లిమా (పెరూ): భారత యువ షూటర్ ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్ అదరగొట్టాడు. ప్రపంచ జూనియర్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భాగంగా జరిగిన పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ విభాగంలో పసిడి పతకంతో మెరిశాడు. మధ్యప్రదేశ్‌కు చెందిన తోమర్ ఫైనల్లో 463.4 పాయింట్లతో విజేతగా నిలిచాడు. ఈ క్రమంలో అతడు 462.9 పాయింట్లతో ఫిలిప్ నెపిచాల్ (చెక్ రిపబ్లిక్) పేరిట ఉన్న జూనియర్ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. ఫ్రాన్స్ షూటర్ లుకాస్ క్రిజ్స్ (456.5 పాయింట్లు) రజతాన్ని... అమెరికాకు చెందిన గావిన్ బారి్నక్ (446.5 పాయింట్లు) కాంస్యాన్ని దక్కించుకున్నారు.
అంతకుముందు జరిగిన క్వాలిఫయింగ్ సెషన్‌లో 1185 పాయింట్లు సాధించిన తోమర్... పెని ఇస్తివాన్ (హంగేరి) పేరిట ఉన్న క్వాలిఫయింగ్ ప్రపంచ రికార్డును సమం చేశాడు. ఓవరాల్‌గా ఇప్పటి వరకు ఈ మెగా ఈవెంట్‌లో భారత్ 8 స్వర్ణాలు, 6 రజతాలు, 3 కాంస్యాలతో కలిపి మొత్తం 17 పతకాలతో అగ్రస్థానంలో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment