సిక్సర్‌తో జట్టును గెలిపించాడు.. హార్దిక్‌కు అఫ్గనిస్తాన్‌ అభిమాని ‘ముద్దులు’! | Afghanistan fan kisses Hardik Pandya on TV screen After team india Win | Sakshi
Sakshi News home page

Asia Cup 2022: సిక్సర్‌తో జట్టును గెలిపించాడు.. హార్దిక్‌కు అఫ్గనిస్తాన్‌ అభిమాని ‘ముద్దులు’!

Published Tue, Aug 30 2022 1:55 PM | Last Updated on Tue, Aug 30 2022 2:16 PM

Afghanistan fan kisses Hardik Pandya on TV screen After team india Win - Sakshi

PC: TWitter

ఆసియాకప్‌-2022లో భాగంగా ఆదివారం పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో  భారత్‌  ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. అఖరి వరకు ఉత్కంఠ భరితంగా జరిగిన ఈ ఈ హైవోల్టేజ్‌ మ్యాచ్‌లో హార్ధిక్‌ పాండ్యా సిక్సర్‌ కొట్టి జట్టును విజయతీరాలకు చేర్చాడు. వెంటనే స్టేడియంలో ఉన్న అభిమానులతో పాటు దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్ని అంటాయి. అయితే ఎవరూ ఊహించిని విధంగా ఆఫ్గానిస్తాన్‌లో కూడా అభిమానులు భారత విజయాన్ని సెలబ్రేట్‌ చేసుకున్నారు.

సిక్స్‌ కొట్టిన వెంటనే టీమిండియా విన్నింగ్ హీరో హార్దిక్‌ పాం‍డ్యాను తన టెలివిజన్ స్క్రీన్‌పై ఓ ఆఫ్ఘన్ అభిమాని ముద్దుపెట్టుకుంటున్నాడు. భారత జట్టుకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారనడానికి ఇదే నిదర్శనం. ఇందుకు సంబంధించిన వీడియోను యూసఫ్‌ జాయ్‌ అనాయత్‌ అనే ట్విటర్‌ యూజర్‌ పోస్ట్‌ చేశారు.​

కాగా ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఈ మ్యాచ్‌లో హార్దిక్‌ పాండ్యా ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టాడు. తొలుత బౌలింగ్‌లో మూడు వికెట్లు పడగొట్టిన హార్దిక్‌.. బ్యాటింగ్‌లో 33 పరుగులతో ఆజేయంగా నిలిచాడు.

అదే విధంగా ఆఫ్గానిస్తాన్‌ కూడా ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా ఉంది. ఇప్పటికే తొలి మ్యాచ్‌లో శ్రీలంకను చిత్తు చేసిన ఆఫ్గానిస్తాన్‌.. తమ రెండో మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో తాడోపేడో తెల్చుకోవాడనికి సిద్దమైంది. దుబాయ్‌ వేదికగా ఆఫ్గానిస్తాన్‌, బంగ్లా జట్లు ఆగస్టు 30న తలపడనున్నాయి.


చదవండి: Ban Vs Afg: ఆ జట్టు అసలు గెలిచే అవకాశమే లేదు: టీమిండియా మాజీ క్రికెటర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement