 4.5 లక్షల మంది విద్యార్థులున్నారు. ఇవిగాకుండా విద్యాశాఖ పరిధిలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు, మోడల్ స్కూల్స్ 600 వరకు ఉన్నాయి. ఈ విద్యా సంస్థల్లో విద్యార్థులకు వసతితో కూడిన ఉచిత బోధన ఉంటుంది. తల్లిదండ్రులు ఎన్నో ఆశలతో తమ పిల్లల్ని వీటిల్లో చేరుస్తుంటారు. అయితే..ఇంటిపై బెంగ, హాస్టళ్లలో ఒంటరితనం, చదువు నేపథ్యంలో మానసిక ఒత్తిడికి లోనై కొందరు ప్రాణాలు తీసుకుంటున్నట్లు తెలుస్తుండగా..మరికొన్ని చోట్ల ప్రిన్సిపాళ్లు, సిబ్బంది వేధింపులు విద్యార్థుల ఆత్మహత్యలకు కారణం అవుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. ఇంత జరుగుతున్నా ఉన్నతాధికారులు విద్యార్థుల ఆత్మహత్యలు నివారించే దిశగా సరైన చర్యలు చేపట్టడం లేదని, ఇందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవడం లేదని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అయితే ఈ ఏడాది జరిగిన ఘటనలకు సంబంధించి ప్రభుత్వం ఏకంగా 20 మంది ఉపాధ్యాయుల్ని సస్పెండ్ చేయడం గమనార్హం. బలహీన మనస్తత్వం..కౌన్సెలింగ్ అంతంత మాత్రం! విద్యార్థుల ఆత్మహత్యలకు కారణాలు స్పష్టంగా తెలియనప్పటికీ.. ఎక్కువ మంది బలహీనమైన మనస్తత్వం (వీక్ మైండెడ్) కారణంగానే ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్టు తెలుస్తోంది. కుటుంబానికి దూరంగా ఉంటున్నామనే ఆలోచనలు, ఇతర విద్యార్థులతో పోటీ పడి చదవగలమా అనే ఆత్మన్యూనత భావం... బోధన, అభ్యసన కార్యక్రమాల ఒత్తిడి వారిని ప్రతికూల ఆలోచనలకు ప్రేరేపిస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితి నుంచి వారిని కాపాడేందుకు అవసరమైన కౌన్సెలింగ్ సరిగా జరగడం లేదనే విమర్శలు ఉన్నాయి. కానీ.. బీసీ గురుకుల సొసైటీలో జిల్లా కేంద్రంగా వీక్ మైండెడ్ విద్యార్థులను గుర్తించి వారికి కౌన్సెలింగ్ ఇచ్చేందుకు ప్రత్యేక బృందాలు ఉన్నాయి. పాఠశాల, కళాశాలలో వీక్ మైండ్ ఉన్న విద్యార్థులను గుర్తించేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తూ విద్యార్థులను జిల్లా కేంద్రానికి పంపించి కౌన్సెలింగ్ ఇస్తున్నారు. చైతన్యపరిచే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అలాగే ఎస్సీ గురుకుల సొసైటీలో ‘ప్రాజెక్టు మిత్ర’ పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. అయితే ఇలాంటి కార్యక్రమాలు మరింత ముమ్మరంగా నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విద్యారంగ నిపుణులు సూచిస్తున్నారు. వారంలోనే నలుగురు..! ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఇప్పటివరకు 10 మంది విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడగా, సుమారు వారం వ్యవధిలోనే నలుగురు మరణించారు. » ఈ నెల 13వ తేదీన మహబూబ్‌నగర్ జిల్లా మల్దకల్ మండలంలోని ఉలిగేపల్లి గ్రామానికి చెందిన కురువ క్రిష్టన్న, సవారమ్మ దంపతుల కుమారుడైన హరికృష్ణ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. » 14న యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం తూప్రాన్‌పేట మహాత్మా జ్యోతిరావు ఫూలే గురుకుల పాఠశాల వసతి గృహంలో ఊరబాయి సంధ్య (11) అనే విద్యార్థిని హాస్టల్ భవనంపైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. » ఈ నెల 15న సూర్యాపేట జిల్లా నడిగూడెం కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న తనూష మహాలక్ష్మి తరగతి గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. » ఈ నెల 19వ తేదీ ఉదయం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లోని ఎస్సీ, ఎస్టీ గురుకుల పాఠశాలలో ఇంటర్ సెకండియర్ చదువుతున్న సంతోష్ (17) ఆత్మహత్య చేసుకున్నాడు. » జూన్ నెలాఖరులో రంగారెడ్డి జిల్లా పాలమాకుల కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయకు చెందిన మరో విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. » ఆసిఫాబాద్‌లోని గిరిజన ఆశ్రమ కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. » ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గడిచిన మూడు నెలల్లో ఆరుగురు ఆత్మహత్య చేసుకోగా వీరిలో ముగ్గురు గత నెలలో ఆత్మహత్యకు పాల్పడ్డారు.సూర్యాపేట జిల్లా నడిగూడెం కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న తనూషా మహాలక్ష్మి ఈ నెల 15న తరగతి గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ‘మా కూతురు ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదు. చదువుల్లో టాపర్. 9వ తరగతిలో తానే టాపర్. 10వ తరగతిలో కూడా టాపర్‌గా నిలుస్తానని మాకు చెప్పింది. ఆమె ఆత్మహత్యపై అనుమానాలు ఉన్నాయి. బాధ్యులపై కఠిన చర్యలు చేపట్టాలి..’ అని తనూష తల్లిదండ్రులు వెంకన్న, వసుంధర డిమాండ్ చేశారు.పరిస్థితిని చక్కదిద్దుతున్నాం.. విద్యార్థుల ఆత్మహత్యలు అత్యంత బాధాకరం. గురుకులాల వరకు పరిశీలిస్తే.. దీర్ఘకాల వేసవి సెలవుల తర్వాత తిరిగి రావడం.. రెండునెలల పాటు తమకు ఇష్టం వచ్చినట్లుగా కాలం గడిపి..ఒక్కసారిగా ఆ వాతావరణానికి దూరం కావడం విద్యార్థులకు కాస్త ఇబ్బందికరంగా మారుతోంది. ఈ పరిస్థితిని సరిదిద్దే విధంగా గురుకులాల్లో చర్యలు తీసుకుంటున్నాం. తల్లిదండ్రులు, తోబుట్టువులతో మాట్లాడేందుకు వీలుగా ‘ఫోన్మిత్ర’ అందుబాటులోకి తెచ్చాం. అన్ని సొసైటీల్లో ఇలా ఫోన్లను ఏర్పాటు చేశాం. దీంతో మంచి ఫలితాలు వస్తున్నాయి. మరోవైపు విద్యార్థులను చైతన్యపరిచేలా ప్రత్యేకంగా కార్యక్రమాలు చేపడుతున్నాం. –అలగు వర్షిణి, ఎస్సీ గురుకుల సొసైటీ కార్యదర్శిటీచర్లు, సిబ్బందిని ఎడ్యుకేట్ చేయాలి... గురుకుల విద్యా సంస్థల్లో చదివే పిల్లల వయసు 18 ఏళ్లలోపే ఉంటుంది. ఎదిగీ ఎదగని వయసు కాబట్టి పిల్లల మనస్తత్వాన్ని అర్థం చేసుకుని..వారితో సందర్భోచితంగా వ్యవహరించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులు, గురుకుల సిబ్బందిపై ఉంది. ముఖ్యంగా విద్యార్థుల్లో అభద్రతా భావాన్ని తొలగించి, మానసికంగా బలపరిచే బాధ్యత ఉపాధ్యాయులు, సిబ్బంది తీసుకోవాలి. పిల్లలు అన్యమనస్కంగా ఉంటున్నట్లు, చురుగ్గా లేనట్టు గమనిస్తే..వెంటనే సరైన చర్యలు తీసుకోవడం ద్వారా ఆత్మహత్యలు నివారించవచ్చు. – విశేష్, సైకాలజిస్ట్

నెల్లూరులో కుబేర సినిమా తరహా స్కామ్
ధనుష్ నటించిన తెలుగు సినిమా ‘కుబేర’.. థియేటర్ నుంచి ఇప్పడు ఓటీటీకి వచ్చి అలరిస్తోంది. అమాయకులను ఆసరాగా చేసుకుని కేటుగాళ్లు ఈ తరహా మోసాలకు కూడా పాల్పడతారని చూపించారు దర్శకుడు శేఖర్ కమ్ముల. అయితే ఈ సినిమా కథాంశం తరహాలోనే నెల్లూరులో ఓ భారీ కుంభకోణం ఇప్పుడు బయటపడింది.సాక్షి, నెల్లూరు: కుబేర సినిమా తరహాలో జిల్లా కేంద్రంలో బయటపడిన ఓ భారీ స్కామ్ ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. నెల్లూరు యాక్సిస్ బ్యాంక్ కేంద్రంగా రూ.10 కోట్ల 60 లక్షల మేర సొమ్మును కేటుగాళ్లు మాయ చేశారు. ఇందుకోసం అమాయక గిరిజనుల ఐడెంటిటీని వాడుకున్నారు.ఓ ఫేక్ కంపెనీని ఏర్పాటు చేసి.. అందులో కొందరు గిరిజనులను ఉద్యోగులుగా చూపించారు. వాళ్లకు ఆరు నెలలపాటు జీతాలు ఇచ్చినట్లు స్టేట్మెంట్లు క్రియేట్ చేశారు. అలా మొత్తం 56 మంది పేరిట నెల్లూరు యాక్సిస్ బ్రాంచ్‌లో లోన్లకు అప్లై చేసి డబ్బు చేజిక్కించుకున్నారు. అయితే.. సకాలంలో రుణం చెల్లించకపోవడంతో గిరిజనులకు నోటీసులు వెళ్లాయి. దీంతో వాళ్లు లబోదిబోమన్నారు. 2022 నుంచి సుమారు రెండేళ్లపాటు ఈ భారీ స్కామ్ జరిగినట్లు తేలింది. కిందటి ఏడాది సదరు బ్రాంచ్ మేనేజర్ ముగ్గురు వ్యక్తుల మీద ముత్తుకూరు పీఎస్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఈ భారీ స్కాంలో బ్యాంకు ఉద్యోగుల పాత్ర కూడా ఉండొచ్చని భావిస్తున్న పోలీసులు.. ఆ దిశగా దర్యాప్తు ముమ్మరం చేశారు.

భార్యకు అదే పిచ్చి... భర్త ఏం చేసాడంటే!
కడప జిల్లా : ప్రవర్తన బాగా లేకపోవడంతో పద్ధతి మార్చుకోవాలని రెండేళ్లుగా భర్త చెబుతూ వస్తున్నాడు .. భార్య వివాహేతర సంబంధంపై పలుమార్లు పోలీసు స్టేషన్లో పంచాయితీలు జరిగాయి. అయినా ఆమెలో మార్పు రాకపోవడంతో భార్యను హతమార్చి శవాన్ని గోనె సంచిలో తీసుకెళ్లి మైదుకూరు – పోరుమామిళ్ల మధ్య గల ఎద్దడుగు కనుమలో పడేసిన ఘటన శనివారం మండలంలోని చియ్యపాడులో జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. చాపాడు మండలం చియ్యపాడు గ్రామానికి చెందిన నల్లబోతుల సుజాత(40)ను ఆమె భర్త నల్లబోతుల గోపాల్ ఈ నెల 17న గొంతు నులిమి హత్య చేశాడు. ప్రైవేటు ట్రావెల్స్ బస్సు డ్రైవర్‌గా ఉంటున్న గోపాల్ తన అక్క పార్వతమ్మ కూతురు అయిన సుజాతను 20 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. గత రెండేళ్ల క్రితం నుంచి తన ఇంటి నిర్మాణం చేస్తున్న చియ్యపాడు దళితవాడకు చెందిన బేల్దారి బాబుతో సుజాతకు పరిచయం ఏర్పడి అది వివాహేతర సంబంధంగా మారింది. ఈ విషయం తెలుసుకున్న భర్త గోపాల్ పలు సార్లు భార్య సునీతను పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించాడు. అయినప్పటికీ వివాహేతర సంబంధం కొనసాగుతోంది. ఈ పంచాయితీ పలు సార్లు చాపాడు పోలీసు స్టేషన్‌కు సైతం వచ్చింది. ఇదే విషయంలో బాబుపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు కూడా తరలించారు. అయినప్పటికీ సుజాత, బాబు వివాహేతర సంబంధం కొనసాగుతుండడంతో ఈ నెల 17న రాత్రి గోపాల్, సుజాత గొడవ పడ్డారు. తన మాట వినలేదనే కారణంతో రాత్రి 11 గంటల ప్రాంతంలో గోపాల్ తన భార్యను గొంతు నులిమి చంపేశాడు. ఈ విషయం బయటికి పొక్కకుండా సుజాత శవాన్ని గోపాల్ గోనే సంచిలో కట్టుకుని తన బైక్‌లో మైదుకూరు – పోరుమామిళ్ల రహదారి మధ్యలో గల ఎద్దడుగు కనుమలోని ఓ ముళ్లపొద గుంతలో పడేశాడు.గ్రామంలోనే ఉన్న సుజాత తల్లి పార్వతమ్మ తన కూతురు కని్పంచలేదని పోలీసుకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు రూరల్ సీఐ శివశంకర్, ఎస్ఐ చిన్న పెద్దయ్య ఈ ఘటనపై గోపాల్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టగా స్వయంగా తానే సుజాతను హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. ఎద్దడుగు కనుమలో పడేసిన శవం వద్దకెళ్లి డీఎస్పీ రాజేంద్రప్రసాద్, రూరల్ సీఐ, ఎస్ఐ పరిశీలించారు. సుజాత మృతదేహం కుళ్లిపోవడంతో బయటికి తీసేందుకు వీలు కాక అక్కడే పంచానామా నిర్వహించారు. పార్వతమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ సీఐ తెలిపారు.